తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ ఉండటం మంచిదేనా!
తులసి మొక్కను భారతీయులు దైవంతో సమానంగా చూస్తారు. తులసి మొక్కలో మహాలక్ష్మీ నివసిస్తుందని అంటారు. ప్రతి హిందూ ఇంటి ఆవరణలో తులసి మొక్కను తప్పకుండా ఉంచుకుని పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా తులసి మొక్కను పూజించే మహిళలు సౌభాగ్యంతో, సంతోషంతో వర్థిల్లుతారని అంటారు. అయితే తులసి మొక్కకే కాకుండా మనీ ప్లాంట్ గురించి కూడా భారతీయులకు సెంటిమెంట్ ఎక్కువ. మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో లక్ష్మీదేవి అంత తిరగాడుతుందని అంటారు. అయితే తులసి మొక్క దగ్గర మనీ ప్లాంట్ ఉండటం మంచిదేనా కాదా అనే విషయం తెలుసుకుంటే..
మనీ ప్లాంట్.
వాస్తు ప్రకారం ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్‌ను నాటవచ్చు. ఇలా చేయడం వల్ల పేదరికం తొలగి ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందట. అలాగే ఈ దిశలో మనీ ప్లాంట్‌ను నాటడం ద్వారా అన్ని రకాల ప్రతికూల శక్తులు ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటాయట.
తులసి మొక్క.
వాస్తు శాస్త్రంలో తులసి మొక్కను ఇంటి ఉత్తరం, ఈశాన్య, తూర్పు దిశలు ఉత్తమంగా పరిగణించబడతాయి. దీనితో పాటు, తులసి మొక్కను పూజా స్థలంలో లేదా వంటగది దగ్గర కూడా ఉంచవచ్చు. అయితే మహిళల నెలసరి సమయంలో వంటగది, పూజ గదిలోకి పోకుండా ఉండేలా అయితేనే ఇలా పెంచుకోవచ్చు. ఇలా చ్సేతే అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. దీనితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తులసిని కూడా పూజించాలి.
కలిపి ఉంచితే..
తులసి, మనీ ప్లాంట్, రెండూ సానుకూల శక్తిని ప్రోత్సహించే మొక్కలు. ఇంట్లో తులసి మొక్కను, మనీ ప్లాంట్‌ను కలిపి ఉంచితే పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుందట. ఇది కాకుండా ప్రతికూల శక్తి ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటుందట.
ఇది మాత్రం చేయవద్దు..
వాస్తు ప్రకారం మనీ ప్లాంట్, తులసి చుట్టూ ముళ్ల మొక్కలను ఎప్పుడూ నాటకూడదు. దీని కారణంగా, ఈ మొక్కల యొక్క సానుకూల ప్రభావాలు తగ్గుతాయి. మొక్కలను పెంచినా ఇంట్లో సానుకూల ఫలితాలు ఉండవట.
*రూపశ్రీ.
