LATEST NEWS
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు.
చెన్నై ఎందుకు వెనుకబడింది?: తమిళ ఓటర్లకు చంద్రబాబు సూటి ప్రశ్న.
ప్రధాని మోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష.. తమిళనాడులో చంద్రబాబు ప్రచారం
తమిళనాడు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు తెలపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ ప్రజలను కోరారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన చెన్నైలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, ప్రజలు మార్పును కోరుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దేశ ప్రగతి కోసం సుదూర లక్ష్యాలతో పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం ఎంతో అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థవంతమైన పాలన అందించే శక్తి కేవలం ఎన్డీయేకు మాత్రమే ఉందని, రాష్ట్రం ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా వృద్ధి చెందాలంటే సరైన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన నొక్కి చెప్పారు.
చెన్నై నగరంపై తనదైన శైలిలో విశ్లేషణ చేసిన సీఎం చంద్రబాబు, ఒకప్పుడు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ నగరం, ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు వెనుకబడిందనే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. మౌలిక వసతులు, ఐటీ రంగాలు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే చెన్నైలో మందగించాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, బెంగళూరు నగరాలు పెట్టుబడులను ఆకర్షిస్తూ, వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని, కానీ చెన్నై ఆ పోటీలో వెనకపడిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని విమానాశ్రయం వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
అనుభవజ్ఞుడైన నాయకుడిగా, మారుతున్న కాలానికి అనుగుణంగా చెన్నైకి పూర్వవైభవం తేవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. సమర్థమైన పాలన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే, తమిళనాడు మళ్లీ అగ్రపథంలో నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి, తమిళనాడు అభివృద్ధిపై చర్చ చేయడం, ఎన్డీయేకు ఓటు వేయాలని పిలుపునివ్వడంపై వివిధ వర్గాల నుండి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో తమిళనాడు ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ ఒక కీలక వ్యక్తిగా అవతరించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం మునీర్‌ను రెండు దేశాల మధ్య ఒక దౌత్య వంతెనగా (డిప్లమాటిక్ బ్రిడ్జి) భావిస్తున్నప్పటికీ.. ఇది అమెరికా జాతీయ భద్రతకు ఏ మేరకు మేలు చేస్తుందనే దానిపై నిపుణుల్లో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దౌత్యం కంటే.. నష్టనివారణ అంటే డ్యామేజ్ కంట్రోల్ వైపే మొగ్గు చూపుతున్న ట్రంప్ శైలి.. వాషింగ్టన్‌లోని భద్రతా వర్గాలను కలవరపెడుతోంది. మునీర్ ప్రస్తుతం కేవలం పాకిస్థాన్ సైనిక వ్యవహారాలకే పరిమితం కాకుండా.. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య జరుగుతున్న రహస్య చర్చలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
అయితే.. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి. చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. పాకిస్థాన్ విషయంలో అమెరికా నమ్మకం పలుమార్లు వమ్ము అయింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో తాలిబాన్‌లకు మద్దతు ఇస్తూనే.. అమెరికా నుంచి భారీగా ఆర్థిక సాయాన్ని పొందిన గత రికార్డులను భద్రతా నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రెండు వైపులా చక్రం తిప్పే పాక్ వ్యూహం వల్ల వాషింగ్టన్ ఇప్పటికే చాలా నష్టపోయింది. ఇప్పుడు మునీర్‌పై అతిగా ఆధారపడటం అనేది ఒక రకమైన జియోపాలిటికల్ జూదం (జియోపాలిటికల్ గ్యాంబిల్)గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన పాకిస్థాన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం గమనార్హం. దీనికి భద్రతా కారణాలు సాకుగా చూపుతున్నా.. తెరవెనుక నెలకొన్న అనిశ్చితి, మునీర్ నెట్‌వర్క్‌పై అపనమ్మకమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాంప్రదాయ దౌత్య మార్గాలను కాదని, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వంటి వ్యక్తిగత సన్నిహితుల ద్వారా ట్రంప్ ఈ వ్యవహారాన్ని నడిపించడం చర్చలకు ఇసుమంతైనా పారదర్శకత లేదనే అనుమానాలను బలపరుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపార శైలికి తగ్గట్టుగా డీల్ ఫస్ట్ అనే సూత్రంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన దృష్టిలో మునీర్ ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు. అందుకే ఆయనను తన ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ గా మునీర్ ను అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే అంతర్జాతీయ సంబంధాలు కేవలం వ్యక్తిగత సాన్నిహిత్యం మీద కాకుండా.. స్పష్టమైన నిబంధనలు, పారదర్శకత మీద నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. మునీర్ విషయంలో పారదర్శకత సందేహాస్పదంమే. .మధ్యవర్తులను నియమించుకోవడం సులభమే కానీ, వారిని నియంత్రించడం చాలా కష్టం అంటారు. పాకిస్థాన్ గతం, మునీర్‌కు ఉన్న ఇతర దేశాల సంబంధాలు అమెరికా వ్యూహాన్ని బలహీనపరిచేవిగానే ఉన్నాయి.
శాంతి ఒప్పందాల కోసం తీసుకుంటున్న ఈ చర్యలే రేపు భద్రతా లోపాలుగా మారితే అమెరికా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికి మునీర్‌ను ఎంతగా నమ్మినా, అప్రమత్తత అవసరమని అమెరికా నిఘా వ్యవస్థ స్పష్టం చేస్తోంది. చివరిగా అమెరికాకు ఇప్పుడు కావాల్సింది కేవలం మధ్యవర్తులు కాదు, ఒక పటిష్టమైన, అదే సమయంలో విశ్వసనీయ విదేశాంగ విధానం. వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి చేసే దౌత్యం తాత్కాలికంగా ఫలితాలను ఇచ్చినా.. దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలను ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంది. మరి మునీర్ అనే ఈ దౌత్య వంతెన అమెరికాను సురక్షితంగా ఇవతలి ఒడ్డుకు చేరుస్తుందో లేక కొత్త సమస్యల్లోకి నెడుతుందో వేచి చూడాలి.
-సీతారాం కంఠంనేని
తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ అన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడుని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదనీ, అటువంటి చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
అప్పట్లో తెలుగు స్కూళ్ల మూసివేత పై తలీ నియోజకవర్గం ఎమ్మెల్యే రామచంద్రన్ గట్టిగా జయలలిత ప్రభుత్వంతో కొట్లాడి తీర్మానాన్ని వెనక్కి తీసుకునేలా చేశారనీ.. ఆ విషయాన్ని తెలుగు ప్రజలు గానీ మర్చిరన్నారు. చంద్రబాబు నాయుడు మోడీని ఎంత వెనకేసుకొచ్చినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల కూటమి ఏ గెలుపొందుతుందన్న నారాయణ.. చంద్రబాబుకి తమిళనాడులో శృంగభంగం తప్పదని చెప్పారు.
ALSO ON TELUGUONE N E W S
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా పార్ట్-1 ఘనవిజయం సాధించడంతో, అందరి దృష్టి ఇప్పుడు ‘దేవర 2’పై పడింది. అయితే, తాజాగా ఫిలిం నగర్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దేవర సీక్వెల్ షూటింగ్ ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. ఈ గ్యాప్‌లో కొరటాల శివ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ షెడ్యూల్స్ మారడం దేవర సీక్వెల్‌పై ప్రభావం చూపుతోంది. ఈ సినిమా విడుదల తేదీని 2027 జూన్ 11గా చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అంటే వచ్చే ఏడాది పొడవునా తారక్ ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కే తన సమయాన్ని కేటాయించనున్నారు. ఈ నేపథ్యంలో దేవర-2 పట్టాలెక్కడం ఇప్పట్లో సాధ్యం కాదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అయితే, ఖాళీగా ఉండటం ఇష్టం లేని కొరటాల శివ, ఈ విరామంలో ఒక భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన నందమూరి నటసింహం బాలకృష్ణ కోసం ఒక పవర్ ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యకు లైన్ వినిపించడం, దానికి ఆయన సానుకూలంగా స్పందించడం కూడా జరిగిపోయాయని సమాచారం. 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్' వంటి సినిమాలతో మెసేజ్ ప్లస్ మాస్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా పండించే కొరటాల, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక పొలిటికల్ లేదా సోషల్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారట.
గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ప్రచారం జరిగినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు దేవర సీక్వెల్ ఆలస్యం కావడంతో, బాలయ్య-కొరటాల ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే, నందమూరి అభిమానులకు ఇది ఒక పెద్ద సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. బాలయ్య మార్క్ డైలాగులు, కొరటాల మార్క్ టేకింగ్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.
మరోవైపు, మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర సీక్వెల్‌పై లేదా ఆయన తదుపరి చిత్రాలపై ఏదైనా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తారక్ చేయబోయే 'గాడ్ ఆఫ్ వార్' సినిమా అప్డేట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఒకవేళ తారక్ ఇతర సినిమాలతో బిజీగా ఉంటే, కొరటాల శివ తన పూర్తి ఫోకస్‌ను బాలయ్య సినిమాపైనే పెట్టనున్నారు.
-ఈ నెల 3 న రిలీజైన బైకర్
-ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేస్తుంది
-ఈ డేట్ ఖాయమా!
ఓటిటిలోకి కొత్త సినిమా అప్ డేట్ ఇంకా రాలేదనుకునే ఓటిటి సినీ ప్రేమికులకి గుడ్ న్యూస్. బైకర్(Biker)ఓటిటి డేట్ లాక్ అయ్యిందనే న్యూస్ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఈ విషయంలో ఓటిటి సైతం ఎప్పుడు లేని విధంగా 'జల్లంత కవ్వింత కావాలిలే... ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే అని చిందులేస్తుంది. మరి ఓటిటి ప్రియులు మీరు కూడా ఆ డేట్ చూసి మండే ఎండలని మంచుబిందువులుగా మార్చుకోండి.
బైకర్ స్ట్రీమింగ్ పార్టనర్ నెట్ ఫ్లిక్స్. ఇప్పుడు ఈ సంస్థ మే 1 నుంచి స్ట్రీమింగ్ లోకి తీసుకొస్తున్నట్టుగా టాక్. ఈ మేరకు త్వరలోనే నెట్ ఫ్లిక్స్ నుంచి అధికార ప్రకటన రానుందనే న్యూస్ సైతం చక్కర్లు కొడుతుంది .శర్వానంద్(Sharwanand)తన రెగ్యులర్ ఫిజిక్ ని పూర్తిగా మార్చుకొని చేసిన చిత్రం 'బైకర్'. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా ఈ నెల 3 న థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. ముఖ్యంగా బైక్ రేసింగ్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఫ్యామిలీ ఆడియెన్స్ మోతాదు కూడా ఉండాల్సిన రీతిలోనే ఉంది.
Also read: Raaka: రాకాకి అట్లీ రెమ్యూనరేషన్ ఇంతేనా! మరి దారుణం కదా
సీనియర్ నటుడు రాజశేఖర్(Rajasekhar)స్క్రీన్ షేర్ చేసుకోవడం మరో స్పెషాలిటీ. స్పెషాలిటీనే కాదు శర్వానంద్ రాజశేఖర్ తండ్రి కొడుకులుగా చేసి ఒక రేంజ్ లోనే మెప్పించారు.
శర్వానంద్ కి మాళవిక నాయర్ జత కట్టగా బ్రహ్మాజీతో పాటు ముఖ్యమైన నటులు కీలక రోల్స్ లో కనిపించారు. యూవీ క్రియేషన్స్ నిర్మించగా జిబ్రాన్ మ్యూజిక్ ని అందించాడు. అభిలాష్ రెడ్డి(Abhilash reddy)దర్శకుడు
- టాలీవుడ్ బాక్సాఫీస్ @ సమ్మర్ 2026
- స్టార్స్ లేక వెలవెలబోతున్న థియేటర్లు
- 'పెద్ది' వాయిదాతో మారిన లెక్కలు
- హిట్ కోసం పరితపిస్తున్న ఎగ్జిబిటర్లు
తెలుగు చిత్ర పరిశ్రమకు సమ్మర్ సీజన్ అంటే కేవలం ఎండలు మాత్రమే కాదు, కలెక్షన్ల వర్షం కురిపించే అసలైన పండుగ కాలం. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారని నిర్మాతలు ఆశపడతారు. అయితే, 2026 వేసవి మాత్రం టాలీవుడ్‌కు అస్సలు కలిసి రావడం లేదు. ఏప్రిల్ మూడో వారం గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద కనీసం ఒక్కటంటే ఒక్క భారీ విజయం నమోదు కాలేదు. గత నెల రోజులుగా విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడటం చిత్ర వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్‌ను ప్రధానంగా రెండు అంశాలు దెబ్బతీస్తున్నాయి. ఒకటి భానుడి భగభగలు అయితే, రెండోది ఐపీఎల్ క్రికెట్ ఫీవర్. సాయంత్రం వేళల్లో ఐపీఎల్ మ్యాచ్‌ల ధాటికి జనాలు థియేటర్ల కంటే టీవీలకే పరిమితమవుతున్నారు. శని, ఆదివారాల్లో కూడా ఆడియన్స్ సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడంతో చాలా చోట్ల షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా, అది కలెక్షన్లుగా మారకపోవడం ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ ఏడాది సమ్మర్ సందడి తగ్గిపోవడానికి ప్రధాన కారణం 'స్టార్ పవర్' లోపించడమేనని తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా వాయిదా పడటం టాలీవుడ్ బాక్సాఫీస్‌పై తీవ్ర ప్రభావం చూపింది. సమ్మర్ బరిలో ఒక భారీ సినిమా ఉంటే వచ్చే క్రేజ్ వేరుగా ఉంటుంది. కానీ, 'పెద్ది' వెనక్కి తగ్గడంతో థియేటర్ల వద్ద ఆ సందడి కనిపించడం లేదు. అలాగే సినిమాలకు వస్తున్న క్రేజ్ కంటే 'ఓటీటీ రిలీజ్' భయం ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా అడ్డుకుంటోంది. "ఎలాగూ నెల రోజుల్లో ఓటీటీలోకి వస్తుంది కదా" అనే ధోరణి థియేట్రికల్ రన్‌ను దెబ్బతీస్తోంది.
అయితే, నిరాశలో ఉన్న సినీ అభిమానులకు, ఎగ్జిబిటర్లకు మే నెల ఒక ఆశాదీపంలా కనిపిస్తోంది. వచ్చే నెలలో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు క్యూ కట్టబోతున్నాయి. తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’, కమెడియన్ సత్య హీరోగా పరిచయమవుతున్న ‘జెట్లీ’, నిఖిల్ ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభూ’ వంటి చిత్రాలపై మంచి అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు సమంత నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’, ‘ఎపిక్’, ‘గోదారి గట్టుపైన’ వంటి సినిమాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డబ్బింగ్ సినిమాలైన ‘దృశ్యం 3’, ‘ది డెవిల్’ కూడా పోటీలో ఉన్నాయి.
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, మే నెలలో విడుదలయ్యే ఈ చిన్న, మధ్య తరహా చిత్రాలలో కనీసం రెండు మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తేనే టాలీవుడ్ మళ్ళీ ట్రాక్‌లోకి వస్తుంది. చిన్న సినిమాలైనా కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది గత అనుభవాలు చెబుతున్నాయి. మే నెలాఖరు వరకు ఏదైనా ఒక సర్ ప్రైజ్ హిట్ పడితేనే సమ్మర్ సీజన్ సక్సెస్ ఫుల్‌గా ముగిసినట్లవుతుంది.
టాలీవుడ్ లో మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన నటించిన చిత్రాల్లో 'కౌరవుడు' (Kouravudu) ఒక ప్రత్యేకమైన సినిమా. ఇందులో నాగబాబు చెప్పిన డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఈ సినిమాలోని ఒక అల్టిమేట్ సీన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఆడవారి వేధింపులపై నాగబాబు గర్జన
ఈ సన్నివేశంలో నాగబాబు నట విశ్వరూపం చూపించారు. భర్తను అప్పుల పాలు చేసి, అతడి మరణానికి కారణమైన ఒక భార్యను నిలదీసే క్రమంలో నాగబాబు చెప్పే డైలాగులు ఆలోచింపజేసేలా ఉంటాయి. "తాహతుకు మించిన కోరికలతో వాడిని సతాయించావు.. నీ కోరికలకు, షోకులకు వాడిని అప్పుల పాలు చేశావు" అంటూ ఆయన గర్జించే తీరు అద్భుతం. తన విలాసాల కోసం భర్త ప్రాణాల మీదకు తెచ్చే మహిళల ప్రవర్తనను ఈ సీన్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు.
తల్లి ప్రేమ లేని పిశాచం!
కేవలం భార్యగానే కాకుండా, ఒక తల్లిగా కూడా ఆమె వైఫల్యాన్ని నాగబాబు ఎండగట్టారు. "అందాలు తరిగిపోతాయని పాలివ్వడం మానేశావు.. ముద్దిస్తే పెదాల రంగు పోతుందని ముద్దు చేయడం మానేశావు.. ఎత్తుకుంటే చీర నలిగిపోతుందని ఉయ్యాలలో పడేశావు" అనే డైలాగులు సమాజంలోని కొన్ని చేదు నిజాలను ప్రతిబింబిస్తాయి. ఇలాంటి మహిళ పెళ్ళాం కాదు 'పిశాచి' అని ఆయన సంబోధించడం ఆ పాత్రలోని ఆవేశాన్ని తెలియజేస్తుంది.
మొగుళ్ల బీపీలకు కారణం వీరేనా?
ఈ సీన్ లో నాగబాబు చేసిన మరో ఆసక్తికరమైన కామెంట్ ఏమిటంటే.. "ఇలాంటి ఆడవాళ్ల వల్లే మగాళ్లకు 30 ఏళ్లకే బీపీలు, 40 ఏళ్లకే హార్ట్ అటాక్ లు వస్తున్నాయి." భర్తను మానసిక వేదనకు గురిచేసే భార్యల వల్ల కలిగే పరిణామాలను ఆయన తనదైన శైలిలో వివరించారు. చివరగా, ఏ అందం చూసుకుని అయితే ఆమె గర్వపడుతుందో, ఆ అందం లేకుండా చేస్తానని చెప్పి ఆమెకు గుండు కొట్టించే సన్నివేశం ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
మొత్తానికి 'కౌరవుడు' సినిమాలోని ఈ సన్నివేశం నాగబాబు కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ అని చెప్పవచ్చు. మగాళ్ల పక్షాన నిలబడి ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తున్నాయి.
ఇలాంటి అద్భుతమైన సన్నివేశాలు, సినిమాల కోసం మా తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
-శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న రాకా
-ఆసక్తి కరంగా మారిన రెమ్యునరేషన్ డీటెయిల్స్
-అట్లీ కి ఎంత!
-అల్లు అర్జున్ కి ఎంత!
ఇండియా వ్యాప్తంగా ఏ ఇద్దరు సినీ లవర్స్ కలిసినా కంపల్ సరి వాళ్ళ మధ్య రాకా(Raaka)డిస్కర్షన్ ఉండటం కామన్. మరి అక్కడ ఉంది ఎవరు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ప్లాప్స్ అంటే గిట్టని పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ(Atlee). పైగా అల్లు అర్జున్ బర్త్ డే రోజు రిలీజైన టీజర్ కూడా వాళ్ళ డిస్కర్షన్ స్థాయిని ఇంకొంచం పెంచింది. ఇప్పుడు వాళ్ళందరిని నాకు స్వాతంత్రం ఇప్పుడే వచ్చింది అనే రీతిలో ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
సినిమా అన్నాక రెమ్యునరేషన్ కామనే కదండీ. ఈ క్రమంలోనే అట్లీ 100 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడనేది టాక్. ఈ న్యూస్ లో నిజమెంత ఉందో తెలియదు గాని వంద కోట్లు అందుకున్నాడంటే ఒక అరుదైన రికార్డు అని చెప్పవచ్చు. అట్లీ ట్రాక్ రికార్డు చూసుకుంటే ఆ న్యూస్ ని నమ్మడంలో తప్పులేదని అనిపిస్తుంది. ప్రీవియస్ అట్లీ హిట్ మూవీ జవాన్ సైతం నన్ను ఎగ్జామ్ ఫుల్ గా తీసుకోండి బాస్ అని నొక్కి మరి చెప్తుంది. మరి ఎలాగూ అట్లీ రెమ్యునరేషన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి అల్లు అర్జున్ తో పాటు మిగతా వాళ్ళ రెమ్యునరేషన్ గురించి కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్ కి ఒకసారి చూద్దాం.
also read: Raja Shivaji: జెనీలియా కన్నీళ్లు.. రితీష్ ఎమోషనల్
అల్లు అర్జున్ 175 నుంచి 180 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో 15 శాతం వాటా తీసుకోబోతున్నట్టుగా వినిపిస్తుంటే దీపిక పదుకునే 20 నుంచి 25 కోట్లు వరకు తీసుకోబోతుందనేది సోషల్ మీడియా టాక్. 'రాకా'ని సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్(Kalanithi Maran)నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్‌లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్‌డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్‌స్టర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు. పాపం చిన్న పిల్లలు సైతం టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది. చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు, కానీ చాలా మందులకు ఉంటుంది. ఈ టాబ్లెట్ల మీద గీత చూసిన చాలామంది ఇది ఒక డిజైన్ అని అనుకుంటారు, కానీ ఈ గీత వెనుక పెద్ద కథే ఉంది.. వైద్య పరిభాషలో, ఈ గీతను స్కోర్ లైన్ అంటారు. మందును సమాన భాగాలుగా విభజించడానికి ఈ గీతను రూపొందిస్తారని నిపుణులు చెబుతున్నారు. టాబ్లెట్స్ పైన ఈ గీతలు ఎందుకు ఉంటాయి. ఫార్మా కంపెనీలు ఇలా టాబ్లెట్ల మీద గీతలు ఉంచడం వెనుక కారణం ఏంటి? వివరంగా తెలుసుకుంటే..
టాబ్లెట్ల మీద గీత..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని మాత్రలపై ఉండే గీత మందును సమాన భాగాలుగా విడగొట్టడానికి సహాయపడుతుంది, తద్వారా రోగులు సులభంగా సగం మాత్రను తీసుకోవచ్చు. వైద్యులు తరచుగా సగం మాత్ర మోతాదును కూడా సూచిస్తారు. ఈ గీత మాత్రను సగానికి విరవడాన్ని సులభతరం చేస్తుంది. రోగికి సరైన మోతాదు అందేలా చూసుకోవడానికి, మాత్రను తయారుచేసేటప్పుడు ఈ గీత వచ్చేలా చేస్తారట.
గీతలు లేని టాబ్లెట్లు..
మందుపై గీత లేని మాత్రలు. అంటే, టాబ్లెట్ల పై గీత లేకపోతే ఆ మాత్రను విరవకూడదట. లేకపోతే, దాని ప్రభావం తగ్గిపోవచ్చట. కొన్ని మందులకు ఎంటెరిక్ కోటింగ్ లేదా సస్టెయిన్డ్ రిలీజ్ వంటివి ఉంటాయని, వాటిని విరిస్తే టాబ్లెట్ల ప్రభావం మారవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకే గీత లేని టాబ్లెట్లను విరవడం వల్ల దుష్ప్రభావాల ప్రమాదం పెరగవచ్చని అంటున్నారు.
డిజైన్ మాత్రం కాదు..
నిపుణుల అభిప్రాయం ప్రకారం, టాబ్లెట్ మధ్యలో ఉండే గీత కేవలం డిజైన్ కోసం పెట్టేది కాదు. అది టాబ్లెట్ డోస్ తీసుకోవడానికి సహాయపడుతుంది. ఆ గీత టాబ్లెట్‌ను సులభంగా విరవడానికి వీలు కల్పిస్తుంది. టాబ్లెట్ లో సగం డోసు తీసుకోవాల్సిన వారు టాబ్లెట్‌ను సమాన భాగాలుగా విరవకపోతే సరైన డోస్ తీసుకోలేరు. దీని వల్ల మందు కూడా ప్రభావవంతంగా పనిచేయదు.
*రూపశ్రీ.
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. కానీ వేడి పెరిగేకొద్దీ పెరుగు త్వరగా పులిసిపోతుంది. కొన్నిసార్లు రాత్రి తోడు పెట్టిన పెరుగు ఉదయానికి తినడానికి వీలులేనంతగా పులిసిపోతుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో పెరుగును ఎక్కువ కాలం తాజాగా, రుచికరంగా ఉంచుకోవచ్చు. వేసవి కాలంలో పెరుగు పులుపు ఎక్కకుండా ఉండాలంటే ఎలా నిల్వ చేయాలి? ఆ చిట్కాలేంటి? తెలుసుకుంటే..
ఇది గుర్తుపెట్టుకోవాలి..
మొదటగా పెరుగు పులవడం అనేది ఒక సహజ ప్రక్రియ అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పాలలో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా లాక్టోజ్‌ను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది, దీనివల్ల పెరుగుకు కొద్దిగా పుల్లని రుచి వస్తుంది. అయితే అధిక వేడిలో ఈ ప్రక్రియ వేగవంతమవుతుంది, దీనివల్ల పెరుగు మరింత త్వరగా పులిసిపోతుంది. పెరుగు తోడు పెట్టడానికి పాల ఎంపిక చాలా కీలకం. ఎల్లప్పుడూ తాజా, నాణ్యమైన పాలను ఉపయోగించాలి. తాజాగా లేని పాలలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల పెరుగు త్వరగా పాడవుతుంది. పాలను బాగా మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడే పెరుగు చుక్క కలపాలి.
పరిశుభ్రత..
పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పెరుగును నిల్వ చేసే పాత్రలు పూర్తిగా శుభ్రంగా , పొడిగా ఉండాలి. కొద్దిపాటి మురికి లేదా బ్యాక్టీరియా కూడా పెరుగు రుచిని, ఆకృతిని పాడుచేస్తుంది. వేసవిలో పెరుగు నిల్వ చేయడానికి సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. పెరుగును అధిక వేడికి లేదా ప్రత్యక్ష సూర్యరశ్మికి దూరంగా నిల్వ చేయాలి. చాలా వేడిగా ఉండే వాతావరణంలో పెరుగు త్వరగా పుల్లగా మారిపోతుంది. వంటగది చాలా వేడిగా ఉంటే, దానిని ఇంటిలోని చల్లని మూలలో నిల్వ చేయడం ఉత్తమం.
ఈ చిట్కా బాగా పనిచేస్తుంది..
పాలు పెరుగుగా మారే సమయంలో అందులో కాస్త పంచదార కలిపితే అందులో బ్యాక్టీరియా బాలెన్స్ గా ఉండటంలో సహాయపడుతుందట.పెరుగు త్వరగా పుల్లగా మారకుండా నివారిస్తుంది. అలాగే, ఎల్లప్పుడూ తాజా పెరుగునే తోడు చుక్కు కోసం ఉపయోగించాలి. పెరుగు తయారైన తర్వాత దాన్ని ఎక్కువ సేపు బయట ఉంచకూడదు. వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లని ఉష్ణోగ్రత బ్యాక్టీరియా పెరుగుదలను నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల పెరుగు ఎక్కువ కాలం పాటు మంచి రుచిగా ఉంటుంది. ఎలాంటి వాసనలు రాకుండా ఉండటానికి పెరుగును ఎల్లప్పుడూ గాలి చొరబడని టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి.
తీపి పెరుగు..
కొందరు స్వీట్ కర్డ్ ఇష్టపడతారు. తీపి పెరుగు ఇష్టపడే వారు దాన్ని గడ్డకట్టించడానికి పాలలో ముందుగానే చక్కెర కలుపుకోవచ్చు. ఇది రుచిని మెరుగుపరిచి, పులుపును తగ్గిస్తుంది. పెరుగు పులిసిపోకుండా నివారించడం కష్టమేమీ కాదు. సరైన పాలు, శుభ్రమైన పాత్రలు, ఉష్ణోగ్రత ఎక్కువ లేకుండా చూసుకోవడం, సరైన పద్దతిలో నిల్వ చేయడం.. ఇవన్నీ చూసుకుంటే చాలు. ఈ సులభమైన చిట్కాలను పాటించడం ద్వారా, రుచికరంగా, చిక్కగా ఉండే పెరుగును ఈ సమ్మర్ లో కూడా ఆస్వాదించవచ్చు.
*రూపశ్రీ.
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే.. పిల్లలు అంత గొప్పగా ఎదుగుతారని అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు.. కేవలం పిల్లల కోసం డబ్బు ఖర్చు చేస్తే పిల్లలు తెలివైన వారుగా, మంచి విద్యార్థులుగా, మేధావులుగా ఎదుగుతారు అనుకోవడం మూర్ఖత్వం. రోజువారీ తల్లిదండ్రులు చేసే చిన్న మార్పులు పిల్లల ఆలోచన, ప్రవర్తన , భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. దైనందిన జీవితంలో కొన్ని సాధారణ అలవాట్లను అలవర్చుకోవడం వల్ల పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, వారు తెలివైనవారుగా, సృజనాత్మకంగా , తమకు తామే ప్రేరణ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు. పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలంటే.. తల్లిదండ్రులు అనుసరించాల్సిన ఐదు మార్గాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
మాట్లాడటం..
నేటి తీరికలేని జీవితాలలో తల్లిదండ్రులు తరచుగా పిల్లలతో కూర్చొని మాట్లాడటాన్ని మరచిపోతుంటారు, కానీ ఈ చిన్న అలవాటు పెద్ద మార్పును తీసుకురాగలదు. ప్రతిరోజూ 10-15 నిమిషాలు పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. వారి రోజు ఎలా గడిచిందో, పాఠశాలలో ఏమి జరిగిందో, వారి స్నేహితులు ఎలా ఉన్నారో అడగాలి. ఇది పిల్లలు తమ విషయాలను స్వేచ్ఛగా పంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఇది వారి ఆలోచనా విధానం, మాట్లాడే సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.
ప్రశ్నలకు సమాధానాలు..
పిల్లలు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. కొన్నిసార్లు, వారి ప్రశ్నలతో తల్లిదండ్రులు విసుగు చెంది, వారిని మౌనంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు, ఇది తప్పు. పిల్లలు ప్రశ్న అడిగినప్పుడు, శ్రద్ధగా విని, వివరించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ తల్లిదండ్రులకు సమాధానం తెలియకపోతే, ఇద్దరూ కలిసి దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఇది పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని, తర్కాన్ని , సృజనాత్మకతను వేగంగా మెరుగుపరుస్తుంది.
స్క్రీన్ టైం..
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. కానీ, స్క్రీన్ ముందు ఎక్కువ సేపు గడపడం వారి మెదడుకు, ఆరోగ్యానికి హానికరం. పిల్లల స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించాలి. దానికి బదులుగా, పుస్తకాలు చదవమని, బొమ్మలు గీయమని, ఆటలు ఆడమని లేదా పజిల్స్ పరిష్కరించమని వారిని ప్రోత్సహించాలి. ఇది వారి ఏకాగ్రతను, ఊహాశక్తిని బలపరుస్తుంది. పిల్లలు ఇవన్నీ ఇష్టంతో చేయాలంటే.. తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు స్క్రీన్ టైం తగ్గించి వారికి సహకరించాలి.
ఎంకరేజ్..
ప్రతి పిల్లవాడు తమ పనికి ప్రశంసలు పొందాలని కోరుకుంటారు. చిన్న చిన్న విజయాలను సైతం ప్రశంసించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ ప్రశంస హృదయపూర్వకంగా, నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. గద్దించడానికి బదులుగా, ప్రేమతో చెప్పాలి. ఇది పిల్లలు భయపడకుండా నేర్చుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రోత్సాహం అందిస్తుంది.
తమ పని తాము చేసుకోవడం..
పిల్లలకు వారి బ్యాగ్ వారే సర్దుకోవడం, పుస్తకాలు పెట్టుకోవడం లేదా వారి గదిని శుభ్రం చేసుకోవడం వంటి చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం ముఖ్యం. ఇది వారిలో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందిస్తుంది. క్రమంగా, వారు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు, ఇది వారి భవిష్యత్తుకు చాలా కీలకం.
పైన చెప్పుకున్నవన్నీ పిల్లల జీవితంలో భాగం చేయగలిగితే.. ఆ పిల్లలు భవిష్యత్తులో మేధావులుగా మారడాన్ని ఎవరూ ఆపలేరు.
*రూపశ్రీ.
తమిళనాడులో ఎన్డీయేకు పట్టం కట్టండి.. చెన్నైలో సీఎం చంద్రబాబు పిలుపు.
చెన్నై ఎందుకు వెనుకబడింది?: తమిళ ఓటర్లకు చంద్రబాబు సూటి ప్రశ్న.
ప్రధాని మోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష.. తమిళనాడులో చంద్రబాబు ప్రచారం
తమిళనాడు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతు తెలపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ ప్రజలను కోరారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన చెన్నైలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, ప్రజలు మార్పును కోరుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దేశ ప్రగతి కోసం సుదూర లక్ష్యాలతో పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం ఎంతో అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థవంతమైన పాలన అందించే శక్తి కేవలం ఎన్డీయేకు మాత్రమే ఉందని, రాష్ట్రం ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా వృద్ధి చెందాలంటే సరైన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన నొక్కి చెప్పారు.
చెన్నై నగరంపై తనదైన శైలిలో విశ్లేషణ చేసిన సీఎం చంద్రబాబు, ఒకప్పుడు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ నగరం, ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు వెనుకబడిందనే చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. మౌలిక వసతులు, ఐటీ రంగాలు ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే చెన్నైలో మందగించాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, బెంగళూరు నగరాలు పెట్టుబడులను ఆకర్షిస్తూ, వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని, కానీ చెన్నై ఆ పోటీలో వెనకపడిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని విమానాశ్రయం వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
అనుభవజ్ఞుడైన నాయకుడిగా, మారుతున్న కాలానికి అనుగుణంగా చెన్నైకి పూర్వవైభవం తేవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. సమర్థమైన పాలన, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే, తమిళనాడు మళ్లీ అగ్రపథంలో నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి, తమిళనాడు అభివృద్ధిపై చర్చ చేయడం, ఎన్డీయేకు ఓటు వేయాలని పిలుపునివ్వడంపై వివిధ వర్గాల నుండి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో తమిళనాడు ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ ఒక కీలక వ్యక్తిగా అవతరించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం మునీర్‌ను రెండు దేశాల మధ్య ఒక దౌత్య వంతెనగా (డిప్లమాటిక్ బ్రిడ్జి) భావిస్తున్నప్పటికీ.. ఇది అమెరికా జాతీయ భద్రతకు ఏ మేరకు మేలు చేస్తుందనే దానిపై నిపుణుల్లో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దౌత్యం కంటే.. నష్టనివారణ అంటే డ్యామేజ్ కంట్రోల్ వైపే మొగ్గు చూపుతున్న ట్రంప్ శైలి.. వాషింగ్టన్‌లోని భద్రతా వర్గాలను కలవరపెడుతోంది. మునీర్ ప్రస్తుతం కేవలం పాకిస్థాన్ సైనిక వ్యవహారాలకే పరిమితం కాకుండా.. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య జరుగుతున్న రహస్య చర్చలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
అయితే.. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. మునీర్‌కు ఇరాన్ అగ్రశ్రేణి సైనిక వర్గాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు చర్చలకు సహకరిస్తాయని భావిస్తున్నా.. అదే సమయంలో ఆయన విశ్వసనీయతపై అమెరికా నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మధ్యవర్తిత్వం పేరుతో ఆయన అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టేలా వ్యవహరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవ్వడమే కాకుండా, ఆ దిశగా హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి. చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. పాకిస్థాన్ విషయంలో అమెరికా నమ్మకం పలుమార్లు వమ్ము అయింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో తాలిబాన్‌లకు మద్దతు ఇస్తూనే.. అమెరికా నుంచి భారీగా ఆర్థిక సాయాన్ని పొందిన గత రికార్డులను భద్రతా నిపుణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రెండు వైపులా చక్రం తిప్పే పాక్ వ్యూహం వల్ల వాషింగ్టన్ ఇప్పటికే చాలా నష్టపోయింది. ఇప్పుడు మునీర్‌పై అతిగా ఆధారపడటం అనేది ఒక రకమైన జియోపాలిటికల్ జూదం (జియోపాలిటికల్ గ్యాంబిల్)గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన పాకిస్థాన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం గమనార్హం. దీనికి భద్రతా కారణాలు సాకుగా చూపుతున్నా.. తెరవెనుక నెలకొన్న అనిశ్చితి, మునీర్ నెట్‌వర్క్‌పై అపనమ్మకమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సాంప్రదాయ దౌత్య మార్గాలను కాదని, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వంటి వ్యక్తిగత సన్నిహితుల ద్వారా ట్రంప్ ఈ వ్యవహారాన్ని నడిపించడం చర్చలకు ఇసుమంతైనా పారదర్శకత లేదనే అనుమానాలను బలపరుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపార శైలికి తగ్గట్టుగా డీల్ ఫస్ట్ అనే సూత్రంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన దృష్టిలో మునీర్ ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు. అందుకే ఆయనను తన ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ గా మునీర్ ను అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే అంతర్జాతీయ సంబంధాలు కేవలం వ్యక్తిగత సాన్నిహిత్యం మీద కాకుండా.. స్పష్టమైన నిబంధనలు, పారదర్శకత మీద నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. మునీర్ విషయంలో పారదర్శకత సందేహాస్పదంమే. .మధ్యవర్తులను నియమించుకోవడం సులభమే కానీ, వారిని నియంత్రించడం చాలా కష్టం అంటారు. పాకిస్థాన్ గతం, మునీర్‌కు ఉన్న ఇతర దేశాల సంబంధాలు అమెరికా వ్యూహాన్ని బలహీనపరిచేవిగానే ఉన్నాయి.
శాంతి ఒప్పందాల కోసం తీసుకుంటున్న ఈ చర్యలే రేపు భద్రతా లోపాలుగా మారితే అమెరికా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతానికి మునీర్‌ను ఎంతగా నమ్మినా, అప్రమత్తత అవసరమని అమెరికా నిఘా వ్యవస్థ స్పష్టం చేస్తోంది. చివరిగా అమెరికాకు ఇప్పుడు కావాల్సింది కేవలం మధ్యవర్తులు కాదు, ఒక పటిష్టమైన, అదే సమయంలో విశ్వసనీయ విదేశాంగ విధానం. వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి చేసే దౌత్యం తాత్కాలికంగా ఫలితాలను ఇచ్చినా.. దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలను ప్రమాదంలో నెట్టే అవకాశం ఉంది. మరి మునీర్ అనే ఈ దౌత్య వంతెన అమెరికాను సురక్షితంగా ఇవతలి ఒడ్డుకు చేరుస్తుందో లేక కొత్త సమస్యల్లోకి నెడుతుందో వేచి చూడాలి.
-సీతారాం కంఠంనేని
తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ అన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడుని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకోలేదనీ, అటువంటి చంద్రబాబు ప్రస్తుతం మోడీని కాపాడేందుకు ఎన్డీఏ తరపున తెలుగు ప్రజల మధ్య ప్రచారానికెళ్లడం విడ్డూరమన్నారు. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, నేడు తెలుగు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం సబబు కాదని నారాయణ అన్నారు.
అప్పట్లో తెలుగు స్కూళ్ల మూసివేత పై తలీ నియోజకవర్గం ఎమ్మెల్యే రామచంద్రన్ గట్టిగా జయలలిత ప్రభుత్వంతో కొట్లాడి తీర్మానాన్ని వెనక్కి తీసుకునేలా చేశారనీ.. ఆ విషయాన్ని తెలుగు ప్రజలు గానీ మర్చిరన్నారు. చంద్రబాబు నాయుడు మోడీని ఎంత వెనకేసుకొచ్చినా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల కూటమి ఏ గెలుపొందుతుందన్న నారాయణ.. చంద్రబాబుకి తమిళనాడులో శృంగభంగం తప్పదని చెప్పారు.
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది. ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం చేస్తున్నారు. ఇక చాలా మంది మరొక అడుగు ముందుకు వేసి జీవితానికి కీలకం అయిన ఉద్యోగాలు, ఆరోగ్యం, రిలేషన్షిప్స్ వంటి విషయాలలో సలహాలు కూడా ఈ కృత్రిమ మేధస్సును ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఇది మనిషి లాగా తప్పించుకుని పక్కకు వెళ్ళిపోయేది కాదు.. ఏ ప్రశ్న అడిగినా దానికి తగిన సమాధానం ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఏఐ ను ఆరోగ్య సమస్యలకు సలహాలు తీసుకుని, స్వంత వైద్యం దిశగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక బ్రిటీష్ వైద్య పత్రిక ఏఐ ను ఆరోగ్య సలహాలు అడగడం, ఆ సలహాలు పాటించడం వంటి విషయాల గురించి చాలా షాకింగ్ నిజాలు ప్రచురించింది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఆరోగ్య సమస్యల కోసం ఏఐ ను సలహా అడగడం ఎంత పెద్ద తప్పూ అర్థమవుతుంది.
ఆరోగ్య సమస్యలపై తప్పుడు సమాచారం..
ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు ఏఐ ఇచ్చే సమాధానాలలో సుమారు 50 శాతం తప్పుగా ఉంటాయి. ఏఐ చాట్‌బాట్‌లు అందించే సమాచారం చాలా తప్పుగా ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
ఏఐ బలహీనత..
జెమిని, డీప్‌సీక్, మెటా ఏఐ, చాట్‌జీపీటీ , గ్రోక్ వంటి ఏఐ సాధనాలపై విస్తృతమైన పరిశోధనను ఒక శాస్త్రవేత్తల టీమ్ నిర్వహించిందట. ఈ ఏఐ ప్లాట్పామ్ లలో ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రశ్నలు పరిశోధకులు అడిగారట. క్యాన్సర్ , వ్యాక్సిన్‌ల వంటి అంశాలపై ఏఐ ఇచ్చిన సమాధానాలు చాలా వరకు కచ్చితమైనవిగా ఉన్నాయి. అయితే మూల కణాలు , పోషణ వంటి అంశాలలో ఏఐ బలహీనంగా ఉన్నట్లు తేలిందట.
తప్పుడు సమాధానాలు..
ఏఐతో ఉన్న అతిపెద్ద సమస్య.. అది నిస్సంకోచంగా తప్పుడు సమాచారాన్ని అందిస్తుందట. ఇది తరచుగా ఎటువంటి హెచ్చరిక లేదా నిరాకరణను అందించదు. ఫలితంగా, వినియోగదారులు సరైన సమాచారం, తప్పు సమాచారాల మధ్య తేడాను గుర్తించలేరు. ఏఐ చెప్పే తప్పు సమాధానాలనే నిజం అనుకుని చాలామంది పొరపాట్లు చేస్తారు. అసలు ఏఐ చెప్పే సమాధానాలు నమ్మేలా అనిపించవని, సమస్యకు సంబంధం లేని సమాచారాన్ని ఇస్తుందని అంటున్నారు.
గమనిక..
పైన పేర్కొన్న విషయాలు సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా రూపొందించినవి.
*రూపశ్రీ.
ఇంట్లోనే లభించే ఆయుర్వేద మూలికలతో మోకాళ్ళ నొప్పులకు చెక్ పెట్టండి!
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య చిన్న వయస్సులోనే మొదలవుతోంది. అయితే, ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు మోకాళ్ళలో జిగురును పెంచడానికి మరియు నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి అద్భుతమైన ఇంటి చిట్కాలను ఈ వీడియోలో వివరించారు.
ముఖ్యమైన చిట్కాలు మరియు పరిష్కారాలు:
మోకాళ్ళలో జిగురు (Knee Pulp) పెరగడానికి: వయస్సు పెరిగే కొద్దీ మోకాళ్ళలో ఉండే సహజమైన జిగురు తగ్గిపోతుంటుంది. దీనివల్ల ఎముకలు ఒకదానికొకటి రాపిడికి గురై తీవ్రమైన నొప్పి కలుగుతుంది. దీనికి సంబంధించి ఆయుర్వేదంలో సూచించిన సహజమైన ఔషధాల గురించి డాక్టర్ గారు వివరించారు.
ఆయుర్వేద మూలికల ఉపయోగాలు: కరక్కాయ పొడి, వాము మరియు శొంఠి వంటి పదార్థాలు మన వంటింట్లోనే లభిస్తాయి. వీటిని సరైన పద్ధతిలో తీసుకోవడం వల్ల శరీరంలోని వాత దోషాలు తగ్గి, నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.
జీవనశైలి మార్పులు: నొప్పులు తగ్గాలంటే కేవలం మందులే కాకుండా, తీసుకునే ఆహారం మరియు రోజువారీ వ్యాయామం ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
మీరు కూడా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతుంటే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ ఆయుర్వేద పద్ధతులను పాటించి చూడండి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను తప్పక వీక్షించండి.
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది. చాలా మందికి తల తిరగడం, తలనొప్పి, నీరసం, లేదా స్పృహ కోల్పోవడం వంటివి జరుగుతాయి. వీటికి ప్రధాన కారణాలు శరీరంలో నీటి శాతం తగ్గడం, తీవ్రమైన వేడి. అయితే, దినచర్యలోనూ, ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. వేసవిలో ఎండకు గురికావడం శక్తిని ఎలా హరించివేస్తుందో, రోజంతా చురుగ్గా ఉండటానికి ఏమి చెయ్యాలో తెలుసుకుంటే..
వేసవి ఎండలో ఉన్నప్పుడు శరీరం శక్తి ఎలా కోల్పోతుంది?
వేసవిలో ఎండకు గురికావడం వల్ల, అధిక ఉష్ణోగ్రతలు శరీరంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఎండలో ఉన్నప్పుడు, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎక్కువగా చెమట పడుతుంది. ఈ ప్రక్రియ శరీరం నుండి నీటిని , అవసరమైన ఎలక్ట్రోలైట్లను తొలగిస్తుంది, దీనివల్ల డీహైడ్రేషన్ జరుగుతుంది. నీటి కొరత రక్త ప్రసరణను కూడా నెమ్మదింపజేస్తుంది, దీనివల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ , పోషణ అందవు, ఫలితంగా అలసట, నీరసం , తల తిరగడం వంటివి కలుగుతాయి. అంతేకాకుండా, మండే ఎండలో శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల, గుండె మరింత కష్టపడి పనిచేయాల్సి వస్తుంది, శక్తి వేగంగా ఖర్చవుతుంది. అందుకే వేసవిలో కొద్దిసేపు ఎండలో ఉన్నా కూడా శరీరం త్వరగా అలసిపోయినట్లు , నీరసంగా అనిపిస్తుంది.
రోజంతా చురుకుగా ఉండటానికి ఏమి చేయాలి?
శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి..
వేసవిలో అత్యంత ముఖ్యమైన విషయం శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం. రోజంతా కొద్దికొద్దిగా నీరు త్రాగాలి. దాహం వేసే వరకు వెయిట్ చేయకూడదు. కొబ్బరి నీరు, నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి పానీయాలను కూడా తీసుకోవచ్చు. ఇవి శరీరానికి అవసరమైన ఖనిజాలను , లవణాలను అందిస్తాయి. అలాగే, పుచ్చకాయ, కర్బూజా, దోసకాయ , నారింజ వంటి పండ్లను తినాలి, ఎందుకంటే వాటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది.
ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి..
వేసవిలో తేలికగా , సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినాలి . వేయించిన, మసాలా, నూనెతో కూడిన ఆహారాలు శరీర వేడిని పెంచుతాయి. ఆహారంలో పెరుగు, సలాడ్, పెసలు, ఆకుకూరలు చేర్చుకోవాలి. ఉదయం నానబెట్టిన బాదం, అరటిపండ్లు తినడం వల్ల తక్షణ శక్తి లభించి, నీరసం తగ్గుతుంది.
సూర్యరశ్మి నుండి రక్షణ..
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలి, ఎందుకంటే ఈ సమయంలో సూర్యరశ్మి చాలా తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే, తలను టోపీ, స్కార్ఫ్ లేదా గొడుగుతో కప్పుకోవాలి. శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడే లేత రంగు, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి.
ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ తప్పులు చేయకూడదు..
ఎండ నుండి వచ్చిన వెంటనే చల్లటి నీటిని తాగకూడదు. కాసేపు విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగాలి. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే స్నానం చేయడం లేదా బట్టలు మార్చుకోవడం వంటివి చేయకూడదు. 5 నుండి 10 నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత మాత్రమే ఇలా చేయండి. అలాగే, పని నుండి తిరిగి వచ్చిన వెంటనే ఏసీలోకి వెళ్లే బదులు, ముందుగా ఫ్యాన్ కింద కూర్చోవాలి, దీనివల్ల మీ శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వస్తుంది.
చల్లని ఆహార పదార్థాలను..
ఎండలో నుండి ఇంటికి వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్, చల్లని పండ్లు లేదా ఫ్రిజ్‌లో ఉంచిన నీటిని తాగడం మానుకోవాలి. దీనివల్ల గొంతు నొప్పి లేదా దగ్గు రావచ్చు.
శరీరానికి విశ్రాంతి, నిద్ర..
వేడిలో శరీరం త్వరగా అలసిపోతుంది, కాబట్టి తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. రోజంతా చురుకుగా ఉండటానికి, ప్రతి రాత్రి కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.
తేలికపాటి వ్యాయామం, యోగా..
ఉదయం లేదా సాయంత్రం తేలికపాటి వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది.
*రూపశ్రీ.
