Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నిందితుడూ ఆయనే..బాధితుడూ ఆయనే
posted on: Jul 1, 2017 4:35PM

రాజకీయాల్లో నాయకుడిగా ఎదగాలంటే సందర్భానికి తగ్గట్టు ఎత్తులకు..పై ఎత్తులు వేయడమే కాదు..జనాన్ని ఆకట్టుకునే వాగ్థాటి ఉండాలి..నిజానికి నాయకునికి ఉండాల్సిన మొదటి లక్షణం వాక్ఛాతుర్యం. చాతుర్యం ఉన్నా లేకున్నా కనీసం వాక్కులైనా సరిగ్గా వాగకపోతే ఓట్లు సంగతి తర్వాత..తిట్లు మాత్రం పక్కా. ఎంత కాకలు తిరిగిన రాజకీయ నాయకునికైనా ప్రసంగాలు చేస్తున్నపుడు..కంగారులోనో, అనుకోకుండానో నాలుక కొన్నిసార్లు తడబాటు గురవుతుంది..అప్పుడు వాస్తవంగా చెప్పాలనుకున్న దాని బదులు వేరేది చెప్పేస్తారు. ఇన్ని రోజులు టీడీపీ నేత, మంత్రి లోకేశ్ ప్రసంగాలను విమర్శించి..ఎగతాళీ చేసిన వైసీపీ నేతలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు...ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో దళితులు, అగ్రవర్ణాల మధ్య గొడవ చెలరేగి, కులాల కుంపటి రాజుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న జగన్ ఆ ఊరు వెళ్లి ఇరువర్గాల మధ్య రాజీ కుదర్చాలనుకున్నారు. ఇక్కడి వరకు ఆయన్ను అభినందించాల్సిందే..ఇక వెళుతూ వెళుతూ విలేకరులతో మాట్లాడిన జగనన్న నాలుకకు ఏమైందో ఏమో కానీ..బాధితుల్ని ముందే అరెస్ట్ చేస్తే ఈ గొడవ లేకపోయేది కదా..? అన్నాడు..దీంతో అక్కడున్న జర్నలిస్టులు, వైసీపీ నేతలు, జనం షాక్ తిన్నారు. నిజానికి ఆయన అనాలనుకున్నది "నిందితుల్ని ముందే అరెస్ట్ చేస్తే ఇంత గొడవ జరిగేది కాదు కదా.." అని..
మైకు దొరికితే చాలు ఆఫ్టర్ వన్ ఇయర్ ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిని నేనే అంటూ ఊగిపోతున్న జగన్ అదే పనిగా ఎక్కువ ఆలోచించి..అదే ధ్యాసగా ఉండి..ఆక్రోశం తన్నుకొచ్చేస్తుంటే..ట్రాన్స్‌లోకి వెళ్లినట్లున్నారు..అందుకే నోటికి ఏం వస్తుందో కూడా తెలియడం లేదనుకుంటా..లోకేశ్ ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూసే వైసీపీ నేతలు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి..లోకేశ్‌కు తెలుగు మీద పరిజ్ఞానం తక్కువ..ఇంకా కాస్త బెరుకు పోలేదు..కాబట్టి టంగ్ స్లిప్ అవుతుంది అంటే అర్థముంది..కానీ అనుభవంలోనూ..వయసులోనూ ఎంతో వ్యత్యాసం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి నోరు జారడం విడ్డూరంగా ఉంది..అయినా అక్కడ ఎవరో తరుముతున్నట్లు మాట్లాడటం దేనికి..? హాయిగా, ప్రశాంతంగా ఆచితూచి మాట్లాడితే జగన్‌ని అడిగేవారు ఎవరు లేరు..? కాబట్టి బీ కూల్ అండ్ టేక్ కేర్.






