ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఉండటం వల్ల ఏం జరుగుతుంది!

 


హిందూ మతంలో స్వస్తిక్ కు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ చిహ్నం తరచుగా పూజలు,  ఆధ్యాత్మిక కార్యకలాపాల సమయంలో కనిపిస్తుంది. నిజానికి స్వస్తిక్  ప్రాధాన్యతను గ్రంథాలలో ప్రస్తావించారు.  నిరంతరం ఏదైనా సమస్యతో పోరాడుతుంటే లేదా ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని అనిపిస్తే.. దానిని తొలగించడానికి సులభమైన,  ప్రభావవంతమైన పరిష్కారాన్ని అవలంబించవచ్చు. దీనికి కూడా స్వస్తిక్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఏర్పాటు చేయడం   అదృష్టానికి చిహ్నం అంటున్నారు. అసలు ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ ఎలా తయారు చేసి ఎలా ఏర్పాటు చేయాలి? తెలుసుకుంటే..

సనాతన ధర్మంలో స్వస్తికకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని తయారుచేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం అవసరం. ప్రధాన ద్వారం మీద స్వస్తికను ఏర్పాటు చేయడానికి దాని మెటీరియల్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎరుపు రంగు సిందూరాన్ని మాత్రమే వాడండి ఎందుకంటే ఇది శుభం,  శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది.

ఎరుపు రంగు సానుకూలత,  శ్రేయస్సును ఆకర్షిస్తుంది. దీనితో పాటు తొమ్మిది వేళ్ల పొడవు,  వెడల్పు గల స్వస్తికను తయారు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది ఇంట్లో ఆనందం,  శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుందని,  వాస్తు దోషాలను తొలగిస్తుందని చెబుతారు.

స్వస్తిక తయారు చేసేటప్పుడు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..

పరిశుభ్రత ..

ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ తయారు చేసిన తర్వాత, ఆ స్థలాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. ధూళి పేరుకుపోనివ్వవద్దు, ఎందుకంటే అది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది.

బూట్లు,  చెప్పులు..

స్వస్తిక తయారు చేసిన చోట బూట్లు,  చెప్పులు ఉంచవద్దు. ఇది సానుకూల శక్తిని అడ్డుకుంటుంది.

ఇంటి ప్రాంగణం..

ప్రధాన ద్వారం కాకుండా, ఇంటి ప్రాంగణం మధ్యలో కూడా స్వస్తిక్ ను తయారు చేయవచ్చు. ఇది మొత్తం ఇంటిలో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది.

ఎరుపు రంగును మాత్రమే..

స్వస్తిక్ తయారు చేసేటప్పుడు, ఎరుపు రంగు వస్త్రం లేదా పసుపు-కుంకుమను మాత్రమే వాడాలి. ఇతర రంగులను ఉపయోగించవద్దు.
స్వస్తిక్ మతపరంగా మాత్రమే కాకుండా ఇంట్లో శాంతి, శ్రేయస్సు,  సానుకూల శక్తిని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది. సరైన రీతిలో తయారు చేయడం వల్ల, ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా,  శుభప్రదంగా మార్చవచ్చు.

                                   *రూపశ్రీ.
 


More Vastu