పాత బ్లౌజులకు ఈ డిజైన్ ఇచ్చి చూడండి..  కొత్త ట్రెండ్ సెట్ చేస్తాయ్..!

దాదాపు ప్రతి భారతీయ మహిళ చీర కట్టుకోవడానికి ఇష్టపడుతుంది. ఈ రోజుల్లో ఫ్యాషన్ ట్రెండ్ మారుతున్న కొద్దీ కాలేజీకి వెళ్ళే అమ్మాయిలలో కూడా చీర కట్టుకోవడం అనేది చాలా ఇష్టంగా మారుతోంది. నిజానికి నేటి యువతులకు చీర కట్టుకోవడం   ప్రజాదరణ పొందిన ఎథ్నిక్ వేర్‌ అని చెప్పవచ్చు. ఈ ట్రెండ్ కు తగ్గట్టే చీరలు డిజైన్ చేయడం, వాటికి తగిన బ్రౌజులు డిజైన్ చేయించుకోవడం జరుగుతుంది.  అయితే  చీర ఎంత అందంగా ఉన్నా దాని అందాన్ని పెంచేది బ్లౌజ్ మాత్రమే. అయితే పాత చీరలు కొన్ని అందంగా ఉన్నా వాటి బ్లౌజులు మాత్రం అంత అట్రాక్షన్ గా ఉండవు. అలాంటి వారి కోసం సూపర్ టెక్నిక్ ఇది. పాత బ్రౌజులను కొత్తగా ట్రెండీగా మార్చే ఆ పద్దతి గురించి తెలుసుకుంటే..

బ్రౌజ్ లకు స్లీవ్స్..

ఈ రోజుల్లో వివిధ రకాల బ్లౌజ్ డిజైన్లు  ప్రాచుర్యం పొందుతున్నాయి. చాలా మంది మహిళలు తమ పాత బ్లౌజ్‌లకు కొన్ని మార్పులు చేయడం ద్వారా వాటిని మళ్లీ కొత్తగా ధరించడానికి ఏదో ఒక ప్రయోగం చేస్తుంటాారు. చాలా మంది   నెక్  లేదా స్లీవ్‌లకు కొన్ని మార్పులు చేయడం ద్వారా  పాత బ్లౌజ్‌లను ధరించడానికి ఇష్టపడతారు. అలా పాత బ్లౌజ్ లను మళ్లీ కొత్తగా మార్చే సూపర్ టిప్ ఇది.

ముత్యాల డిజైన్..

ముత్యాల డిజైన్లతో ఉన్న బ్లౌజ్‌లకు చాలా డిమాండ్ ఉంది. ఈ  డిజైన్‌లు  యువరాణి లుక్‌ని ఇస్తాయి. ఈ డిజైన్‌లు చాలా మంది కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు కూడా భలే నప్పుతాయి.

బెలూన్ పఫ్ స్లీవ్స్..

 బెలూన్ పఫ్ స్లీవ్ డిజైన్లతో కూడిన బ్లౌజ్‌లు బాగా ఆదరణ పొందాయి.  అలాంటి స్లీవ్‌లతో కూడిన బ్లౌజ్‌లను లైట్ వెయిట్ చీరలతో జత చేయవచ్చు. అయితే అలాంటి బ్లౌజ్‌లను హెవీ వర్క్ చీరలతో జత చేయకూడదు. లేకుంటే అది  లుక్‌ను పాడు చేస్తుంది.

రఫుల్ స్లీవ్స్..

రఫుల్ స్లీవ్స్ ఉన్న బ్లౌజ్  చాలా ఏళ్ళ క్రితమే  వార్తల్లో నిలిచింది. చాలా మంది మహిళలకు ఇలాంటి డిజైన్లు ఉన్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా..  రఫుల్ స్లీవ్స్‌ బ్లౌజ్ ను  స్కర్ట్ లేదా లెహంగాతో జత చేయవచ్చు. ఇది చాలా మంచి లుక్ ఇస్తుంది.

                     *రూపశ్రీ.