LATEST NEWS
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేశారు. కాగా.. తెలంగాణ భవన్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్ అన్న ఆయన.. గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో దుర్మార్గ, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. భారతదేశ చరిత్రలోనే పాతిక వసంతాల ప్రస్థానం పూర్తి చేసుకున్న పార్టీలు కొన్ని మాత్రమే ఉన్నాయనీ, వాటిలో ఒకటి బీఆర్ఎస్ అన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పునరంకితం అవుతుందనీ, అరాచక కాంగ్రెస్ , బీజేపీ పాలన నుండి తెలంగాణను మళ్లీ పట్టాలు ఎక్కించడం కోసం పోరాడుదామనీ పిలుపునిచ్చారు. కేసీఆర్ సైనికులుగా బలగంగా కలిసికట్టుగా కదం తొక్కుతాదామన్నారు. తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తారని, నేతలకు దిశనిర్దేశం చేస్తారని కేటీఆర్ తెలిపారు. కవిత పార్టీ, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మాత్రం కేటీఆర్ ఇష్టపడలేదు.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన మంత్రి అజారుద్దీన్, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం సోమవారం (ఏప్రిల్ 27) ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
కాగా ప్రస్తుతం రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మొహమ్మద్ అజారుద్దీన్‌కు ఈ ప్రమాణ స్వీకారం భారీ ఊరటనిచ్చింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలలోగా ఏదో ఒక చట్టసభకు ప్రాతినిథ్యం వహించాలి. అంటే.. శాసనసభ, మండలి సభ్యుడిగా ఎన్నిక కావాలి. మంత్రి అజారుద్దీన్ కు ఈ ఆరునెలల గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఆ గడువు ముగియడానికి మూడు రోజుల ముందే ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రిపదవికి ఉన్న చిక్కులు తొలగిపోయాయి.
ఇక తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం తొలిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. ఉద్యమ నేతగా పేరున్న ఆయన ఇకపై ప్రజా సమస్యలపై, ప్రభుత్వ నిర్ణయాలపై మండలి వేదికగా తన గళాన్ని వినిపించనున్నారు. ఈ నియామకంతో శాసనమండలిలో అధికార పక్షం బలం పెరిగింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరిట కొత్త పార్టీ ప్రారంభించడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీలోని అహంకారపూరిత ధోరణులు, ముఖ్యంగా కేటీఆర్ మరియు హరీష్ రావుల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న కల్వకుంట్ల నేరుగా తండ్రి కేసీఆర్ పైనే యుద్ధం ప్రకటించారు. బీఆర్ఎస్ ఉద్యమకారులను, మేధావులను పక్కనపెట్టి కేవలం కొందరికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ పార్టీ పార్టీ పునాదులు బలహీనపడ్డాయి. ఇప్పుడు కవిత సొంత పార్టీతో బీఆర్ఎస్ కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని అంటున్నారు.
కవిత వ్యూహం కేవలం కొత్త పార్టీ పెట్టడం మాత్రమే కాదు, బీఆర్ఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్న కేడర్‌ను తనవైపు తిప్పుకోవడం. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పాత పేరుపై ప్రజలకు ఉన్న సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆమె తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అనే పేరును ఎంచుకోవడం ద్వారా.. పాత టీఆర్ఎస్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడమనే వ్యూహం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కవిత కొత్త పార్టీ వల్ల ప్రధానంగా నష్టపోయేది బీఆర్ఎస్ అని అంటున్నారు. కవిత కొత్త పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకునే చీలుస్తుందని చెబుతున్నారు.
అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ఈ అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయనడంలో సందేహం లేదు. కవితకు బీజేపీ పరోక్ష మద్దతు ఉండవచ్చని, తద్వారా బీఆర్ఎస్ బార్గేనింగ్ శక్తిని తగ్గించడమే ఆమె అసలు లక్ష్యమని విశ్లేషకులు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి ఆరోపణలు, కుటుంబ సభ్యుల మధ్య ఈగో క్లాష్‌లు కూడా ఈ చీలికకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.ఇదే విషయాన్ని తెలుగువన్ చర్చా వేదికలో సువేరా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
కవిత నిర్ణయం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తిని సృష్టించవచ్చున్న ఆయన.. ఆమె కేవలం కేసీఆర్ బిడ్డగానే కాకుండా, తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను నిర్మించుకోవాలని చూస్తున్నాన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ బలహీనపడి, క్రమంగా బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు కొట్టిపారేయలేన్న సువేరా.. కవిత పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆమె ఎంచుకునే నాయకులు, యూత్ మేనిఫెస్టోపై ఆధారపడి ఉంటుందన్నారు. ఒకవేళ ఆమె బలమైన శక్తిగా ఎదిగితే, తెలంగాణలో త్రిముఖ పోటీ మరింత తీవ్రమై రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మహిళా బిల్లు వంటి అంశాలపై ఆమె చేస్తున్న పోరాటం మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సువేరా అభిప్రాయపడ్డారు.
ALSO ON TELUGUONE N E W S
Tollywood actor JD Chakravarthy recently put an end to the widespread rumors regarding his relationship with popular television anchor and actress Vishnu Priya. Over the past few months, social media has been buzzing with speculation that the two were involved in a romantic affair and were even planning to tie the knot.
Addressing these ongoing rumors during a recent media interaction, JD Chakravarthy firmly denied the claims. He clarified that there is absolutely no truth to the news of a romance or a second marriage. Instead, he explained that they share a strictly respectful bond, describing it as a guru-student relationship.
The actor mentioned that Vishnu Priya has a lot of respect for him and even addresses him as 'Guruvu garu' whenever she calls him. The speculations initially started after the duo worked together on a project and made a few public appearances.
Vishnu Priya had also openly expressed her strong admiration for the senior actor in past interviews, which ended up fueling the gossip. However, Chakravarthy's straightforward response has now shut down the baseless rumors, making it clear that she is simply a dear student to him. He is currently busy focusing on his upcoming film and web series commitments.
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మహానటుడు, తెలుగు వారి ఆస్తి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారకరామారావు(Ntr)గారి గురించి చెప్పుకోవాలన్నా, అయన గురించి ఒక వార్త పుట్టాలన్నా ఎంతో మందికి పెట్టి పుట్టాలనే నానుడి చాలా బలంగా ఉంది. అంతలా అమరత్వాన్ని పొందిన అమరుడిగా అభిమానుల,ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించాడు. అలాంటి వ్యక్తి గురించి ఒకప్పటి హీరో, ప్రముఖ నటుడు భానుచందర్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అప్పుడే ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఊడిపడ్డ నోట్లు లాగా తళతళలాడుతున్నాయి. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
భానుచందర్(Bhanu Chander)మాట్లాడుతు ఎన్టీఆర్ గారు మా ఇంటికి ఒకసారి వచ్చారు. ఆయన వెళ్తుండగా మా అమ్మ ఉండే పోర్షన్ కి రానందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే ఎన్టీఆర్ తన వెంట వచ్చిన పెద్ద కాన్వాయ్‌ను గేట్ దగ్గరే ఆపి, ఒక్కరే 60 మెట్లు ఎక్కి పై అంతస్తులోని మా అమ్మ పోర్షన్‌కి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు.. ఆ సందర్భంలో నువ్వు గొప్ప ఆర్టిస్ట్ అవుతావు, తల్లిదండ్రులని మర్చిపోవద్దు అని నాతో చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్లకు, మా నాన్నక్యాన్సర్ బారిన పడ్డారు. ఆపరేషన్ కి డబ్బులు అవసరమయ్యాయి. అప్పటికి నేను సినిమాలు చేస్తున్నాను. రెమ్యూనరేషన్ ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి పరిస్థితి వివరించాను. ఎన్టీఆర్ గారు వెంటనే నిర్మాణ సంస్థకు ఫోన్ చేసి, ఆ అమౌంట్ ఇంటికి పంపించేలా చూసారు. ఎన్టీఆర్ గారు బోళా శంకరుడు”, “పసిపిల్లల మనస్తత్వం” ఉన్న వ్యక్తి . షూటింగ్‌లలో కూడా తన పక్కనే కూర్చోమని, తన కారులోనే ప్రయాణించమని చెప్పేవారని చెప్పుకొచ్చాడు.
also read: Shriya Saran: ఎందుకు ఆ ప్రశ్న వేశారు.. యాంకర్ కి శ్రియా సూపర్ రిప్లై
భానుచందర్ తండ్రి పేరు మాస్టర్ వేణు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన ట్యూన్స్ ఆయన పేరుపై ఉన్నాయి, ఎన్టీఆర్ నుంచి వచ్చిన అనేక చిత్రాలకి కూడా వేణు గారు ఎన్నో జనరంజకమైన ట్యూన్స్ ని అందించడం జరిగింది.
- మరో సంచలనానికి సిద్ధమవుతున్న బోయపాటి శ్రీను
- కోలీవుడ్ స్టార్ తో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) తదుపరి ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. 'అఖండ-2' తర్వాత ఆయన ఏ హీరోతో సినిమా చేస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, బోయపాటి ఈసారి ఒక క్రేజీ కోలీవుడ్ స్టార్‌తో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఆ స్టార్ ఎవరో కాదు.. కార్తీ (Karthi).
డైరెక్టర్ బోయపాటి శ్రీను తన తర్వాతి సినిమాను కార్తీతో చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వార్తలు వస్తున్నాయి. తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండటంతో.. ఈ కాంబినేషన్ న్యూస్ రాగానే ఇరు భాషల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని సమాచారం.
బోయపాటి శ్రీను సినిమాలు అంటేనే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, పవర్‌ఫుల్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్. మరోవైపు హీరో కార్తీ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటే వెండితెరపై మాస్ విస్ఫోటనమే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వస్తున్న దాదాపు అన్ని పెద్ద సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే బోయపాటి - కార్తీ సినిమాను కూడా తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు సమాచారం.
కార్తీ లాంటి 'పెర్ఫార్మర్'కు బోయపాటి శ్రీను మార్క్ 'మాస్ ఎలిమెంట్స్' తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం. 'ఖైదీ', 'సర్దార్' వంటి సినిమాలతో మెప్పించిన కార్తీ, బోయపాటి విజన్‌లో ఎలా కనిపిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్టిల్ ఈ నిమిషం సినిమాలకి గుడ్ బై చెప్పినా సరే సౌత్ సినీ పరిశ్రమ తన మనుగడ సాగిస్తున్నంత కాలం శ్రియా(Shriya Saran)పేరుని మరవడం అనేది జరగని పని. అంత చరిష్మా శ్రీయ సొంతం. సెకండ్ ఇన్నింగ్స్ అనేది ఉండదు డ్యూడ్ అంటూ మిరాయ్ లో అంబికా ప్రజాపతిగా తన నటన తాలూకు విశ్వరూపాన్ని ప్రదర్శించింది. రీసెంట్ గా తన ఏజ్ కి సంబంధించిన విషయంపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. సదరు వ్యాఖ్యలు ఘాటైనవి కావడంతో సోషల్ మీడియాలో శ్రేయ తాలూకు సువాసనలు ఒక రేంజ్ లోనే చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ మ్యాటర్ పై ఒక లుక్ వేద్దాం.
ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రీయ తో యాంకర్ మాట్లాడుతూ 43 ఏళ్ళ వయసులో గ్లామర్ ని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారనే ప్రశ్న అడగడం జరిగింది. అందుకు శ్రీయ మాట్లాడుతూ మీరు ఈ ప్రశ్న వేయడమే తప్పు, వయసుతో పని ఏముంది. ఒకప్పుడు హీరోయిన్లకు 30 ఏళ్లు దాటినా లేదా పెళ్లైనా వారి కెరీర్ ముగిసినట్లే అని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఇండస్ట్రీలో ఏజ్ అనేది ఇప్పుడు ఒక అడ్డంకి కాదు. నటీనటుల ప్రతిభకి, వారు ఎంచుకునే పాత్రలకు ప్రాధాన్యత పెరుగుతోంది. 40 ఏళ్లలో కూడా అద్భుతమైన పాత్రలు చేసే అవకాశం మాకు దక్కుతోంది. ప్రేక్షకులు కూడా నటి వయస్సు కంటే ఆమె పర్ఫార్మెన్స్‌ను చూసి ఆదరిస్తున్నారు" అని శ్రియా ఆనందం వ్యక్తం చేశారు.
also read: Peddi: పెద్దికి శృతి హాసన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇంతేనా!
నటిగా ఎప్పుడూ సిద్ధంగా ఉండటం నా బాధ్యత. క్రమం తప్పకుండా యోగా, డాన్స్ మరియు సరైన ఆహారపు అలవాట్లు పాటించడం వల్లే ఇప్పటికీ యాక్టివ్‌గా ఉండగలుగుతున్నాను. వయస్సు పెరుగుతున్న కొద్దీ మనం మరింత పరిణితి చెందుతాం. అది మన నటనలో కూడా కనిపిస్తుంది. అందుకే ఈ దశలో మరింత వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. పలు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.
-సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పెద్ది స్పెషల్ సాంగ్
-శృతి హాసన్ తో ఆల్రెడీ షూట్
-కళ్ళు తిరిగే రెమ్యునరేషన్!
-ఆ డిటైల్స్ చూద్దాం
చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టుగా ఏం చేస్తాం.. శృతి హాసన్(Shruthi Haasan)తో పెట్టుకుంటే అట్లనే ఉంటుంది మరి. తన నుంచి ఇంకా కొత్త సినిమా ప్రకటన రాకపోయే సరికి శృతి పని అయిపోయిందని కొంత మంది భావిస్తు వస్తున్నారు. తన అప్ కమింగ్ సినిమాల లిస్ట్ చూసుకున్నా ఆ కొంత మంది బావనకే మెజారిటీ ఓట్లు వచ్చే పరిస్థితి. సలార్ పార్ట్ 2 ఉన్నా చాలా టైం ఉంది. కానీ వాటన్నిటిని పక్కన పెడుతూ ఇక్కడ ఉంది ఎవరు శృతి హాసన్ అని చెప్తుంది. ఈ న్యూస్ ఏంటో చూద్దాం.
'పెద్ది'(Peddi)లో శృతి స్పెషల్ సాంగ్ చేస్తుంది. మేకర్స్ ఈ విషయాన్నీ అధికారకంగా ప్రటించకపోయినా, ఆల్రెడీ స్పెషల్ సాంగ్ షూట్ లో ఉందనేది ఫిలిం సర్కిల్స్ టాక్. ఈ సాంగ్ కోసం శ్రుతి మూడున్నర కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక హీరోయిన్ ఒక పూర్తి సినిమాకు తీసుకునే మొత్తాన్ని కేవలం ఒక్క సాంగ్ కే శ్రుతి అందుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమెకున్న క్రేజ్, డ్యాన్స్ స్కిల్స్ దృష్ట్యా నిర్మాతలు ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు వెనుకాడలేదని సమాచారం.
Also read: Chiranjeevi: ఇంటర్వెల్ ప్లాన్ చేస్తున్న చిరంజీవి.. బాబీతో మూవీ ఉందా!
ఇక సదరు సాంగ్ కి ఏ ఆర్ రెహ్మాన్(Ar Rehman)అదిరిపోయే ట్యూన్ ఇచ్చాడని, సదరు సాంగ్ రేపు థియేటర్స్ లో ఫ్యాన్స్ ఎవరో ప్రేక్షకులెవరో తెలియని విధంగా చరణ్(Ram Charan),శృతి ల స్టెప్స్ అండ్ మూమెంట్స్ ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది. జూన్ 25 న పెద్ది వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది, ఇష్టంగా అనిపిస్తుంది, తమ చుట్టూ ఒక కొత్త ప్రపంచం ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాలంతో పాటు ప్రేమ కూడా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా పరీక్షలు పెడుతూ ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు సిన్సియర్ గా ఉన్నారా లేదా అనేది కూడా కాలమే డిసైడ్ చేస్తుంది. అయితే ప్రేమించిన చాలా మంది సంతోషం కంటే ఎక్కువ బాధపడిన సందర్బాలే ఉంటాయి. పదే పదే మనోవేదనకు గురవుతూ ఉంటారు. ప్రేమ అనేది కేవలం ఒక్కరితో అగేది కూడా కాదు.. చాలామంది ప్రేమలో ఫెయిల్యూర్ వచ్చాక లేదా బ్రేకప్ అయ్యాక.. మళ్లీ ఇంకొకరితో ప్రేమలో పడతారు. కానీ అక్కడ కూడా మళ్లీ బాధ.. పదే పదే మానసిక వేధన బహుమానంలా లభిస్తాయి. అసలు ప్రేమించేవారికి పదే పదే మానసిక వేధన ఎందుకు ఎదురవుతోంది? ఇందులో తప్పు ఎవరిది? తెలుసుకుంటే..
బాధ కలిగినా అదే మార్గంలో ప్రయాణం..
చాలామంది ప్రేమలో ఉన్నప్పుడు అయినా జీవితంలో వేరే బంధంలో అయినా.. తమకు బాధ కలిగినా సరే.. అదే జోన్ లోనే ఉండటానికి ఇష్టపడతారు. చిన్నతనంలోని అనుభవాలు, పెరిగిన వాతావరణం, గతంలో ఏర్పడిన బందాల వల్ల కలిగిన బాధ.. బందంలో గౌరవం లేకపోవడం వంటివి మనిషిని మారేలా చేయాలి. కానీ చాలామంది కొత్తగా ఏర్పడే ప్రతి బందంలోనూ అవే తప్పులు పదే పదే చేస్తుంటారు. అందుకే పదే పదే మనోవేధన కూడా ఎదురవుతూ ఉంటుంది.
ఎమోషన్స్ నుండి బయట పడలేకపోవడం..
చాలా మంది తమకు తెలియకుండానే తమలాంటి భాగస్వాములనే ఎంచుకుంటారు. ఇది వారి సబ్ కాన్షియస్ మైండ్ చేసే ఒక ప్రయోగం. గతంలో విషపూరితమైన సంబంధాలను అనుభవించి ఉంటే మనస్సు వాటిని సాధారణమైనవిగా అంగీకరిస్తుంది. అందుకే పదే పదే అలాంటి రిలేషన్స్ వైపుకే ఆకర్షితులు అవుతుంటారు.
తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడం..
ఒక వ్యక్తి తమను తాము తక్కువగా అంచనా వేసుకున్నప్పుడు, వారు తరచుగా సంబంధాలలో తాము తక్కువ అన్నట్టు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎదుటి మనిషి వ్యక్తిత్వం గురించి పెద్దగా పట్టించుకోకుండా పదే పదే తప్పుడు భాగస్వామిని ఎంచుకుంటారు.
మార్పు పట్ల భయం..
చాలా మంది తాము తప్పులు చేస్తున్నామని తెలిసినా, మారడం వల్ల ఎదురయ్యే నష్టాలు, ప్రమాదాలను చూసుకుని మారడానికి భయపడతారు. అందుకే వారు అవే పాత పద్ధతులలో చిక్కుకుపోయి ఉంటారు.
గత గాయాల ప్రబావం..
గత సంబంధాల వల్ల కలిగిన గాయం, పూర్తిగా మానకపోవడం వంటివి చాలామంది పదే పదే అవే తప్పులు చేసేలా చేస్తాయి. ఇలాంటి వారు భావోద్వేగపరంగా కోలుకునేంత వరకు, సరైన నిర్ణయాలు తీసుకోలేరు.
గందరగోళం..
చాలా మంది ప్రేమకు , భావోద్వేగ అనుబంధానికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోరు. వారు తప్పుడు వ్యక్తికి దగ్గరై, దానినే ప్రేమగా పొరబడతారు, తద్వారా అవే తప్పులను రిపీట్ చేస్తూ ఉంటారు.
ప్రేమలో లేదా రిలేషన్ లో అవే తప్పులను పదే పదే చేయడం అనేది విధి రాసే రాత కాదు.. అది మనిషి అలవాట్లు, ఆలోచనా విధానం ఇచ్చే ఫలితం. ప్రతి వ్యక్తి తన పద్ధతులను గుర్తించి, తమను తాము సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే ఇలా పదే పదే బాధపడే బంధంలో చిక్కుకోవడాన్ని నివారించగలుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే.. ప్రతి మనిషి ప్రేమలో లేదా రెలేషన్ లో.. పదే పదే మానసిక వేదనకు అనుభవించడానికి అక్షరాలా ఆ మనిషి చేతులారా చేసుకునే తప్పులు, పరిస్థితులకు అనుగుణంగా మారకపోవడం, పాత ఆలోచనలు, సిద్దాంతాలలో చిక్కుకుని ఉండటం వంటివి కారణం అవుతాయి.
*రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు తప్పనిసరి అవుతాయి. రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి. అయితే కూలర్లు వాడేవారు దాని శుభ్రత గురించి మాత్రం అంత శ్రద్ద తీసుకోరు. దీని వల్ల నీరు మురికిగా మారి దోమలు పెరగడానికి ఆవాసంగా మారడమే కాకుండా.. . కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచకపోతే కూలింగ్ కూడా పెద్దగా రాదు. అయితే కూలర్ లో నీటిని ప్రతిరోజూ శుభ్రం చేయడం అంత ఈజీ ఏమీ కాదు.. కొన్ని కంపెనీల కూలర్లలో నీటిని నింపడం సులువే.. కానీ వాటిలో నీటిని తొలగించడం, శుభ్రం చేయడం కాస్త శ్రమతో కూడుకున్నదే.. అయితే.. కూలర్లలో నీరు ప్రతిరోజూ శుభ్రం చేయకపోయినా కొన్నిరోజుల పాటు నీరు శుభ్రంగా ఉండాలన్నా, తాజాగా అనిపించాలన్నా కేవలం ఒకే ఒక్క చిట్కా అద్బుతంగా పనిచేస్తుంది. అదేంటో తెలుసుకుంటే..
పటిక..
కూలర్‌లోని నీటిని శుభ్రంగా ఉంచడానికి పటిక చాలా సులభమైన, ఇంటి చిట్కా. దీనిని నీటిలో వేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కూలర్ ట్యాంక్‌లో నీరు తరచుగా ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది, ఇది తొందరగా మురికిగా మారే అవకాశం ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ నీటిలో దోమలు ఆవాసం ఏర్పాటు చేసుకుని గుడ్లు పెడతాయి. అయితే కూలర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే దానిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. నీటిలో ఒక చిన్న పటిక ముక్కను వేయడం వల్ల నీటిని శుభ్రపరచవచ్చు. పైగా దోమల సమస్య కూడా తగ్గుతుంది.
కూలర్ ట్యాంక్ లో పటిక వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..
నీటి స్వచ్చత..
పటిక నీటిలోని దుమ్ము, ధూళి , చిన్న కణాలను బంధిస్తుంది. ఈ కణాలు బరువెక్కి అడుగుకు చేరుకుంటాయి, దీనివల్ల పైన ఉన్న నీరు స్వచ్ఛంగా ఉంటుంది.
దోమలకు చెక్..
పటిక నీటిని శుద్ధి చేయడం వల్ల దోమల గుడ్లు, లార్వాలు సులభంగా వృద్ధి చెందలేవు. దీనివల్ల దోమల సమస్య గణనీయంగా తగ్గుతుంది.
దుర్వాసన..
కూలర్ నీటి నుండి ఏదైనా వింత లేదా దుర్వాసన వస్తుంటే, దానిని చాలా వరకు తగ్గించడంలో పటిక సహాయపడుతుంది.
బ్యాక్టీరియా..
పటికకు తేలికపాటి యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయి, ఇవి నీటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడతాయి.
నీటి నాణ్యత..
పటిక నీటిని ఎక్కువ సేపు శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది, దీనివల్ల కూలర్ ప్యాడ్‌లు త్వరగా పాడవకుండా ఉంటాయి , గాలి చల్లగా ఉంటుంది.
పటికను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు..
పటికను ఎక్కువ పరిమాణంలో వాడకూడదు. ఒక చిన్న ముక్క సరిపోతుంది. ఎక్కువ పటిక కలపడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా కూలర్‌లోని నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి.
*రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు, సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు. వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి. ఈ కారణంగానే ఇప్పట్లో ప్రతి ఇంట్లో కూలర్లు వాడుతున్నారు. కాస్త అర్థిక స్థితి ఉన్నవారేతై ఏసీ లు కూడా పెట్టించుకుంటారు. కానీ రానురాను పెరుగుతున్న ఎండలు, వాటి తాలుకూ వేడి కారణంగా కూలర్లు కూడా సరిపోవడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ.. సాధారణ కూలర్ ను కూడా చక్కగా ఏసీ లాంటి చల్లదనం ఇచ్చేలా చేయవచ్చు. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. సాధారణ కూలర్ తో ఏసీ లాంటి చల్లదనం కావాలంటే.. ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుంటే..
సాల్ట్ , ఐస్..
కూలర్ చల్లటి గాలిని అందించాలని అనుకుంటే, ఐస్ లేదా ఉప్పు నీటిని కలపడం చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఇది చాలా ఫేమస్ చిట్కా కూడా. కూలర్ ట్యాంకులో రాళ్ల ఉప్పు, ఐస్ క్యూబ్స్ వేస్తారు. రాళ్ల ఉప్పు ఐస్ క్యూబ్స్ కరగకుండా ఎక్కువ సేపు ఉండేలా చేస్తాయి. దీని వల్ల కూలింగ్ బాగా వస్తుంది. అయితే.. ఇది రెగ్యులర్ గా చేయడం మంచిది కాదు.. ఉప్పు తొందరగా చిలుము పట్టేలా చేస్తుంది. దీని వల్ల కూలర్ లోని మెటల్ భాగాలు తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా వేడి భరించలేని సమయాల్లో ట్రై చేయడం మంచిది.
వెంటిలేషన్..
చాలా మంది ఏసీ లాంటి చల్లదనం వస్తుందని ఆశించి, కూలర్లను మూసి ఉన్న గదులలో వాడుతుంటారు, కానీ ఇది పెద్ద పొరపాటు. సరైన వెంటిలేషన్ ఉన్నప్పుడే ఎయిర్ కూలర్ సరిగ్గా పనిచేస్తుంది. గదిలో వేడి గాలి బయటకు పోవడానికి , చల్లని గాలి లోపల ప్రసరించడానికి వీలుగా ఒక కిటికీని లేదా తలుపును తెరిచి ఉంచడం ముఖ్యం. సరైన వెంటిలేషన్ కూలర్ పనితీరును మెరుగుపరుస్తుంది.
శుభ్రత..
కాలక్రమేణా కూలర్ ప్యాడ్‌లపై దుమ్ము, ధూళి పేరుకుపోయి, వాటి కూలింగ్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. అందువల్ల వాటిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం లేదా మార్చడం ముఖ్యం. కూలర్ చాలా చల్లని గాలిని ఇవ్వాలి అంటే.. కూలర్ లోపల వట్టివేర్లతో తయారు చేసిన మ్యాట్లను ఉపయోగించాలి. ఇది కూలింగ్ ను మెరుగుపరుస్తుంది. వట్టివేర్ల గుండా నీరు ప్రవహించినప్పుడు, గాలి చల్లగా, తాజాగా మారుతుంది, మంచి తేలికపాటి సువాసనను కూడా అందిస్తుంది.
పైన పేర్కొన్న చిట్కాలను పాటించడం వల్ల వేసవి కాలంలో కూలర్ ఏసీ లాంటి చల్లదనాన్నిఇస్తుంది.
*రూపశ్రీ.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేశారు. కాగా.. తెలంగాణ భవన్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన కేటీఆర్.. 14ఏళ్లపాటు పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ సాధించారన్నారు.
ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్ అన్న ఆయన.. గత రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో దుర్మార్గ, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. భారతదేశ చరిత్రలోనే పాతిక వసంతాల ప్రస్థానం పూర్తి చేసుకున్న పార్టీలు కొన్ని మాత్రమే ఉన్నాయనీ, వాటిలో ఒకటి బీఆర్ఎస్ అన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పునరంకితం అవుతుందనీ, అరాచక కాంగ్రెస్ , బీజేపీ పాలన నుండి తెలంగాణను మళ్లీ పట్టాలు ఎక్కించడం కోసం పోరాడుదామనీ పిలుపునిచ్చారు. కేసీఆర్ సైనికులుగా బలగంగా కలిసికట్టుగా కదం తొక్కుతాదామన్నారు. తెలంగాణ భవన్ కు కేసీఆర్ వస్తారని, నేతలకు దిశనిర్దేశం చేస్తారని కేటీఆర్ తెలిపారు. కవిత పార్టీ, ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు మాత్రం కేటీఆర్ ఇష్టపడలేదు.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన మంత్రి అజారుద్దీన్, టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం సోమవారం (ఏప్రిల్ 27) ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి కార్యాలయంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ ఇరువురి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
కాగా ప్రస్తుతం రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మొహమ్మద్ అజారుద్దీన్‌కు ఈ ప్రమాణ స్వీకారం భారీ ఊరటనిచ్చింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలలోగా ఏదో ఒక చట్టసభకు ప్రాతినిథ్యం వహించాలి. అంటే.. శాసనసభ, మండలి సభ్యుడిగా ఎన్నిక కావాలి. మంత్రి అజారుద్దీన్ కు ఈ ఆరునెలల గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఆ గడువు ముగియడానికి మూడు రోజుల ముందే ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో మంత్రిపదవికి ఉన్న చిక్కులు తొలగిపోయాయి.
ఇక తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం తొలిసారిగా శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. ఉద్యమ నేతగా పేరున్న ఆయన ఇకపై ప్రజా సమస్యలపై, ప్రభుత్వ నిర్ణయాలపై మండలి వేదికగా తన గళాన్ని వినిపించనున్నారు. ఈ నియామకంతో శాసనమండలిలో అధికార పక్షం బలం పెరిగింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరిట కొత్త పార్టీ ప్రారంభించడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీలోని అహంకారపూరిత ధోరణులు, ముఖ్యంగా కేటీఆర్ మరియు హరీష్ రావుల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న కల్వకుంట్ల నేరుగా తండ్రి కేసీఆర్ పైనే యుద్ధం ప్రకటించారు. బీఆర్ఎస్ ఉద్యమకారులను, మేధావులను పక్కనపెట్టి కేవలం కొందరికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆ పార్టీ పార్టీ పునాదులు బలహీనపడ్డాయి. ఇప్పుడు కవిత సొంత పార్టీతో బీఆర్ఎస్ కోలుకోలేని విధంగా దెబ్బతీసిందని అంటున్నారు.
కవిత వ్యూహం కేవలం కొత్త పార్టీ పెట్టడం మాత్రమే కాదు, బీఆర్ఎస్ పట్ల అసంతృప్తిగా ఉన్న కేడర్‌ను తనవైపు తిప్పుకోవడం. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పాత పేరుపై ప్రజలకు ఉన్న సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆమె తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అనే పేరును ఎంచుకోవడం ద్వారా.. పాత టీఆర్ఎస్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడమనే వ్యూహం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కవిత కొత్త పార్టీ వల్ల ప్రధానంగా నష్టపోయేది బీఆర్ఎస్ అని అంటున్నారు. కవిత కొత్త పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకునే చీలుస్తుందని చెబుతున్నారు.
అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ఈ అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాయనడంలో సందేహం లేదు. కవితకు బీజేపీ పరోక్ష మద్దతు ఉండవచ్చని, తద్వారా బీఆర్ఎస్ బార్గేనింగ్ శక్తిని తగ్గించడమే ఆమె అసలు లక్ష్యమని విశ్లేషకులు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి ఆరోపణలు, కుటుంబ సభ్యుల మధ్య ఈగో క్లాష్‌లు కూడా ఈ చీలికకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.ఇదే విషయాన్ని తెలుగువన్ చర్చా వేదికలో సువేరా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
కవిత నిర్ణయం తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తిని సృష్టించవచ్చున్న ఆయన.. ఆమె కేవలం కేసీఆర్ బిడ్డగానే కాకుండా, తనకంటూ ఒక సొంత ఇమేజ్‌ను నిర్మించుకోవాలని చూస్తున్నాన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ బలహీనపడి, క్రమంగా బీజేపీలో విలీనమయ్యే అవకాశాలు కొట్టిపారేయలేన్న సువేరా.. కవిత పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఆమె ఎంచుకునే నాయకులు, యూత్ మేనిఫెస్టోపై ఆధారపడి ఉంటుందన్నారు. ఒకవేళ ఆమె బలమైన శక్తిగా ఎదిగితే, తెలంగాణలో త్రిముఖ పోటీ మరింత తీవ్రమై రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మహిళా బిల్లు వంటి అంశాలపై ఆమె చేస్తున్న పోరాటం మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సువేరా అభిప్రాయపడ్డారు.
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది. ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు. అయితే చాలామంది అల్పాహారంలో తీసుకునే ఆహారాలు కేవలం కడుపు నిండినట్టు లేదా రుచి కోసం తీసుకుంటూ ఉంటారు. కానీ శరీరంలో ఎంతో ముఖ్యమైన భాగమైన పేగు ఆరోగ్యం బాగుండటం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చాలామందికి తెలియదు. ఉదయాన్నే తీసుకునే ఆహారమే పేగు ఆరోగ్యాన్ని, రోజు మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని ఎంతో సేఫ్ గా ఉంచే కొన్ని బ్రేక్ ఫాస్ట్ లు ఉన్నాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ ఆహారాలు తీసుకుంటే రోజు మొత్తం హాయిగా గడిచిపోతుంది. అవేంటో తెలుసుకుంటే..
ఓట్స్, చియా సీడ్స్ స్మూతీ..
ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే కరిగే ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, మెరుగుపరుస్తుంది. ఓట్స్ ను చియా విత్తనాలతో కలిపితే, ఫైబర్ కంటెంట్ రెట్టింపు అవుతుంది. చియా విత్తనాలు నీటిని గ్రహిస్తాయి, జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి, ఇది ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది.
వెజిటబుల్ రాగి ఇడ్లీ లేదా దోశ..
రాగులు ఫైబర్, కాల్షియం పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇతర ధాన్యాలతో పోలిస్తే, రాగులలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. తురిమిన క్యారెట్లు, బీన్స్, పాలకూరను రాగి పిండిలో కలపాలి. ఆవిరి మీద ఉడికించి ఇడ్లీగా తినవచ్చు. లేదంటే దీంతో దోశ కూడా ట్రై చేయవచ్చు. . ఇది తేలికగా ఉంటూనే జీర్ణవ్యవస్థకు అనుకూలంగా ఉంటుంది.
మొలకెత్తిన ధాన్యాలు..
పెసలు, శనగలు లేదా బొబ్బర్లు వంటివి మొలకెత్తడం వల్ల వాటి ఫైబర్, ఎంజైమ్ కంటెంట్ పెరుగుతుంది. మొలకెత్తిన ధాన్యాలు ప్రీబయోటిక్స్‌గా పనిచేస్తాయి. మంచి గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మొలకెత్తిన పెసలను దోసకాయ, టమోటా, నిమ్మరసం, కొద్దిగా ఉప్పుతో కలపాలి. ఇది ఫైబర్‌ను అందించడమే కాకుండా ప్రోటీన్ కూడా పుష్కలంగా అందిస్తుంది.
మల్టీగ్రెయిన్ వెజిటబుల్ ఉప్మా..
సెమోలినాకు బదులుగా మల్టీగ్రెయిన్ గంజి లేదా ఓట్ ఉప్మా తయారు చేయడం వల్ల ఫైబర్ మరింత మెరుగవుతుంది. బఠానీలు, కాలీఫ్లవర్, బీన్స్ వంటి కూరగాయలను జోడించడం వల్ల ఫైబర్ కంటెంట్ మరింత పెరుగుతుంది. తక్కువ నూనె, ఆకుపచ్చ కూరగాయలను పుష్కలంగా జోడిండం వల్ల దీనిలో హెల్తీ బెనిఫిట్స్ మెరుగవుతాయి. జీర్ణక్రియకు ప్రయోజనకరంగా భావించే కరివేపాకును జోడిస్తే మరీ మంచిది.
జొన్న రోటీ, పెరుగు..
చిరు ధాన్యాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చిరు ధాన్యాలు, జొన్నలు గ్లూటెన్ రహితంగా ఉండటమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. పెరుగు అనేది పేగులో మంచి బ్యాక్టీరియాను పెంచే ప్రోబయోటిక్. చిరు ధాన్యాల రోటీతో ఒక గిన్నెడు తాజా పెరుగు కలిపి తింటే చాలా మంచిది. ఈ కాంబో ఫైబర్, ప్రోబయోటిక్స్ రెండూ కలిగి ఉంటుంది.
*రూపశ్రీ.
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి. మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు, తర్వాత పేస్ట్ లు వచ్చాయి. ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి. అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి. చాలా పరిశుభ్రతలో బాగంగా మౌత్ వాష్ లు వాడుతుంటారు. కొందరు పళ్లు తోమే పని లేకుండా మౌత్ వాష్ వాడితే.. మరికొందరు పళ్లు తోమిన తర్వాత కూడా ఇంకా పళ్లు ఎక్కువగా శుభ్రం అవుతాయని అతి శుభ్రతతో మౌత్ వాష్ కూడా వాడతారు. అయితే.. మౌత్ వాష్ వాడే వారికి డాక్టర్లు ఓ చల్లని చావు కబురు చెబుతున్నారు. మౌత్ వాష్ వాడితే రక్తపోటు సమస్య వస్తుందని అంటున్నారు. దీని గురించి వైద్యులు చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకుంటే..
మౌత్ వాష్.. నోటి ఆరోగ్యం..
నోటిలోని మంచి బ్యాక్టీరియా మానవ శరీరానికి చాలా అవసరం. ఈ బ్యాక్టీరియా ఆహారంలోని నైట్రేట్‌లను నైట్రైట్‌లుగా మార్చడానికి సహాయపడతాయి, ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ అనేది రక్తనాళాలను సడలించడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి , రక్తపోటును నియంత్రించడానికి సహాయపడే ఒక ముఖ్యమైన అంశం.
మౌత్ వాష్ వల్ల కలిగే నష్టం..
బలమైన యాంటీసెప్టిక్ మౌత్‌వాష్‌లు నోటిలోని మంచి బ్యాక్టీరియాను కూడా చంపగలవని నిపుణులు అంటున్నారు. ఇది నైట్రేట్, నైట్రైట్‌గా మారే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది , శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను తగ్గించగలదు. ఇది నేరుగా రక్తనాళాల పనితీరుపై ప్రభావం చూపుతుంది, తద్వారా రక్తపోటును ప్రభావితం చేసే అవకాశం ఉంది. యాంటీ బాక్టీరియల్ మౌత్‌వాష్ వాడకం వల్ల నోటిలోని అవసరమైన బ్యాక్టీరియా 90 శాతం వరకు తగ్గుతుందని కొన్ని అధ్యయనాలలో తేలిందని వైద్యులు కూడా చెబుతున్నారు. కేవలం కొన్ని రోజుల వాడకం కూడా లాలాజలంలో నైట్రేట్ స్థాయిలను తగ్గించగలదని, దీనివల్ల సిస్టోలిక్ రక్తపోటులో స్వల్ప పెరుగుదల ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
మౌత్ వాష్ ఎక్కువ కాలం ఉపయోగిస్తే..
రోజు ఎక్కువగా మౌత్‌వాష్ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి బ్యాక్టీరియాను తగ్గించడం, నైట్రిక్ ఆక్సైడ్‌ను తగ్గించడం, , రక్తనాళాల సరైన పనితీరును దెబ్బతీసే ప్రక్రియ వలనే ఇది జరుగుతుందని అంటున్నారు. దీని ప్రభావాలు అందరిపై తీవ్రంగా ఉండనప్పటికీ, రెగ్యులర్ గా అందులోనూ ఎక్కువగా వాడటం వల్ల ప్రమాదం పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
చిగుళ్ల వ్యాధి, దంత చికిత్స తర్వాత, లేదా దంతాలపై అధికంగా పాచి పేరుకుపోయిన వంటి కొన్ని పరిస్థితులలో మౌత్‌వాష్ వాడకం అవసరం అవుతుంది. అందువల్ల, మౌత్‌వాష్‌ను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, దానిని రోజువారీ అలవాటుగా చేసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. నోటి శుభ్రతకు బ్రష్ చేయడమే మంచిదని, దీనికే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు. కాబట్టి మౌత్ వాష్ ఎక్కువగా వాడకూడదు.
*రూపశ్రీ.
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా కీలకం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో జింక్ కూడా ఒకటి. అయితే చాలామందికి జింక్ లోపం గురించి పెద్దగా అవగాహన ఉండదు. జింక్ లోపం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది నిజమేనా? జింక్ లోపం గురించి. జింక్ లోపం వల్ల వచ్చే సమస్యల గురించి వైద్యులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే..
శరీరానికి జింక్ ఎందుకు అవసరం..
జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి , చర్మానికి జింక్ చాలా అవసరం. జింక్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి , కణజాలాలను బాగు చేయడానికి సహాయపడుతుంది. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చని, చర్మ, కడుపు సమస్యలను కూడా కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
జింక్ లోపం వల్ల వచ్చే సమస్యలు..
జింక్ లోపం శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. జింక్ లోపం పిల్లలలో పెరుగుదలను నిరోధించగలదు , మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
ఇన్ఫెక్షన్లు..
జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. జింక్ లోపం ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల ఫంగస్ , చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
విరేచనాలు..
వైద్యుల ప్రకారం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. జింక్ లోపం జీర్ణవ్యవస్థపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో జింక్ లోపించినప్పుడు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది.
గాయాలు..
జింక్ లోపం చర్మం, కడుపునే కాకుండా గాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. జింక్ లోపం ఉన్నవారిలో గాయాలు నెమ్మదిగా నయమవుతాయి.
జింక్ లోపిస్తే కనిపించే లక్షణాలు..
జింక్ లోపం వేగంగా బరువు తగ్గడం, నీరసం , జుట్టు రాలడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది.
జింక్ పుష్కలంగా లభించే ఆహారాలు..
ఆహారంలో జింక్‌ను చేర్చుకోవడానికి, గుమ్మడి గింజలు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు గింజలు , రాగులను చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలలో జింక్ ఉంటుంది. అదనంగా, ఆవాల ఆకుకూర, మాంసం, పప్పుధాన్యాలు, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, పెరుగు, వేరుశెనగలు , గుడ్లను కూడా తినవచ్చు. ఈ ఆహారాలలో కూడా జింక్ సమృద్దిగా ఉంటుంది.
*రూపశ్రీ.
