బంగ్లాదేశ్ లో ఉన్న ఈ శక్తి పీఠాల గురించి తెలుసా!

భారతీయులు అమ్మవారిని శక్తి స్వరూపంగా భావిస్తారు. అదే రూపంలో పూజిస్తారు. అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలను శక్తి పీఠాలు అని అంటారు. అయితే కేవలం భారతదేశంలోనే కాకుండా భారతదేశానికి పొరుగు దేశం అయిన బంగ్లాదేశ్ లో కూడా అమ్మవారి శక్తి పీఠాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారట. ఇక్కడున్న ఏడు శక్తి పీఠాల గురించి తెలుసుకుంటే..
జెస్సోరేశ్వరీ శక్తిపీఠం..
జెస్సోరేశ్వరీ శక్తి పీఠం లేదా జేషోరేశ్వరీ శక్తి పీఠం లో జేషోరేశ్వరి కాళి ఆలయం ఉంది. కాళి దేవత ఇక్కడ ప్రధాన దేవత. ఇది 13వ శతాబ్గానికి చెందిన ఆలయం అని, దీని నిర్మాణ శైలి లో13వ శతాబ్దపు ఆనవాళ్లు ఉన్నాయని చెబుతారు. బంగ్లాదేస్ లోని సత్ఖిరా జిల్లాలో ఈ ఆలయం ఉంది. సతీదేవి అరచేతులు ఈ ప్రదేశంలో పడ్డాయని సనాతన గ్రంథాలలో పేర్కొనబడింది. అప్పటి నుండి కాళి దేవిని ఈ ప్రాంతంలో పూజిస్తున్నారు.
సుగంధ శక్తిపీఠం..
సుగంధ శక్తిపీఠంలో తారా దేవి వెలిసింది. సుగంధ నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతంలో సతీదేవి ముక్కు పడిందని నమ్ముతారు. సుగంధ శక్తిపీఠ ఆలయం బంగ్లాదేశ్‌లోని శికార్‌పూర్‌లో ఉంది. ఈ ఆలయాన్ని భైరవుడు సంరక్షిస్తున్నాడు. బంగ్లాదేశ్ లోని శికార్పూర్ లో ఉన్న సుగంధ శక్తిపీఠం హిందువులకు ఒక ప్రధాన యాత్రా స్థలం. అమ్మవారి ఆశీస్సులు పొందడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ శక్తిపీఠాన్ని సందర్శిస్తారు.
చట్టల్ మా భవానీ శక్తిపీఠం..
చట్టల్ మా భవానీ శక్తిపీఠంలో దుర్గాదేవి పూజలు అందుకుంటోంది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లాలో ఉన్న చట్టల్ మా భవానీ శక్తిపీఠం చంద్రనాథ్ పర్వత శిఖరంపై ఉంది. సతీదేవి గడ్డం యొక్క ఒక భాగం ఈ ప్రదేశంలో పడిందని మత విశ్వాసం. అందువల్ల, శక్తిపీఠాన్ని భవానీ శక్తిపీఠం అని కూడా పిలుస్తారు. వైష్ణో దేవి మాదిరిగానే, చంద్రనాథ్ పర్వతం పైభాగంలో భైరవ దేవుడి ఆలయం కూడా ఉంది.
జయంతి శక్తిపీఠం..
జయంతి శక్తిపీఠం బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ జిల్లాలో ఉంది. ఈ ఆలయం సిల్హెట్ జిల్లాలోని బౌర్‌బాగ్ గ్రామంలో ఉంది. సతీదేవి ఎడమ తొడ జయంతి శక్తిపీఠంలో పడిందని ఒక మత విశ్వాసం ఉంది. అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలు భక్తులు వస్తుంటారు. జయంతి శక్తిపీఠం సుమారు 6 ఎకరాలలో విస్తరించి ఉంది.
మహాలక్ష్మీ శక్తిపీఠం..
బంగ్లాదేశ్‌లోని ఏడు శక్తిపీఠాలలో మహాలక్ష్మి శక్తిపీఠం ఒకటి. ఈ మహాలక్ష్మి శక్తిపీఠం బంగ్లాదేశ్‌లోని సిల్హెట్ జిల్లాలో ఉంది, గోటాటికర్ సమీపంలోని జోద్న్‌పూర్ గ్రామంలో ఆలయ కేంద్రం ఉంది. సంతోషానికి, అదృష్టానికి, ఐశ్వర్యానికి అధిదేవత అయిన మహాలక్ష్మీ ఇక్కడ పూజలు అందుకుంటోంది. పురాణాల ప్రకారం సతీ దేవి మెడ ఇక్కడ పడిందని చెబుతారు. శుక్రవారాల్లో మహాలక్ష్మీ శక్తిపీఠం భక్తులతో నిండి ఉంటుంది. అమ్మవారి ఆస్థానం నుండి ఏ భక్తుడూ ఖాళీ చేతులతో తిరిగి రాడని చెబుతారు.
శ్రావణి శక్తిపీఠం..
శ్రావణి శక్తిపీఠం బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లాలో ఉంది. దీన్ని ది బ్రిడ్జ్ క్రానికల్ అని పిలుస్తారు . ఈ ఆలయం యొక్క ప్రధాన కేంద్రం కుమిరా రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది. సతిదేవి వెన్నెముక శ్రావణి శక్తిపీఠ స్థలంలో పడిందని నమ్ముతారు. ఈ ఆలయంలో సత్యదేవి పూజలు అందుకుంటోంది. నిమిష్వైభవ అని పిలువబడే భైరవుడు కూడా శ్రావణి శక్తిపీఠ ఆలయంలో పూజలందుకుంటాడు. కుమిరా రైల్వే స్టేషన్‌కు కుమారి పేరు పెట్టారు. శ్రావణి శక్తిపీఠానికి బంగ్లాదేశ్ నుండి మాత్రమే కాకుండా భారతదేశం నుండి కూడా దర్శనం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు.
అపర్ణ శక్తి పీఠం..
బంగ్లాదేశ్‌లోని ఏడు శక్తి పీఠాలలో చివరి ప్రధాన మందిరం అపర్ణ శక్తి పీఠం. ఈ శక్తి పీఠం బంగ్లాదేశ్‌లోని షేర్పూర్ జిల్లాలో ఉంది. అపర్ణ శక్తి పీఠ ప్రధాన కేంద్రం కరాటోయ నది ఒడ్డున ఉన్న భవానీపూర్ గ్రామంలో ఉంది. ఈ శక్తిపీఠం కరాటోయ, యమునేశ్వరి, బుధి తీస్తా నదుల సంగమం వద్ద ఉంది. ఈ ప్రదేశంలోనే సతీ దేవి ఎడమ పాదం పడిందని చెబుతారు.
*రూపశ్రీ.


