అందరిలో సూపర్ గా కనిపించాలంటే... మేకప్, మంచి దుస్తులే కాదు మన వెంట ఎప్పడు ఉండే బ్యాగులు కూడా అందంగా, లేటెస్ట్ ఫ్యాషన్ కి తగ్గట్లుగా ఉండాలి. అయితే వాటిని ఎంచుకొనే ముందు కేవలం ఫ్యాషన్‌‌ను మాత్రమే కాకుండా సౌకర్యం, రంగు, శరీరాకృతికి తగినట్లుగా ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉండేలా చూసుకోవాలి. మరీ వాటి కోసం ఎలాంటివి బాగుంటాయో చూద్దామా...!

 

విధులకు కాస్త పెద్దగా ఉండే లెదర్ నలుపు, గోధుమ రంగుల్లో ఎంచుకొంటే అవసరమైన వస్తువులన్నింటినీ వేసుకెళ్లవచ్చు.

మార్నింగ్ పార్టీల్లో పెద్దపెద్ద బ్యాగులు, సాయంత్రంలో మాత్రం క్లచ్‌ను మించిన అందమైన బ్యాగులు లేవు. పెళ్లిళ్లు వంటి ప్రత్యేక సందర్భాలకు బ్రొకేడ్ క్లచ్ బాగుంటాయి.

కాస్త ఎత్తు తక్కువగా, లావుగా కనిపించేవారు సన్నగా ఉండే బ్యాగుల్ని ప్రయత్నిస్తే బాగుంటుంది.

సన్నగా, పొడుగ్గా ఉన్నవారు గుండ్రని, ఆకృతి పెద్దగా ఉండే బ్యాగుల్ని వెంట తీసుకెళ్తే అదిరిపోతుంది.