Sinus Can infect through Milk Sinus symptoms and signs are caused because of infection of sinus and resulting causes the swelling because of bacteria within the cavities of sinus. The sinuses are the cavities which are open in the continuous connection with nasal openings which are free for both air and mucous. At this situation, sounds certain type of volume. When sinus gets blocked because of certain swelling and infectious air already present inside the sinus then this situation causes the sinus headache. Some of the Sinus Headache symptoms are - • Severe cold in spite of medication. • Pain in the head aggravates when leaning or bending forward. • Blockage of nose • Irritation in throat • Unable to sleep of flat back • Pain in the ‘T’ area forehead, around the eyes and nose. • Fatigue • Mild fever • Weakness • Swelling in the eye lids. • Bad breathe • Swelling of the gums. Sinus Infection Prevention In many cases, you can feel a sinus infection coming, therefore, instead of waiting around for it to hit you full blast – do something to prevent it. Below are a few things you can do to help keep the beast at bay. Filters Try to keep the air in your home moist by getting a humidifier or an air conditioner, which regulates the temperature during hot and cold weather. Electrostatic filters are also good for improving air quality in your home by removing the allergens in the air. Avoid pollution Exposure to polluted environments and contaminated air may irritate the nasal passages and aggravate your sinusitis. Chemicals and strong fumes may irritate your sinus linings. Drink lots of water Water increases the amount of moisture in the body and helps to prevent congestion. It also helps to thin the mucus for proper drainage. Eliminate alcohol consumption Sinus infections are also triggered by alcohol consumption because it inflames the nasal and sinus membranes, which leave them exposed to irritation. Drinking in moderation is the key to help reduce the chances of getting a sinus infection induced by alcohol consumption. Eliminate smoking habits If you smoke and you continually get sinus infections, it is time to quit. Smoking irritates the sinus lining, which inhibits draining of the mucus, thus, making you feel congested. Upon quitting, it will also be wise for you to stay away from second hand smoke. Stay hydrated Staying hydrated is another crucial step in preventing sinus infections. Drink plenty of water, juice, tea, or chicken soup. Liquids will replenish what the body lost. Good hygiene Most sinus infections are caused by viral or bacterial infections; therefore, practicing good hygiene plays a major role in preventing it. You should take showers twice a day and wash your hands each time you go to the bathroom. People who cover their mouth after a sneeze should wash their hands also, because the germs remain on your hands. Avoid Milk Milk is also a culprit in promoting sinus problems. Although milk is a good source of calcium, it is no friend of the sinuses. According to studies, too much milk can thicken your mucus and cause nasal passages to narrow, which leads to headache and sinus pain. Eat plenty of fruits and vegetables You must eat fruit and vegetables that are rich in antioxidants and other chemicals that could boost your immune system and help your body resist infection. Eliminate stress Try to limit or eliminate stress in your life. Stress weakens your ability to fight of infections. Therefore, getting sufficient rest and relaxation is very important to prevent sinus infection. Home Remedies for Sinus • A tsp of black cumin seeds tied in a thin cotton cloth provides relief when inhaled. • Take few capsules of cayenne during or after each meal for several days till the infection is cleared up. Alternatively put 1 tsp of cayenne in cup of hot water and drink a cupful of this thrice a day. • Add few drops of eucalyptus oil to 1/2 cup boiling water. Pour the mixture into a bowl and inhale the steam for 10 - 15 minutes with your head covered with a large towel. • Put few drops of eucalyptus oil on your handkerchief and sniff periodically. • Dissolve 1 tsp of salt in 2 cups of water and use it through a nasal inhaler. • Make a nasal flush by mixing 1/4 tsp salt, 1/4 tsp baking soda in one cup of warm water. Fill the syringe with the solution and drop the mixture up your nose. • Dissolve 1 tsp un iodized salt and 1/2 tsp baking soda in a pint of water and inhale it through nasal inhaler. • Steep 1-2 tsp of thyme in a cup of boiling water for 10 minutes. Drink a cupful of this mixture three times a day. Because of its strong antiseptic properties, thyme is good for respiratory infections. • Sipping hot teas made with herbs such as fenugreek, fennel, anise, or sage may help move mucus even more and keeps it flowing. • Blow one nostril at a time. This will help prevent pressure buildup in the ears, which can send bacteria further back into the sinus passages. • Sniffling whenever your nostrils feel stuffed is a good way to drain the sinuses and stale secretions down the throat. • Press your thumbs to the either side of the nostril to bring a fresh blood supply to the area and soothing relief. • Apply warm wash cloth over your eyes and cheekbones. Leave it till you feel the sinus pain subsiding. • Carrot and spinach juice taken regularly is also found to be highly beneficial. • Eat pungent herbs like garlic, horseradish because it contains a chemical that moves mucus and makes it less sticky. • Garlic, Onions, Horseradish, Hot Pepper and Ginger added to any soup broth will open the sinuses. • Steep fresh basil in cupful of water and drink it to alleviate the stuffiness caused by inflamed membranes. • Pungent oils such as thymol and camphor help open clogged passages. • Tilt your head back and place a tsp of onion juice in each nostril. Repeat when needed. • Grate fresh lotus root, mix it with grated ginger and unbleached white flour. Apply the mixture directly to the skin. You can leave this for several hours or overnight. Repeat for a week or more till you get relief. This is mixture is quite effective dispersing and moving stagnated mucus. There could be watery discharge from the eyes or nose. Note : If the high fever persists that it is advisable to consult your doctor immediately. The patient experiences pain in the infected sinus cavity.
If you are flu infected stop eating Flu or Flu is a disease caused by the RNA (ribonucleic acid) flu virus. It is an infection that occurs in the respiratory tract of humans, animals and birds. The flu virus travels in the air and enters in your body through the nose or mouth. It is a highly contagious disease which spreads through coughing and sneezing of an affected person. Causes for Flu The flu virus passes through the air and spreads the disease in many ways. You may inhale droplets the cough and sneeze of an infected person. Flu virus infects your respiratory tract that results in rashes and sore throat. The virus changes according to the environment resulting in development of new strains. This makes it difficult for our body to fight the virus effectively. Additionally, you may come in contact with an object that has been contaminated by touch of an infected person. Here are some common causes for flu Saliva Cough Sneeze Infected Surface Sexual contact Blood transfusion Infected needles Pregnant mother to infant Symptoms of Flu The common symptoms of the flu include: Fever (100º F or greater) Headache Muscle aches Chills Extreme tiredness Cough Runny nose (more common in children than adults) Flu Preventions A shot of flu vaccination is a good flu preventions step. But it does not guarantee you a hundred percent protection for whole length of the season. Taking preventive steps during a flu outbreak help you avoid infections and keep others from being infected by you. Wash your hands frequently Don’t skip sleep Drink good amount of water Avoid touching your hands to your eyes, nose, mouth or face. Avoid infected people Avoid crowded places Strengthen your immune system Exercise Avoid alcohol and smoking Be informed about the disease Flu treatment in home If you have Flu you can expect the illness to go away on its own in about 7 to 10 days. In the meantime, you can take steps to feel better: Since there is no stomach flu treatment, you are going to need some home remedies for stomach flu. The first thing that you are going to want to do is to let your stomach settle. To do this, you can just stop eating and drinking for only a few hours. The best stomach flu home remedies involve taking small sips of water, or even just sucking on ice. I If you have any clear soda, that normally works well too. Clear soda would be things like Sprite or 7up. You could even try drinking some decaffeinated drinks, like Gatorade. As soon as you are up to it, you need to start easing back into eating again. There are some foods that you should avoid at this time, however. This would include things like dairy products, alcohol and, of course, fatty foods. Just like with any kind of flu, you are going to need lots of rest. The more you are up moving around, the longer it is going to take your body to fight off the virus. Last, but not least, be very careful with medication. Most of the time, medications can just make your stomach more upset. Your best bet is to use medications like ibuprofen.
డిప్రెస్సివ్ డిజార్డర్ Depressive Disorder మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఒక్కోసారి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి సంతోషాన్ని పంచితే, ఒక్కోసారి వైఫల్యం కన్నీళ్ళే మిగులుస్తుంది. విజయం ఉత్సాహాన్ని ఇస్తే, వైఫల్యం మాత్రం చాలా కృంగదీస్తుంది.. మనిషి నానాటికీ డిప్రెషన్ కి లోనవుతుంటాడు , ఫలితంగా తనపై తాను పూర్తిగా నమ్మకాన్ని కోల్పోతాడు. ప్రతి ఒకరు ఎప్పుడో అప్పుడు ఏదో విషయంలో బాధపడుతూనే ఉంటారు, కానీ ఈ బాధ, నిస్సహాయాత మనల్ని డామినేట్ చేయడం మొదలుపెడితే దానిని డిప్రెస్సివ్ డిజార్డర్ అని కూడా అంటారు. ఈ డిప్రెసివ్ డిజార్డర్ లోను రెండు రకాలు ఉన్నాయి. మొదటిది మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అయితే రెండవది డైస్తిమిక్ డిజార్డర్. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ సాధారణంగా రెండు మూడు వారాలు మనిషిని డిప్రెషన్ లో ఉండేలా చేస్తుంది. ఫలితంగా నిద్రలేమి, తిండిపై అయిష్టత పెరగడం, బరువులో మార్పు, ఏకాగ్రత లోపించడం, తనపై తానూ నమ్మకాన్ని కోల్పోవడం, ఒక్కోసారి ఈ డిప్రెషన్ లో ఉన్నవారు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతుంటారు . ఈ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ మనిషిలో కొద్ది కాలమే ఉన్నా, దాని ఫలితాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కుటుంబ సభ్యులు గాని, స్నేహితులు గాని మనస్థైర్యాన్ని ఇస్తే వీరు త్వరలోనే ఈ డిజార్డర్ నుండి బయటపడగలరు. ఇక రెండవది డైస్తిమిక్ డిజార్డర్. ఇది సాధారణంగా 16 ఏళ్ళ వరకు ఉంటుంది. డైస్తిమిక్ డిజార్డర్, మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ లా ఒక్కసారిగా ప్రభావం చూపకపోయినా అప్పుడప్పుడు మనిషిని పూర్తిగా నిరుత్సాహ పడేలా చేస్తుంది . ఈ డిజార్డర్ ఉన్నవాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారో, ఎప్పుడు డిప్రెస్ అయిపోతారో చెప్పడం కష్టం.వీరిలోనూ ఏకాగ్రత లోపించడం, నిద్రలేమి, ఆకలి లేకపోవడం, తనపై తాను నమ్మకం కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి . డిప్రెషన్ ఎలాంటిదైనా ఈ లక్షణాలు ముఖ్యంగా సెన్సిటివ్ గా ఉండేవారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది . కుటుంబంలోని వారి మధ్య ఉండే సాన్నిహిత్యం , తను పెరిగిన పరిస్థితుల ప్రభావం కూడా డిప్రెషన్ కి కారణమవుతుంది. ఒక్కోసారి మనకు ఎంతో సంతోషాన్ని , బలాన్ని ఇచ్చిన సంఘటనలు, పరిస్థితులు తారు మారయినప్పుడు అవే బలహీనతలైపోతాయి . ట్రీట్ మెంట్ : రెండు వారాలలోపు మీరు డిప్రెషన్ లోంచి బయటపడటం లేదు అనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించండి . డాక్టర్ సలహాతో పాటు ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి. వీలైనంత విశ్రాంతి తీసుకోండి . పోషకాహారం తినండి. ప్రతిరోజూ వ్యాయామం క్రమం తప్పకుండా చేయండి . డ్రగ్స్, ఆల్కహాల్ కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి . మీకిష్టమైన ఆక్టివిటీస్ లో పాల్గొంటూ ఉండండి . వీలైనంత వరకు మీ కుటుంబ సబ్యులతో , స్నేహితులతో గడపడానికి ప్రయత్నించండి. కౌన్సిలింగ్ తీసుకోండి, వారిచ్చే సలహాలు మీకు ధైర్యాన్ని, ఊరటను కలిగించవచ్చు. ప్రార్ధనలు, దైవ కార్యాలలో విరివిగా పాల్గొనండి, ఆధ్యాత్మిక భావన మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోండి , ఇది చేపల్లో అధికంగా ఉంటుంది. విటమిన్ B9 ఉన్న ఆహారాన్ని తీసుకోండి . వీటన్నింటి కంటే ముందు డిప్రెషన్ లోంచి బయటపడాలి అంటే ముందుగా మీరు దానికి సిద్ధపడాలి. మీ ప్రయత్నం లేకుండా ఎన్ని మందులు వేసుకున్నా, ఎంత కౌన్సిలింగ్ తీసుకున్నా ప్రయోజనం ఉండదు. కాబట్టి జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒడిదుడుకులను ఎదుర్కోవాలి అన్న మనస్థైర్యాన్ని అలవరుచుకోండి. సంతోషంగా ఉండండి.
సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ - డయాస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ Systolic Blood Pressure - Diastolic Blood pressure ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, కీళ్ళ నొప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం, ఏదైనా తింటే ఆరోగ్యం చెడి పోతుందని తెలిస్తే చాలు, దానికి అన్ని రకాలుగా ఉండటానికి ప్రయత్నిస్తాం, అదే క్రమంలో అప్పుడప్పుడు బి. పి. ని కూడా చెక్ చేస్తూ ఉండటం మరిచిపోకూడదు. ఎందుకంటే హై బి. పి. అయినా లో బి. పి. అయినా సమస్య తీవ్రమైతే గానీ, దాని లక్షణాలు పైకి కనబడవు, సమస్య తీవ్రమయ్యాక ఇబ్బందులు పడే కంటే దాని గురించి ముందుగానే తెలుసుకుని జాగ్రత్తలు పాటించడం మంచిది. బ్లడ్ ప్రెజర్ సాధారణ స్థాయిని మించినప్పుడు దానిని సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ అంటారు.దీనినే హై బి. పి. అంటాం. బ్లడ్ ప్రెజర్ సాధారణ స్థాయి నుండి తగ్గినప్పుడు డయాస్టాలిక్ ప్రెజర్ అంటారు. దీనిని మనం లో బి పి అంటాం. హై బ్లడ్ ప్రెజర్ లక్షణాలు తొందరగా అలసిపోవడం, నీరసంగా ఉండటం, చెమటలు పట్టడం... లో బ్లడ్ ప్రెజర్ లక్షణాలు చిన్న పనులకే అలసిపోవడం, నీరసంగా ఉండటం, అస్తమానం నిద్ర మత్తులో ఉండటం, చివరిగా బి పి లో అయితే కోమా లో కి వెళ్ళే ప్రమాదముంది. బ్లడ్ ప్రెజర్ రీడింగ్ సిస్టాలిక్ - డయాస్టాలిక్ 210 - 120 - స్టేజ్ 4 హై బ్లడ్ ప్రెజర్ 180 - 110 - స్టేజ్ 3 హై బ్లడ్ ప్రెజర్ 160 - 100 - స్టేజ్ 2 హై బ్లడ్ ప్రెజర్ 140 - 90 - స్టేజ్ 1 హై బ్లడ్ ప్రెజర్ 140 - 90 - బార్డర్ లైన్ హై బ్లడ్ ప్రెజర్ స్టేజ్ 130 - 85 - హై నార్మల్ బ్లడ్ ప్రెజర్ స్టేజ్ 120 - 80 - నార్మల్ బ్లడ్ ప్రెజర్ 110 - 75 - లో నార్మల్ బ్లడ్ ప్రెజర్ 90 - 60 - బార్డర్ లైన్ లో బ్లడ్ ప్రెజర్ 60 - 40 - టూ లో బ్లడ్ ప్రెజర్ 50 - 33 - డేంజర్ బ్లడ్ ప్రెజర్ హై బి.పి. కి కారణాలు : కొన్ని సార్లు మనం వాడే మందులు కూడా హై బి.పి. కి కారణం కావచ్చు, ఉదాహరణకు అస్తమా, థైరాయిడ్, లేదా ఇంకేవైనా మందులు వాడుతున్నప్పుడు హై బి.పి. కి గురయ్యే అవకాశముంది.ముఖ్యంగా మహిళల్లో ప్రెగ్నెన్సీ రాకుండా మందులు వేసుకోవడం వల్ల హై బి.పి. సమస్య రావచ్చు, అందుకే ఏ చికిత్స తీసుకుంటున్నా ఎప్పటికప్పుడు బి. పి.లెవెల్ చెక్ చేసుకుంటూనే ఉండాలి. దానితో పాటు ఆల్కహాల్ తీసుకోవడం, సిగరెట్లు కాల్చడం,ఆహారంలో సోడియం శాతం అధికమవ్వడం వల్ల కూడా హై బి.పి. కి గురి అయ్యే అవకాశాలున్నాయి. హై బి. పి. శరీరానికి జరిగే నష్టాలు హార్ట్ ఎటాక్, గుండెకు సంబంధిన వ్యాధులు. కిడ్నీ ఫెయిల్ అవ్వడం. కంటి చూపు తగ్గడం. పెరిఫెరల్ డిసీజ్ వచ్చే అవకాశాలు అధిమవ్వడం. లో బ్లడ్ పెజర్ కి గల కారణాలు డీ హైడ్రేషన్, డయేరియా, లేదా వాంతులు అయినప్పుడు శరీరంలో నీరు పూర్తిగా తగ్గినప్పుడు ఆ సమయంలో పేషెంట్ ఎప్పటికప్పుడు పండ్ల రసాలు లేదా ఏదో రూపంలో నీటిని అధికంగా తీసుకుంటూ ఉండాలి, అలా జరగనప్పుడు లో బి.పి. వస్తుంది. లో బి.పి. వల్ల శరీరానికి జరిగే నష్టాలు రక్తప్రసరణ తగ్గి గుండె బలహీనమవుతుంది. సిక్ సైనస్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఏవైనా ఇతర చికిత్సలకోసం వాడే మందులు విషమించే అవకాశాలు ఎక్కువ. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువ. ఆరోగ్యం వరం లాంటిది, అలాగని మన చేతుల్లో లేనిది కాదు, తీసుకునే ఆహారం పట్ల నిబద్ధత ఉండి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే చాలు, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
మెల్లకన్ను - చికిత్స Cross eye – Treatment మెల్లకన్ను అంటే తెలియని వారుండరు, కానీ మెల్లకన్నుకు గల కారణాలు , దానికి సంబంధించిన ఇబ్బందులు , చికిత్స గురించి తెలిసిన వారు మాత్రం చాలా అరుదు. రెండు కళ్ళు సరియైన క్రమంలో కాకుండా కాస్త అటూ ఇటూగా ఉండటాన్నే మెల్లకన్ను అంటారు. మెల్లకన్ను - కంటి చూపు మందగించే ప్రమాదం సాధారణంగా మన కళ్ళు ఒకేసారిగా ఒకే చోట ఫోకస్ చేస్తాయి, మెదడు కూడా అదే విధంగా సంకేతాలను సేకరిస్తుంది. కానీ మెల్లకన్ను ఉన్నవారిలో రెండు కళ్ళ అమరిక సరిగ్గా లేని కారణంగా దృష్టి రెండు చోట్ల పడుతుంటుంది.. ఈ క్రమంలో కొన్నాళ్ళకు మెదడు ఒక కన్ను స్సంకేతాలను స్వీకరించడం మానేస్తుంది . దాంతో మెల్లకన్ను ఉన్నవారు ఒక కంటి చూపును శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి చిన్నతనంలోనే , మెల్లకన్ను ఉందని గుర్తించిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. ఏడేళ్ళ వయసు లోపు ఉన్న పిల్లల్లో ఈ సమస్యను అవలీలగా పరిష్కరించగలుగుతున్నారు వైద్యులు. మెల్లకన్ను - చికిత్స ప్రారంభ దశలోనే చికిత్స మొదలు పెట్టినట్లయితే అకారణంగా ఒక కంటిచూపు మందగించకుండా కాపాడుకోగలుగుతాం.. కంటి చూపు సరిగ్గా ఉండి మెల్ల కన్ను ఉండటమే సమస్య అయితే సర్జరీ ద్వారా రెండు కళ్ళను సరియైన క్రమంలో అమర్చగలుగుతున్నారు వైద్యులు. కానీ సర్జరీ కంటే ముందుగా మందగించిన కంటి చూపు విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఈ ట్రీట్ మెంట్ లో భాగంగా వైద్యులు మొదట వీక్ అయిన కంటి చూపును దాని సామార్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తారు. అందుకు మెల్లకన్ను ఉన్నవారు కొన్ని రోజులు కళ్ళద్దాలు ధరించాల్సి ఉంటుంది, లేదా కంట్లో డ్రాప్స్ వేసుకోవాల్సి ఉంటుంది. తత్ఫలితంగా ఆరోగ్యంగా ఉన్న కన్ను మసకబారిపోవడం, లేదా ఎదురుగా ఉన్న కనిపించకపోవడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. తత్ఫలితంగా వీక్ గా ఉన్న కంటి పై భారం పెరిగి, కండరాలపై ఒత్తిడి అధికమై కంటి నరాలు పుంజుకోవడం మొదలుపెడతాయి. పిల్లలు ఈ రకం కళ్ళద్దాలు ధరించడానికి గానీ, లేదా డ్రాప్స్ వేసుకోవడానికి అంతగా మనస్కరించకనట్లయితే కంటికి ప్యాచ్ కూడా వేయించుకోవచ్చు. వీక్ గా ఉన్న కంటి చూపును మెరుగుపరచడానికి ఇది కూడా మంచి పద్ధతే. ఈ ట్రీట్ మెంట్ ఎన్నాళ్ళలో పూర్తవుతుందో చెప్పలేం, కొందరికి వారం రోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది. మరికొందరికి సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అందుకే పరిస్థితి ప్రారంభదశలో ఉన్నప్పుడే చికిత్స మొదలుపెడితే తొందరగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
గురక వల్ల గుండెకు పొంచి ఉన్న ప్రమాదం Snoring can cause Heart disease గురక వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు, గురక పెట్టే వారి సంగతి అటుంచితే ఆ గురక వాళ్ళ నిద్రాభంగమై ఇబ్బంది పడే వారి బాధ వర్ణనాతీతం. ఇప్పటి వరకు గురక సర్వసాధారణ విషయం, అంతే కాదు గురక పెడుతున్నారంటే ప్రశాంతంగా పడుకుంటున్నారనే అపోహ ఉండేది. అభివృద్ధి చెందిన వైద్య విజ్ఞానం గురకకు సంబంధించి ఎన్నో వాస్తవాలను కళ్ళ ముందు ఉంచుతోంది, గురక వల్ల గుండెకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తుంది.. గురక - కారణాలు గురక పెట్టడానికి అధిక బరువు కూడా ఒక కారణం కావచ్చు, లేదా కొండ నాలుక పొడుగ్గా ఉండటం, మెడ అతి సన్నగా ఉండటం లేదా ఏ కారణం చేతనైనా ముక్కు రంధ్రాలు మూసుకుపోయి నప్పుడు శ్వాస పీల్చడం కష్టమై నోటితో శ్వాస పీలుస్తుంటారు . ఈ క్రమంలో గొంతులో ఉండే సాఫ్ట్ పాలెట్ కణజాలం కదలికల వల్ల గురక వస్తుంది. మనం సాధారణంగా కూర్చున్నప్పుడో, నిలుచున్నప్పుడో, లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడో మన నోట్లో ఉండే నాలుక ఫ్లాట్ గా ఉండి కొండ నాలుక నిలువుగా ఉంటుంది. మనం ముక్కు ద్వారా గాలి పీల్చినప్పుడు గాలి ముక్కు రంద్రాల ద్వారా లోపలి వెళ్లి గొంతు ద్వారా ఊపిరి తిత్తుల్లోకి వెళుతుంది. కానీ పడుకున్నప్పుడు, ముఖ్యంగా గురక పెట్టేవారిలో కొండనాలుక గొంతులోని వెనుక భాగాన్ని కప్పేస్తుంది, అందువల్ల ఊపిరి పీల్చడం కష్టమైపోతుంది, కాబట్టి నోటితో గాలి పీల్చడం మొదలుపెడతారు. గురక - అనారోగ్యం ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే గురకపెట్టే వారందరికీ గురక వ్యాధి ఉన్నట్టు కాదు. అలాగని గురక పెట్టేవారందరికి ఆరోగ్య సమస్యలు రావు. గురక గురకలా ఉంటె సమస్యేం లేదు, అది ఇబ్బందికరంగా మారినప్పుడే సమస్యలు మొదలవుతాయి. గురకపెట్టే వారిని గమనిస్తే వారు మధ్య, మధ్యలో దగ్గుతుంటారు , నోటితో శ్వాస పీలుస్తూ ఇబ్బంది పడుతుంటారు.గురకను నిర్లక్ష్యం చేస్తే క్రమేణా వ్యాధి ముదిరి గాలి లోపలికి వెళ్ళే ప్రక్రియ పూర్తిగా నిలిచి పోతుంది. ఊపిరితిత్తుల్లోకి చేరాల్సిన ఆక్సిజన్ శాతం తగ్గి శరీరంలోని ముఖ్య అవయవాలకు ఆక్సిజన్ అందక గుండె ఎక్కువ సార్లు కొట్టుకోవడం మొదలుపెడుతుంది.. గురక వ్యాధి వున్నవారికి రక్తపోటు, మదుమేహం లాంటి వ్యాధులు ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, నిద్రలేమి, శరీరానికి సరిపడా పోషకాలు అందక ఆరోగ్యం క్షీణించి ప్రాణాంతక మయ్యే అవకాశాలు ఉన్నాయి. గురక నివారణ గురకను ఒక్కసారిగా నివారించడం కష్టమే, కానీ అదుపులో ఉంచుకోవడం సాధ్యమే. బరువు తగ్గడం, ఆల్కహాల్ తగ్గించడం, సిగరెట్లకు దూరంగా ఉండటం మొదటిదైతే, రాత్రి పడుకునేటప్పుడు వెల్లకిలా కాకుండా ఒక వైపుకు తిరిగి పడుకోండి, తద్వారా నోరు తెరుచుకునే అవకాశం తక్కువ కాబట్టి ముక్కు ద్వారా గాలి లోపలికి వెళ్లి గురక తగ్గుతుంది.
అస్తమా - నివారణ Asthma - Prevention గతంతో పోలిస్తే వైద్య రంగం చాలా పురోగతి సాధించింది. నిన్న మొన్నటి వరకు చికిత్సే లేదనుకున్న ఎన్నో వ్యాధులకు చికిత్స అందించగలుగుతున్నారు. కానీ అస్తమాకు మాత్రం ఇప్పటివరకు పర్మనెంట్ సొల్యుషన్ రాలేదు. అస్తమా ఏ వయసులో వారికైనా రావచ్చు, చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరికైనా అస్తమా బాధించవచ్చు.అస్తమా శ్వాస నాళాలకు సంబంధించిన వ్యాధి. అస్తమా సాధారణంగా ఎలర్జీవల్ల కలుగుతుంది. మనం పీల్చిన గాలి, లోపలికి వెళ్ళేప్పుడు ఎలర్జీవల్లగాని, ఒత్తిడివల్ల గాని బ్రాంకియోల్స్ లోపల పొర వాస్తుంది. మ్యూకస్ మెంబ్రేన్ ముడుచుకుపోతుంది. గాలి ప్రసరించే దారులు ముడుచుకుపోయి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. గురకవస్తుంటుంది. దగ్గు రావచ్చు. ఉన్నట్టుండి ఆయాసం మొదలై శ్వాస పీల్చలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు.వర్షాకాలం వచ్చిందంటే చాలు అస్తమా రోగులు వణికిపోతుంటారు. కాస్త చల్లటి గాలులు వీచినా, చల్లటి ఆహారపదార్థాలు తిన్నా, తాగినా శ్వాసలో ఇబ్బంది మొదలవుతుంది. అందుకే అస్తమా బాధితులు ఇబ్బంది ఎక్కువ కాకముందే తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : మన చుట్టూ వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి, వీలైతే ప్రతిరోజూ వాకింగ్ చేయాలి. కొవ్వు పదార్థాలను తినడం తగ్గించాలి. నూనెలో వేయించిన ఫాస్ట్ ఫుడ్స్, చేపలు, తదితరాలను స్వీకరించకపోవడం మంచిది. చల్లదనాన్నిచ్చే పుచ్చకాయ, బీరకాయ, ఖర్బూజా వంటివి తినకూడదు. ఫ్రిజ్ లో ఉంచిన వస్తువులు పెరుగు అసిడిక్ ఆమ్లం అధికంగా ఉన్న నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పళ్ళ రసాలను తీసుకోరాదు. ఇబ్బంది తగ్గే వరకు కారం, పులుపు తగ్గించడం మంచిది. ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమిలి తినాలి, వీలయితే ఆహారం కడుపు నిండా కాకుండా, కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి. పడుకోవడానికి కనీసం మూడు గంటలు ముందుగానే రాత్రి భోజనం తినేయడం మంచిది. మునగాకులో కఫం తొలగించే గుణాలు పుష్కలం, కాబట్టి మునగాకు బాగా తినాలి. అస్తమాకు చికిత్స లేదు , నివారణ ఒక్కటే మార్గం అస్తమాకు చికిత్స లేదు, అలాగని అస్తమాను నిర్లక్ష్యం చేస్తే క్రానిక్ ఎయిర్ వేస్ డిసీజ్ గా మారి ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఎప్పటికప్పుడు డాక్టర్ ని సంప్రదిస్తూ ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, పౌష్టికాహారం తింటూ, మన చుట్టూ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అస్తమా తీర్వ్రతరాన్ కాకముందే ఇంట్లోనే కొన్ని నియమాలు పాటించడం ద్వారా అస్తమాను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఇంట్లోనే అస్తమాకు ఉపశమనం తేనే తేనే అస్తమాకు మంచి ఉపశమనకారిగా పని చేస్తుంది. రెండు చుక్కల తేనే అస్తమా వ్యాధి గ్రస్తుల ముక్కులో పోసినట్లయితే , అస్తమా వ్యాధి గ్రస్తులు శ్వాస ఇబ్బందుల నుండి కాస్త కోలుకునే అవకాశముంది. అత్తిపండు తో ఉపశమనం అత్తిపండు అస్తమా రోగులకు మంచి ఔషధకారి. అత్తిపండును వేడి నీళ్ళలో బాగా కడిగి రాత్రంతా ఉంచి మరునాడు ఉదయం రోగులకు ఇస్తే అస్తమాతో పాటు దగ్గు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయ ఒక నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి భోజనంతో పాటు తీసుకోవాలి. ఉసిరికాయ 5 గ్రాముల ఉసిరికాయను ఒక టేబుల్ స్పూన్ తేనే తో కలిపి ప్రతి ఉదయం పరగడుపున సేవిస్తే మంచి టానిక్ లా పని చేస్తుంది. కాకర వేళ్ళతో అస్తమా ఉపశమనం కాకర వేళ్ళు అస్తమా వ్యాధిగ్రస్తులకు వరం. ఈ మందుకు వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉంది, ఒక టేబుల్ స్పూన్ నిండా కాకర వేళ్ళ ను పొడిచేసి తేనే లో లేదా తులసి రసంలో కలిపి రోజుకు ఒక పూట చొప్పున సేవిస్తే అస్తమా అస్తమా తగ్గుముఖం పడుతుంది. ములక్కాడ ఆకులతో ఉపశమనం 180ml నీళ్ళలో గుప్పిట నిండా ములకాడ ఆకులను ఉడకబెట్టి కాస్త ఉప్పు, మిరియాల పౌడర్, కాస్తంత నిమ్మరసం కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. అల్లం ఒక టీ స్పూన్ నిండా అల్లం రసం తీసుకుని ఒక కప్పు మెంతి డికాషన్ లో కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి అస్తమా ప్రారంభదశలో ఉన్న రోగులు రోజూ పది వెల్లుల్లి పాయల్ని తీసుకుని 30 ml పాలలో మరగబెట్టి రోజుకొకసారి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. వాము అర టీ స్పూన్ నిండా వాము గింజల్ని తీసుకుని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి రోజు రెండు పూటలా సేవిస్తే అస్తమాతో పాటు దగ్గుతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. దీనితోపాటు వాము గింజల్ని వేడినీళ్ళలో వేసి అస్తమాతో బాధపడేవారికి ఆవిరి పడితే రిలీఫ్ గా ఉంటుంది. కుంకుమ పువ్వు 5 గ్రాముల కుంకుమ పువ్వును ఒక టేబుల్ స్పూన్ నిండా తేనేలో కలిపి రోజుకు ఒకసారి సేవించినట్లయితే మంచి ఔషధకారిగా పని చేస్తుంది. ఉపవాసం , ఎక్సర్ సైజు వారానికొకసారైనా ఉపవాసం చేయడం, ఎక్సర్ సైజు చేయడం మంచిది. యోగాఎక్స్ పర్ట్ ను సంప్రదించి శ్వాసకు సంబంధించిన ఆసనాలు వేస్తే ఉపశమనం కలుగుతుంది.
తలనొప్పి తగ్గడానికి 10 చిట్కాలు Home Remedies for Headache తలనొప్పికి కారణాలేవైనా కావచ్చు, దాని ఎఫెక్ట్ మాత్రం మామూలుగా ఉండదు. అందుకే మనలో చాలామంది తలనొప్పి లక్షణాలు కనబడగానే తొందరపడి ఇష్టం వచ్చిన టాబ్లెట్ లు వేసుకుంటుంటారు, అవి తాత్కాలింగా ఉపశమనం కలిగించినా ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్ లు కూడా కలిగిస్తాయి. తరచూ తలనొప్పి వస్తుంటే డాక్టర్ ని సంప్రదించడం అన్నిరకాలుగా శ్రేయస్కరం. దానికన్నా ముందు టాబ్లెట్ లకు బదులు తలనొప్పి తగ్గడానికి కొన్ని అనువైన చిట్కాలు. తల నొప్పి తగ్గడానికి 10 చిట్కాలు : ఒక్కోసారి విపరీతమైన తలనొప్పికి డీ హైడ్రేషన్ కూడా కారణమవ్వచ్చు. అందుకని ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్ళు తాగండి. అంతే తలనొప్పి తగ్గుముఖం పట్టడం మీరు గమనిస్తారు. తల మసాజ్ : మీకు మసాజ్ గురించి తెలిసే ఉంటుంది. రాకరకాల స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందాలన్నా, టెన్షన్ నుండి రిలాక్స్ అవ్వాలన్నా మసాజ్ చక్కటి పధ్ధతి. తలనొప్పికి పని ఒత్తిడి కూడా కారణం. కాబట్టి తల , మెడ మసాజ్ చేస్తే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. ఆరోమా థెరపీ: ఆరోమా థెరపి అన్ని రకాల శ్రేయస్కరం. చందనం, మిరియాలు, యూకలిప్టస్, లావెండర్ మరియు రకరకాల ఔషధాలతో తయారైనది. తలనొప్పి దూరం చేయడానికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. వేడి నీళ్ళతో తల స్నానం : తల నొప్పి ఎక్కువగా ఉంటే గోరువెచ్చటి నీటితో తల స్నానం చేసేయండి. తలనొప్పిని చేతితో తీసిపడేసినట్టుగా, రిలాక్స్ గా ఫీలవుతారు. ఐస్ ప్యాక్ : తలనొప్పి తగ్గడానికి ఐస్ ప్యాక్ కూడా ఉపకరిస్తుంది. ఒక శుభ్రమైన టవల్ లో చల్లగా ఉండే ఏదైనా వస్తువును చుట్టి మీకు ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ కాసేపు పెట్టుకుంటే సరి. నొప్పి మాయమవుతుంది. . ప్రెజర్ పాయింట్స్ ని నొక్కి ఉంచడం : మన అరచేతిలో ముఖ్యంగా మన చూపుడు వేలుకు, బొటన వేలుకు మధ్య ఉండే ప్రదేశంలో కరెక్టుగా ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. వాటిని 2, 3 నిమిషాల పాటు నొక్కి ఉంచినట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది. రిలాక్స్ అవ్వడం : తలనొప్పి చిరాకు తెప్పిస్తుందనుకుంటే కాసేపు అన్ని పనులను పక్కన పెట్టేసి రిలాక్స్ అవ్వడం మేలు. దీనివల్ల అలసట తగ్గి తలనొప్పి హుష్కాకి అయిపోతుంది. డైట్ : ఒక్కోసారి మనం తీసుకునే ఆహారం కూడా మన తలనొప్పికి కారణమవ్వచ్చు. కాబట్టి మీ ఆహార పద్ధతులను మార్చేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. కాల్షియం సప్లిమెంట్ : కాల్షియం సప్లిమెంట్ వల్ల రక్తప్రసరణ జరిగి మీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఒక గ్లాసు నిండా ఆరెంజ్ జ్యూస్ తాగడం లేదా మెగ్నీషియం, కాల్షియం ఉండే సప్లిమెంట్ తీసుకున్నా తలనొప్పి నుండి రిలీఫ్ ని ఇస్తుంది. ఎక్సర్ సైజు : సాధారణ తలనొప్పి ఉన్నవాళ్ళకు ఇది మంచి చిట్కా, అనువైన ఎక్సర్ సైజు ను ఎంచుకుని చేయడం మంచిది. తద్వారా శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి తలనొప్పి తగ్గే అవకాశాలు ఉన్నాయి.
పక్షవాతం కారణాలు - చికిత్స పక్షవాతం అనేది నాడీ వ్యవస్థకు చెందిన వ్యాధి. శరీరంలోని అవయవాలు ప్రయత్న పూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను పక్షవాతము అంటారు. పక్షవాతానికి ముఖ్యమైన కారణాలు అధిక రక్తపోటు, మెదడులో రక్త సరఫరాలో అంతరాయం, పోలియో వంటి వైరస్ సంబంధిత రోగాలు, లేదా ఇతరత్రా ప్రమాదాలు. పక్షవాతం వచ్చిన రోగి ఆరోగ్యం ఈ క్రింది విధంగా క్షీణిస్తుంది. పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకనుకు 32 వేల నాడీ కణాలు చనిపోతాయి. ఆ లెక్కన నిమిషానికి 19 లక్షల నాడీ కణాలు చనిపోతాయి. నాడీకణాలు, న్యూరాన్ల మధ్య జరిగే 14 వందల భావ ప్రసారాలు నిలిచిపోతాయి. ఫలితంగా మైలినేటెడ్ ఫైబర్స్ ద్వారా 7.5 మైళ్ల దూరం ప్రయాణించాల్సిన ఆలోచనలను మెదడు నష్టపోతుంది. మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో రక్తపు గడ్డలు అడ్డుపడి, మెదడుకు రక్త ప్రసారం ఆగిపోతుంది. నాడీకణాలు మరణించే సంఖ్యపైనే పక్షవాతంతో బాధపడే రోగి జీవితకాలం ఆధారపడి ఉంటుంది. అందుకే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. శరీరంలోకి ఒక వైపు భాగాలు పని చేయకపోవడం, మూతి వంకర అవ్వడం, సరిగా మాట రాకపోవడం, స్పృహ తప్పడం, విపరీతమైన తలనొప్పి, చూపు తగ్గడం పక్షవాతానికి దారి తీస్తున్న పరిస్థితులుగా పరిగణించాలి. పక్షవాతం సోకిన వారికి ఇప్పటి వరకు మెడికల్ లైన్ ట్రీట్‌మెంట్ ద్వారా చికిత్స చేస్తున్నారు. ఈ విధానంలో శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా మందులతో చికిత్సచేస్తారు. అయితే ఇటీవల ఫిజియోథెరఫి అనే పద్దతి విస్త్రృతంగా వాడుకలోకి వచ్చింది. పక్షవాతం సోకిన వారికి ఫిజియోథెరపీ ఒక వరం. ఫిజియోథెరపీలో రోగికి మందులు అందిస్తూనే శారీరకంగా, మనసికంగా చికిత్స అందిస్తారు. పక్షవాతంతో బలహీనపడ్డ శరీర కండరాలను నయం చేస్తూ రోగిని పూర్వస్థితికి తెస్తారు. రోగి కూర్చునే , పడుకునే, నిలబడే, నడిచేవిధానాలు, మెట్లు ఎక్కడం, దిగడం క్రమ పద్దతిలో చేయించడంతో శరీరాన్ని బలపరుస్తారు. 0-1 గ్రేడ్ కోసం బలహీనమైన కండరాలకు విద్యుత్తుతో మజిల్ స్టిమ్‌లేటర్ చికిత్స చేస్తారు. ఆపై 1-5వరకు సస్పెన్షన్ థెరఫీ, ఇన్‌క్లెయిన్‌బోర్డు, వేయిట్ బేరింగ్, క్వార్టర్ సైడ్ చేయిల్, ఫోల్డర్, పుల్లీవాల్ ల్యాపర్, స్టెఫ్ ఆఫ్ స్టెఫ్‌డౌన్, కాడ్‌మాన్, సైక్టింగ్ ఎక్సైర్‌సైజ్‌లతో కండరాన్ని, బలపరుస్తారు. అనంతరం సరైన నడకను నేర్పించడానికి ప్యారలాల్ ఎక్సర్‌సైజ్ చేయిస్తారు. దీంతో పక్షవాతం సోకిన రోగి త్వరగా కోలుకునే అంశాలుంటాయి. మందులు, ఫిజియోథెరపీ తో పాటు పక్షవాతం సోకిన రోగికి మానసికంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా, చూస్తుండాలి. చాలాసేపటి వరకు ఒంటరిగా ఉండనివ్వకుండా ఎవరో ఒకరు రోగితో మాట్లాడుతూ ఉండాలి. మీ ఫ్యామిలీ లో జరగబోయే శుభకార్యాల గురించి మాట్లాడాలి, వారి అభిప్రాయాన్ని అడుగుతుండాలి. వారి ఎదురుగా కూర్చుని న్యూస్ పేపర్ చదవడం, కలిసి టి.వి. చూడటం లాంటివి చేస్తుండాలి. దీంతో పేషెంట్ కి మనశ్శాంతి కలిగి మానసిక ఒత్తిడి నుండి బయటపడగలడు. ఎప్పటికప్పుడు తన శరీరంలో వచ్చే మార్పుల్ని, కుదుటపడుతున్న తన ఆరోగ్య పరిస్థితిని గురించి అతనికి తెలియజేస్తూ ఉండాలి. త్వరలో కోలుకుంటారన్న విశ్వాసాన్ని కలిగించాలి.
లంగ్ క్యాన్సర్ - జాగ్రత్తలు లంగ్ క్యాన్సర్ అనేది క్యాన్సర్ వలన చనిపోయే కారణాలలో ప్రముఖమైనది. ఏ క్యాన్సర్ అయినా ముందుగా సూక్ష్మ పరిమాణంలోనే మొదలవుతుంది. అది పెరిగి పెరిగి నిర్దిష్టమైన పరిమాణానికి చేరే వరకు గుర్తించడం కష్టమే. ఎందుకంటే మనం చేసే పరీక్షలన్నీ క్యాన్సర్ కణితి పరిమాణాన్ని బట్టి గుర్తించేవిగా ఉంటాయి. నాలుగు దశలు.. లంగ్ క్యాన్సర్‌ను నాలుగు దశలుగా విభజించారు. రెండో దశ కంటే ముందుగానే మనం దీన్ని కనుక్కోగలిగితే నయం చేయగలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రెండో దశ క్యాన్సర్లన్నింటినీ నయం చేయగలిగే మందులు కనుగొనే అవకాశం లేదు. సాధారణంగా లంగ్ క్యాన్సర్‌ను ముందుగా కనుక్కోవడానికి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. అవి.. ఛాతీ ఎక్స్‌రే, కళ్ళె సైటాలజీ, స్పైరల్ కంప్యూటర్ టోమోగ్రఫీ. ఈ పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను కనుక్కోగలిగే శాతం ఎంత? దాని వలన కలిగే ఉపయోగాలు ఇక్కడ ముఖ్యం కాదు. అసలు లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. "రేడాన్ అనేది రాళ్ళలోను, మట్టిలోను యురేనియం విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడుతుంది. ఈ రేడాన్ గ్యాస్ మోతాదు ఇళ్ళలోను, ఇతర భవనాలలో అధికంగా ఉండి, ఆ గ్యాస్‌ను పీల్చడం వలన లంగ్ క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా సెల్లార్‌లలో, అండర్‌గ్రౌండ్ బిల్డింగ్‌లలో దీని మోతాదు ఎక్కువ..'' రాకుండా ఉండాలంటే.. లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే రిస్క్ ఫ్యాక్టర్స్‌కు ఆమడ దూరంలో ఉండాలి. ధూమపానం, సెకండ్‌హ్యాండ్ స్మోక్, పర్యావరణానికి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్ల నుంచి రక్షణ పొందాలి. ఆల్కహాల్‌ను సేవించకూడదు. పర్యావరణ రిస్క్‌ఫ్యాక్టర్లు : రేడాన్ ఎక్స్‌పోజర్ - రేడాన్ అనేది రాళ్ళలోను, మట్టిలోను యురేనియం విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడుతుంది. ఈ రేడాన్ గ్యాస్ మోతాదు ఇళ్ళలోను, ఇతర భవనాలలో అధికంగా ఉండి, ఆ గ్యాస్‌ను పీల్చడం వలన లంగ్ క్యాన్సర్ వస్తుంది. ముఖ్యంగా సెల్లార్‌లలో, అండర్‌గ్రౌండ్ బిల్డింగ్‌లలో దీని మోతాదు ఎక్కువగా ఉంటుంది. గాలి కాలుష్యం : గాలి కాలుష్యానికి లంగ్ క్యాన్సర్‌కు చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాలలో నివసించే వారికి ఈ రకం క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.ఇక, ఇతర పర్యావరణ కారకాలలో.. ఆస్‌బెస్టాస్, ఆర్సెనిక్, క్రోమియం, నికెల్, తారు, తారు పొగ వంటివి ఉంటాయి. వీటన్నింటికీ సాధ్యమైనంత దూరంగా ఉండడం వల్ల లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. ఆల్కహాల్, ధూమపానం : ఆల్కహాల్ పుచ్చుకోవడం, ధూమపానం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలనుకున్న వారు ధూమపానం, మద్యపానం వంటివి చేయకూడదు. ఈ అలవాట్లు ఉన్న వారు తక్షణం మానివేయాలి. ధూమపానం నుంచి బయటపడడానికి పల్మనాలజిస్ట్ ఇచ్చే కౌన్సెలింగ్, మందులు ఉపయోగపడతాయి. పోషకాహారం కూడా.. క్యాన్సర్ నిరోధంలో పోషకాహారం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కొంతమంది విటమిన్-ఇ తీసుకుంటే లంగ్ క్యాన్సర్ రాదు అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. అంతేకాదు, ధూమపానం చేసే వారు కెరోటినాయిడ్స్ ఎక్కువగా తీసుకుంటే లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సంపూర్ణ ఆరోగ్యానికి జీడిపప్పు ప్రతి ఒక్కరు తమ మెనూలో ఉండేలా చూసుకోవాల్సిన ఆహారం జీడిపప్పు. జీడిపప్పును కంప్లీట్ ఫుడ్ ప్యాక్‌గా చెప్పుకోవచ్చు. అనేక పోషకవిలువలు జీడిపప్పులో ఉన్నాయి. ఫైబర్, విటమిన్స్, మినరల్స్, క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడే ఫైటో కెమికల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రోజు జీడిపప్పు తినే వారిలో మంచి కొలెస్టరాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. కొలెస్టరాల్, గుండెజబ్బులు: జీడిపప్పులో గుండెకు రక్షణనిచ్చే మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇందులోని ౖఔఉఐఇ, ్కఅఔకఐఖీౖఔఉఐఇ అఇఐఈఖి బ్యాడ్ కొలెస్టరాల్‌ను(ఔఈఔ) తగ్గించడంలోనూ, మంచి కొలెస్టరాల్‌ను(ఏఈఔ) పెంచడంలోనూ ఉపయోగపడతాయి. మెడిటేరియన్ డైట్‌లో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండి గుండెజబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధనల్లోసైతం వెల్లడయింది. మినరల్స్ డెఫిషియెన్సీ: జీడిపప్పులో మాంగనీస్, పోటాషియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం వంటి మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు జీడిపప్పు తీసుకోవడం వల్ల మినరల్ డెఫిషియెన్సీ రాకుండా చూసుకోవచ్చు. యాంటీ అక్సిడెంట్: సెలీనియం చాలా ముఖ్యమైన పోషకపదార్థం. ఇది గ్లూటాథయోన్ పెరాక్సిడేసెస్ వంటి యాంటీఅక్సిడెంట్ ఎంజైమ్స్‌కి కో-ప్యాక్టర్‌గా పనిచేస్తుంది. ఈ ఎంజైమ్ శరీరంలో అత్యంత శక్తివంతమైన యాంటీ అక్సిడెంట్‌లలో ఒకటి. కాపర్ కూడా సైటోక్రోమ్ సి-అక్సిడేస్, సూపర్అక్సైడ్ డిస్‌మ్యూటేస్ వంటి ప్రాణాధార ఎంజైమ్‌లకి కో-ఫ్యాక్టర్‌గా పనిచేస్తుంది. జింక్ చాలా ఎంజైమ్‌లకి కో-ఫ్యాక్టర్‌గా పనిచేస్తుంది. పెరుగుదల, జీర్ణక్రియ వంటి పనులు సక్రమంగా జరగడానికి సహాయపడుతుంది. స్పెర్మటోజెనెసిస్: ప్రతిరోజు పది జీడిపప్పు పలుకులు తింటే వీర్యకణాల ఉత్పత్తి పెరుగుతుంది. స్పెర్మ్‌కౌంట్ తక్కువగా ఉన్నవారికి జీడిపప్పు మంచి ఆహారం. ఒకనెలరోజుల పాటు జీడిపప్పు తీసుకుని ఆ తరువాత సెమన్ అనాలసిస్ చేయించుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. సంతానలేమితో బాధపడే వారికి జీడిపప్పు తప్పక తీసుకోవాలి. విటమిన్ల మిశ్రమం: జీడిపప్పులో పాంటోథెనిక్ యాసిడ్(విటమిన్-బి5), పిరిడాక్సిన్(విటమిన్-బి6), రైబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ విటమిన్లు శరీరానికి చాలా అవసరం. కళ్ల సమస్యలు: జీడిపప్పులో అనేక ముఖ్యమైన ఫ్లేవనాయిడ్ యాంటీఅక్సిడెంట్ ఉంటుంది. ఇది వయస్సు పెరిగిన కొద్దీ వచ్చే కళ్ల సమస్యల నుంచి రక్షిస్తుంది.
కీళ్ళ నొప్పుల్లో రకాలు - చికిత్స అరవై ఏళ్లొచ్చినా అడుగులు తడబడేవి కాదు ఒకప్పుడు. ఇప్పుడేమో 40 ఏళ్లకే కొందరు మోకాళ్లకో బెల్టు వేసుకుని నడిచే పరిస్థితి వచ్చేసింది. ఏమిటీ కారణం అంటే రకరకాల కీళ్ల వ్యాధుల జాబితా ఒకటి మన ముందు వచ్చి వాలిపోతుంది. కీళ్ల వ్యాధులు (ఆర్థరైటిస్) రెండు వందల రకాలు అంటే మనకు ఆశ్చర్యం వేయవచ్చు. కానీ, అది నిజం. వీటిలో పసి పిల్లల్లో వచ్చే వాటిని జెఆర్ ఆర్థరైటిస్ అంటారు. మిగతా సమస్యలను ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు. ఇవి వయసుతో నిమిత్తం లేకుండా వస్తాయి. పెద్దవాళ్లలో వచ్చే కీళ్ల వ్యాధుల్లో ఆస్టియో ఆర్థరైటిస్, ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ రెండు భాగాలుగా విభజిస్తారు. ఆస్టియో ఆర్థరైటిస్: ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య శరీరంలోని ఏ కీళ్లలోనైనా రావచ్చు. మోకాళ్ల నొప్పులు వాటిలో ఒకరకం మాత్రమే. కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి( కార్టిలేజ్) అరగడం వల్ల వచ్చే సమస్య ఇది. వయసు పైబడటంతో పాటు విపరీత శ్రమ, స్థూలకాయంతో పాటు ప్రమాదాల కారణంగా కూడా ఈ సమస్య రావచ్చు. వాస్తవానికి కార్టిలేజ్ ఉత్పత్తి చేసే ప్రక్రియ ఎముకల్లో నిరంతరం సాగుతూనే ఉంటుంది. అయితే వయసు పైబడే కొద్దీ ఈ ఉత్పత్తి తగ్గిపోయి అరుగుదల ఎక్కువవుతుంది. అందుకే వృద్ధులే ఈ సమస్యకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్: ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధి నిరోధక శక్తిలో ఏర్పడే లోపాలే (ఇమ్యూన్ ఇంబాలెన్స్) ఇందుకు కారణం. సాధారణంగా కాలి బొటన వేళ్లల్లో మొదలయ్యే ఈ వ్యాధి కాళ్లూ చేతుల అన్ని వేళ్లకూ పాకుతుంది. భరించలేని నొప్పితో పాటు ఒక్కోసారి పూర్తిగా కదల్లేని స్థితి కూడా ఏర్పడవచ్చు. అల్లోపతి వైద్య విధానంలో పెయిన్ కిల్లర్లు, డిసీజ్ మోడి ఫయింగ్ డ్రగ్స్, స్టీరాయిడ్స్, బయలాజిక్ థెరపీల ద్వారా ఈ వ్యాధికి చికిత్స చేస్తారు. రుమాటిక్ ఫీవర్ చిన్న పిల్లల్లో కొందరికి ఈ సమస్య వస్తుంది. దీనికి స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా కారణం. నొప్పి ఒక కీలునుంచి మరో కీలుకు అలా మారుతూ ఉంటుంది. సకాలంలో చికిత్సలు అందకపోతే వ్యాధి ముదిరి చివరికి గుండె కవాటాలు దెబ్బ తినే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే వ్యాధి సోకగానే వైద్య నిపుణులను సంప్రదించడం చాలా అవసరం. సమస్య తీవ్రమైనదే అయినా మూడు వారాలకు ఒకసారి చొప్పున పెన్సిలిన్ ఇవ్వడం ద్వారా అల్లోపతి వైద్యులు ఈ వ్యాధిని నయం చేస్తారు. చికిత్స: ఆయుర్వేదంలో ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యకు ఆయుర్వేదం కొన్ని గృహ చికిత్సలు, కొన్ని వైద్య చికిత్సలూ చెబుతుంది. ఆ శాస్త్రం చెప్పే గృహ చికి త్సల ప్రకారం: - వెల్లుల్లి ముద్దను రెండు చెంచాల పరిమాణంలో తీసుకుని నువ్వుల నూనెతో కలిపి రోజుకు రెండు సార్లు వేడినీళ్లతో తీసుకోవాలి. - అరకప్పు శొంఠి కషాయానికి, రెండు చెంచాల ఆముదం కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. అరచెంచా శొంఠి, ఒక చెంచా నువ్వులు, అరచెంచా బెల్లం ఈ మూడింటినీ ముద్దగా నూరి రోజూ రెండు పూటలా తీసుకోవాలి. - వీటిలో ఏదో ఒకటి చేస్తూ మహా నారాయణ తైలాన్ని కీళ్ల మీద పైపూతగా రాస్తే ఉపశమనం లభిస్తుంది. హోమియోలో... ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యకు హోమియో నిపుణుల సూచన ప్రకారం: బ్రయోనియా-6, లేదా రస్టాక్స్-6 మందులను సూచిస్తారు. రెండు రోజులకు ఒకసారి చొప్పున చాలా కాలమే వాడాలి. మోకాళ్ల నొప్పులు మరీ ఎక్కువగా ఉన్న వారు హైమోసాక్ ద్రవాన్ని ఉదయం 20 చుక్కలు, రాత్రి 20 చుక్కల చొప్పున నీటితో కలిపి తీసుకోవాలి. కీ ళ్ల నొప్పులతో పాటు మధుమేహం ఉన్నవారికి ఏదో ఒకటిగా ల్యాక్టిక్ యాసిడ్-30, యురేనియం నైట్-30 మందులు బాగా పనిచేస్తాయి. ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వారు మెర్క్‌సాల్-6, రస్టాక్స్-6 మందుల్లో ఏవో ఒకటి తీసుకోవచ్చు. వీటిని రోజుకు మూడు సార్ల చొప్పున రెండు రోజులకు ఒకసారి తీసుకోవచ్చు. వ్యాయామాలు: కీళ్ల నొప్పులకు మందులతో పాటు వ్యాయామాలు కూడా తప్పనిసరి. అయితే కాళ్ల మీద ఎక్కువ భారం పడని వ్యాయామాలు మరింత శ్రేయస్కరం. వాటిలో సైకిల్ తొక్కడం, ఈత ఉత్తమం. లేదా నేల మీద వెల్లకిలా పడుకుని రెండు కాళ్లూ పైకి ఎత్తి ఒకదాని తరువాత ఒకటిగా రెండు కాళ్లనూ సైకిల్ తొక్కినట్లు గుండ్రంగా తిప్పడం ఎంతో మేలు.
మొటిమల నివారణ కొందరికి ముఖాన మొటిమలు పెద్ద సమస్యగా పరిణమిస్తున్నాయి. చర్మం ఆయిలీగా ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువ. మొన్నమొన్నటిదాకా మొటిమల నివారణ అంత తేలిక కాదు అనుకునేవారు. ఇప్పుడలా కాదు. మొటిమలను తగ్గించుకునేందుకు ఎన్నో మందులొచ్చాయి. కనుక మొటిమలు పొడ చూపగానే డెర్మిటాలజిస్టును కలవాలి. వారి వారి తత్వాలను బట్టి వివిధ చికిత్సలు ఉంటాయి. మొటిమలు ముఖంమీదే కాదు, వీపు భాగాన, ఉదార భాగాన కూడా వస్తాయి. ఇవి నొప్పిని, జిలనీ కలిగిస్తాయి. దాంతో చాలామంది మొటిమలను గిల్లుతూ, గోకుతూ ఉంటారు. అలా చేయడం ఎంతమాత్రం మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. గిల్లడంవల్ల నొప్పి తగ్గకపోగా, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. సాధారణంగా మొటిమలకు బెంజాయిల్ పెరాక్సాయిడ్, సాలిసైలిక్ యాసిడ్, ట్రేక్లోసన్ లాంటి యాంటీ బాక్టీరియల్ మందులతో చికిత్స చేస్తారు. ఈ మందులు క్రీములు లేదా జెల్ రూపంలో దొరుకుతాయి. ఇవి బాక్టీరియాను వెంటనే తొలగించి, మొటిమలను మాన్పుతాయి. చర్మాన్ని మృదువుగా కూడా మారుస్తాయి. విటమిన్-౩ తో కూడిన నికోటినమైడ్ లాంటి మందులు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నూ కలిగించవు. మనం కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మొటిమలను నివారించుకోవచ్చు. చర్మాన్ని నిరంతరం సంరక్షించుకోవాలి. మొటిమలను అశ్రద్ధ చేయకుండా డాక్టర్ కు చూపించి చికిత్స చేయించుకోవాలి. ఒక్క మొటిమ చాలు మన సంతోషాన్ని ధ్వంసం చేయడానికి. నొప్పేగా ఉండటమే కాకుండా అంద విహీనతకు కారణమౌతుంది. ఏ పార్టీకో, ఫన్క్షన్ కో వెళ్ళాల్సివచ్చినప్పుడు ముక్కుమీదో, బుగ్గమీద మొటిమలు ఉన్నాయనుకోండి మహా వెలితిగా ఉంటుంది. కొంత శ్రమ, కాస్త శ్రద్ధ ఉంటే మొటిమలను నివారించుకోవడం ఏమంత కష్టం కాదు. మన శరీరంలో కళ్ళు, చెవులు, గుండె, ఊపిరితిత్తులు లాంటి అవయవాలతోబాటు చర్మం కూడా చాలా ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. మొత్తం శరీరాన్ని అంతా కప్పి ఉంచేది చర్మమే కదా. కనుక చర్మాన్ని కాపాడుకుంటే మొటిమలు రావు. వచ్చినా తగ్గిపోతాయి. మందుల సంగతి అలా ఉంచి ఈ కింది జాగ్రత్తలు పాటించినట్లయితే మొటిమలు తగ్గుతాయి. పుదీనా ఆకులను ముఖాన పరచి ఉంచి పావుగంట తర్వాత తీసి చల్లటి నీళ్ళతో ముఖాన్ని కడుక్కోవాలి. ఆకులను రుద్దనవసరం లేదు. అలా చేస్తే మొటిమలు మరింత నొప్పిచేస్తాయి. సొంటి, లవంగాలు నీటితో నూరి లేపనం తయారు చేసి రాస్తూ ఉంటే మొటిమలు తగ్గుతాయి. ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది. చర్మం పొడిగా, సున్నితంగా ఉంటే ఈ ప్యాక్ వేసుకోకూడదు. జాజికాయను నీటితో అరగదీసి ఆ లేపనాన్ని ముఖానికి రాస్తే మొటిమలు తగ్గుతాయి. వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి. నీరుల్లి గడ్డను సగానికి కోసి ఆ ముక్కను మొటిమలపై రుద్దుతూ వుంటే తగ్గుతాయ్. . మొటిమ గనక చితికినట్లయితే దానిమీద ఐస్ క్యూబ్ ఉంచి సుతిమెత్తగా రుద్దినట్లయితే అందులో ఉన రాసి అంతా వచ్చేస్తుంది. బియ్యం కడిగిన నీటిని మొటిమల పైన మృదువుగా రుద్దితే తగ్గుతాయి. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. కస్తూరి పసుపును నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే మొటిమలు తగ్గుతాయి. చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు.