సైడ్ పోనీ స్టైలే వేరబ్బా
పోనీ ... జుట్టుని క్లిప్పుతో బంధించి అలా కిందకి వాలుగా వదిలేసే స్టైల్ ఎవర్ గ్రీన్. పైన పెట్టె క్లిప్పులు వెరైటీలని మారుస్తూ "పోనీ" అందాన్ని పెంచేస్తారు అమ్మాయిలు. ఇకప్పుడు హై-పోనీ ట్రెండ్ లో వుంటే, మరోసారి లో-పోనీ ట్రెండ్ లో నిలిచింది. ఆ రెండింటిని ఇప్పుడు పక్కకు తోసేసి సైడ్ పోనీ అమ్మాయిల మనసు గెలుచుకుంది. ఈ మధ్యకాలంలో కాస్త పొడవు జుట్టు వున్న అమ్మాయిలందరూ ఈ సైడ్ పోనీనే ప్రిఫర్ చేస్తున్నారు. ఓ పక్కకు జుట్టుంతటిని తీసి ఓ అందమైన క్లిప్పు తగిలిస్తే సరి పార్టీకి రెడీ అయినట్టే. లేదా ఓ పక్కగా దువ్వి జడవేసినా ఫ్యాషనే. మధ్య జడ కాస్త పక్కకి చేరిందన్నమాట. సైడ్ పోనీలో కూడా బోల్డన్ని వెరైటీలు. కాస్త టేస్ట్ వుండాలే కాని వెరైటీలకేం తక్కువ చెప్పండి. చూడ్డానికి క్లాసీగా వుండే ఈ హెయిర్ స్టైలే ఇప్పటి అమ్మాయిలకి తెగ నచ్చేసింది.ట్రెండీగా వుండాలంటే మీరు ఓ పక్కకి జడ వేయటం మొదలు పెట్టండి ఇక.
- రమ