సంకట హర చతుర్థి ఎప్పుడు.. ఆ రోజు వినాయకుడిని పూజించడం చాలా ప్రాముఖ్యత ఎందుకంటే..!

 

 

వినాయకుడు విఘ్నాలను తొలగించేవాడు.  ఏ పూజ లేదా శుభకార్యం లో అయినా తొలి పూజ అందుకునేది వినాయకుడే.. అలాంటి వినాయకుడికి  ప్రత్యేకంగా పూజ చేయడం అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.  సాధారణంగా ప్రతి ఏడాది వినాయక చవితిని జరుపుకుంటారు.  అయితే ఇది మాత్రమే కాకుండా వినాయకుడిని ఆరాధించే శక్తివంతమైన వ్రతం ఉంది.  అదే సంకట హర చతుర్థి. సంకట హర చతుర్థి రోజు వినాయకుడిని ఎందుకు పూజిస్తారు? దీని వెనుక కారణం ఏంటి? ఇలా పూజించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? తెలుసుకుంటే..

సంకట హర చతుర్థి..

వినాయకుడిని వినాయక చవితి రోజు పూజించడం అందరికీ తెలిసిందే.. అయితే ఏ కారణం చేత అయినా వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేసుకోలేని వారు ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున సంకట హర చతుర్థి వ్రతం చేసుకోవచ్చు. ఒక ఏడాది క్రమం తప్పకుండా సంకట హర చతుర్థి వ్రతం చేస్తే వినాయకుడి అనుగ్రహం కలిగి అనుకున్న పనులలో ఆటంకాలు తొలగుతాయట. అలాగే తలపెట్టిన పనులలో విజయం సాధించగలరని కూడా అంటారు.

సంకట హర చతుర్థి వ్రతం చేస్తే కలిగే ఫలితాలు..

గణపతి వ్రతం చేసే వారికి బుద్ధి, జ్ఞానం, ఆరోగ్యం, ధనం లభిస్తాయని పురాణాలు చెబుతాయి.

చవితి రోజు రాత్రి చంద్రుడి దర్శనం చేసుకోవడం తప్పనిసరి.. చంద్రుని దర్శనం  ఒక శక్తివంతమైన ఫలితాన్ని ఇస్తుంది. చంద్రుడు  మనసుకు ప్రశాంతతను, చైతన్యాన్ని ప్రసాదిస్తాడు. గణపతి మనసులోని గందరగోళం తొలగించి శాంతి ప్రసాదిస్తాడు.

సంకట హర చతుర్థి రోజు ఉపవాసం ఉంటే..

సంకట హర చతుర్థి రోజు ఉపవాసం ఉంటే ఇంట్లో విఘ్నాలు తొలగిపోతాయి. పిల్లలకు దీర్ఘాయుష్షు కలుగుతుంది. వ్రతం చేసేవాపై  గణపతి కరుణ కలుగుతుంది.  గణపతి ఆశీస్సులు ఉంటే ఎలాంటి పనులైనా దిగ్విజయం అవుతాయి.

                                *రూపశ్రీ.


More Vyasalu