-
Tithi - Apr, 18 2025
18.04.2025 శుక్రవారం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసము తిథి : పంచమి:మ.01.11వరకు నక్షత్రం : మూల: పూర్తి వర్జ్యం : మ.10.13-02.51 వరకు దుర్ముహూర్తం : ఉ 08.15-09.04 వరకు రాహుకాలం : ఉ10.30-12.00వరకు -
Apr, 2025 Important Days
1. సౌభాగ్య గౌరీ వ్రతం, గణేశ పూజ
2. శ్రీ పంచమి
5. బాబూ జగజ్జీవనరామ్ జయంతి
6. శ్రీరామనవమి
7.ధర్మరాజ దశమి
12. ఒంటిమిట్ట శ్రీరాముల వారి కళ్యాణం
14. అంభేద్కర్ జయంతి
18. గుడ్ ఫ్రైడే
20. ఈస్టర్ సన్ డే
26. మాసశివరాత్రి
27. భరణి కార్తె
Latest Articles
ఇంట్లో పూజ చేసినప్పుడు వాతావరణంలో శాంతి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ సమయం ఆధ్యాత్మిక శుద్ధికి మాత్రమే కాకుండా మానసిక, శారీరక సమతుల్యతకు కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అన్ని నియమాలను పాటించి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. కానీ చాలా సార్లు పూజ తర్వాత తెలియకుండానే కొన్ని పనులు చేస్తారు. ఇది ఈ శక్తిని ప్రభావితం చేస్తుంది. ఇంట్లో చేసే పూజ విజయవంతం కావాలని, ఫలవంతం కావాలని మీరు కోరుకుంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం.
Moreసంసారజీవితంలో చాలామంది అమాయకంగా పడికొట్టుకు పోతుంటారు. అంతా తమ ప్రమేయంతోనే నడుస్తుందన్న అహంకారంతో ఉంటారు! కేవలం మనం కుటుంబజీవితాన్ని గడపడానికీ, మన వారసత్వాన్ని ఈ ప్రపంచంలో మిగిల్చి వెళ్ళడానికీ ఈ లోకంలోకి రాలేదు.
More-
Enduku - Emiti
గంగా నది భారతదేశపు పవిత్ర నదులలో ఒకటి. ఇది జీవనది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది గంగానదిలో స్నానం చేయడానికి వెళతారు. సాధారణంగా నదీ స్నానం లేదా సముద్ర స్నానం చేసి నది నుండి బయటకు రాగానే బట్టలకు ఉన్న నీటిని పిండేస్తుంటారు. అయితే గంగానదిలో స్నానం చేసిన తరువాత ఇలా నీటిని పిండటం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు పండితులు. కేవలం ఇలా నీటిని పిండేయటమే కాకుండా గంగా నది స్నానం తర్వాత చాలామంది చేసే కొన్ని తప్పుల గురించి చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..
Moreమాట్లాడటం అందరూ సహజంగా చేసే పని. అయితే కొన్ని సందర్భాలలో మాట్లాడటం అస్సలు మంచిది కాదట. సాధారణంగా ఏ సందర్భంలో అయినా మాట్లాడటం మనిషి బలహీనతగా పరిగణిస్తారు. కొన్ని సందర్బాలలో అస్సలు మాట్లాడకుండా ఉండలేరు కూడా. కానీ రోజువారీ చేసే కొన్ని పనుల సమయంలో మాట్లాడటం వల్ల చాలా పెద్ద నష్టాలే ఉన్నాయని అంటున్నారు. వీటి గురించి తెలుసుకుంటే..
More -
Vaastu
హిందూ మతంలో స్వస్తిక్ కు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ చిహ్నం తరచుగా పూజలు, ఆధ్యాత్మిక కార్యకలాపాల సమయంలో కనిపిస్తుంది. నిజానికి స్వస్తిక్ ప్రాధాన్యతను గ్రంథాలలో ప్రస్తావించారు. నిరంతరం ఏదైనా సమస్యతో పోరాడుతుంటే లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అనిపిస్తే.. దానిని తొలగించడానికి సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారాన్ని అవలంబించవచ్చు. దీనికి కూడా స్వస్తిక్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఏర్పాటు చేయడం అదృష్టానికి చిహ్నం అంటున్నారు. అసలు ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఎలా తయారు చేసి ఎలా ఏర్పాటు చేయాలి? తెలుసుకుంటే..
Moreతులసి మొక్కను భారతీయులు దైవంతో సమానంగా చూస్తారు. తులసి మొక్కలో మహాలక్ష్మీ నివసిస్తుందని అంటారు. ప్రతి హిందూ ఇంటి ఆవరణలో తులసి మొక్కను తప్పకుండా ఉంచుకుని పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా తులసి మొక్కను పూజించే మహిళలు సౌభాగ్యంతో, సంతోషంతో వర్థిల్లుతారని అంటారు. అయితే తులసి మొక్కకే కాకుండా మనీ ప్లాంట్ గురించి కూడా భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ. మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో లక్ష్మీదేవి అంత తిరగాడుతుందని అంటారు. అయితే తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ ఉండటం మంచిదేనా కాదా అనే విషయం తెలుసుకుంటే..
More -
Aacharaalu
ఇంట్లో పూజ చేసినప్పుడు వాతావరణంలో శాంతి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఈ సమయం ఆధ్యాత్మిక శుద్ధికి మాత్రమే కాకుండా మానసిక, శారీరక సమతుల్యతకు కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అన్ని నియమాలను పాటించి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. కానీ చాలా సార్లు పూజ తర్వాత తెలియకుండానే కొన్ని పనులు చేస్తారు. ఇది ఈ శక్తిని ప్రభావితం చేస్తుంది. ఇంట్లో చేసే పూజ విజయవంతం కావాలని, ఫలవంతం కావాలని మీరు కోరుకుంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం.
Moreవిష్ణువును త్రిమూర్తులలో ఒకరిగా భావిస్తారు. మానవాళిని, ప్రపంచాన్ని రక్షించడానికి విష్ణువు ప్రతి యుగంలో అవతారం తీసుకున్నాడు. ఇక శ్రీకృష్ణుడు స్వయంగా తానే ధర్మ సంస్థాపన కోసం తాను ప్రతి యుగంలోనూ ఆవిర్భవిస్తానని చెప్పాడు. సాక్షాత్తు విష్ణు మూర్తి స్వరూపం అయిన శ్రీకృష్ణుడు చెప్పిన ఈ మాట విష్ణువు దశావతారాల గురించి తెలుసుకుంటే అర్థం అవుతుంది. మహా విష్ణువుకు ఏకాదశి అంటే చాలా ప్రీతి. ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి, ఏకాదశి వ్రతం చేస్తారో.. వారికి వైకుంఠం ప్రాప్తిస్తుందని, మహా విష్ణువు అనుగ్రహానికి పాత్రులు అవుతారని చెబుతారు. ఏకాదశి రోజు విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది.
More
కలియుగానికి గొప్ప గురువు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణుడే.. నాటి కాలం నుండి నేటి కాలానికి కూడా శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలు ప్రజలకు ఎంతో గొప్ప సందేశాన్ని ఇస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత సారం యుగయుగాలకు గొప్ప...
Moreమహాభారతం నేటి కాలానికి కూడా ప్రజలకు ఒక మార్గదర్శకం లాంటిది. ఇది ఒక ఇతిహాసం. దీనిలో కర్మ, విధి, శాపాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మహాభారతంలో ఒకరు పొందిన ఆశీర్వాదం, సంతోషం, వరం కంటే.. ఎక్కువ శాపాలు ప్రస్తావించబడ్డాయి. మహాభారతం శాపాలచే ఎక్కువగా ప్రభావితమైంది. ఇది కాలచక్రాన్ని ప్రభావితం చేయడమే కాకుండా మొత్తం యుద్ధాన్నే మార్చివేసింది. మహాభారత చరిత్రకు కొత్త మలుపు ఇచ్చిన మహాభారత కాలం నాటి కొన్ని ప్రధాన శాపాల గురించి వివరంగా తెలుసకుంటే..
Moreసోమవారం పరమేశ్వరుడి పూజ చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంటుంది. శివ భక్తులు సోమవారం శివుడిని భక్తిగా పూజించడమే కాకుండా ఉపవాసం కూడా ఉంటారు. శివుడి అద్భుతమైన క్షేత్రంగా కాశీ పిలవబడుతుంది. కాశీ దేవదేవుడు అయిన పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిత్యం జరుగుతూ ఉంటాయి. అయితే కాశీ క్షేత్రంలో సప్తఋషి హారతి ఇస్తారు. ఇది ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఇస్తారో చాలా మందికి తెలియదు. చాలా మంది దీని గురించి తెలుసుకోకుండానే కాశీకి వెళ్లి వస్తుంటారు. సప్రఋషి హారతి గురించి తెలుసుకుంటే..
Moreగ్రుడ్డివాని వెంట వెళ్ళే గ్రుడ్డివారివలె ప్రజలందరూ ఒకరిని చూసి మరొకరుగా వ్యవహారములలో మునిగిపోతున్నారు. తాము చేస్తున్న పనికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకోకుండానే ప్రజలు వ్యవహరిస్తున్నారు. ఎవనికైనా ఒకనికి ఏదో కొంచెం ఫలం దైవికంగా సంభవించడం చూసి, తమకు కూడా అటువంటి ఫలమే అంతకన్నా అధికంగా లభిస్తుందనే పేరాశతో, శక్తికి మించిన పనులను పూనుకొని ఆపదలను కూడా పొందుతున్నారు. ఇదంతా - ఎరను చూసి దానికొరకు గాలములో చిక్కుకొంటున్న చేపలాగా ఉంది. అలాగాక ఈ దిక్కుమాలిన సంసారంలో సుఖం ఏముంది..
Moreభగవద్గీత.. భారతీయులకు లభించిన గొప్ప కానుక అని చెప్పవచ్చు. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భోధించిన సారాంశమే భగవద్గీతగా పిలవబడుతోంది. భగవద్గీతలో చాలా అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కోక్క అధ్యాయంలో మళ్లీ కొన్ని శ్లోకాలు ఉన్నాయి. తెలియని వారికి ఇవి ఒట్టి శ్లోకాలు అనిపిస్తాయి. కానీ వీటి అర్థం తెలుసుకుంటే జీవితమే మారిపోతుంది. భగవద్గీత శ్లోకాలలో ఉన్న సారాన్ని తెలుసుకుని విదేశీయులు కూడా సనాతన ధర్మంలోకి వచ్చేస్తున్నారు. అంతటి శక్తి, అంత గొప్ప సారాంశం భగవద్గీతలో ఉంది. అయితే ఒక వ్యక్తి విజయం సాధించాలంటే భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకాన్ని తెలుసుకోవాలి. ఇంతకీ ఆ శ్లోకం ఏంటి? అందులో ఉన్న సారాంశం ఏంటి? అని తెలుసుకుంటే..
Moreసనాతన ధర్మంలో పూర్వీకులకు లేదా మరణించిన పెద్దలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ప్రతి శుభకార్యంలో పితృదేవతలను కూడా పూజిస్తారు. వివాహం, కుంభరాయణ కార్యక్రమం వంటి ముఖ్యమైన సందర్భాలలో పూర్వీకులను ఆహ్వానిస్తారు. ఎందుకంటే వారి ఆశీర్వాదాలు పిల్లలు, కుటుంబ సంక్షేమానికి చాలా అవసరం. పూర్వీకులు దుఃఖిస్తే వ్యక్తి జీవితంలో అతని కుటుంబంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబం మొత్తం పితృ దోషం బారిన పడవచ్చు. దాని ప్రభావం ఏడు తరాల వరకు ఉంటుందని నమ్ముతారు. అసలు పితృదోషం వల్ల ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? తెలుసుకుంటే..
More