ఏ డ్రస్సులో ఏ చెప్పులు వేసుకుంటే అట్రాక్షన్ గా ఉండచ్చో తెలుసా!

ఫ్యాషన్, స్ట్రైల్, ట్రెండింగ్ అనే పదాలు అమ్మాయిలను ఒక్కచోట కుదురుగా ఉండనివ్వవు. ఈ ఫ్యాషన్ ప్రపంచం చాలా పెద్దది. ఒకటి, రెండు కాదు అలంకరణలు, అందంగా తీర్చిదిద్దే అధ్బుతాలు. ఒకప్పటి పాత తరం అలంకరణ, వస్త్రాధరణ కూడా ఇప్పుడు మళ్లీ కొత్త సొబగులతో అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. అయితే ఫ్యాషన్ లో ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకునేది మ్యాచింగ్. ఒక డ్రస్ వేసుకుంటే దానికి తగ్గట్టు గాజులు, నగలు, జడ పిన్నులు, బొట్టు బిళ్ల ఇలా అన్నీ ఫ్యాషన్ గా ఉండాలి. అయితే ఈ మ్యాచింగ్ పరంపరలో చెప్పులకు ప్రాధాన్యత ఇచ్చేవారు తక్కువగానే ఉంటారు. అలాగని మరీ దుస్తులు కొన్నట్టు  చెప్పులు కొనాలంటే అయ్యేపని కాదు. మరి ఏ తరహా దుస్తులకు ఎలాంటి చెప్పులు బాగుంటాయో తెలుసుకుంటే ఓ మూడు లేదా నాలుగు జతల చెప్పులతో అన్నింటికీ ఆకర్షణగా ఉండేలా సరిపెట్టవచ్చు.

ఫ్లాట్ చెప్పులు..

ఫ్లాట్ చెప్పులు లెగ్గింగ్స్ లేదా ఫ్యాంటు  ధరించినప్పుడు వేసుకోవచ్చు. ఈ ఫ్లాట్ లలో చాలా విభిన్నమైన డిజైన్లు ఉన్నాయి. ఫ్యాంటు లేదా లెగ్గింగ్స్ పొట్టిగా ఉంటే స్ట్రాపీ చెప్పులు వేసుకోవచ్చు. అదే లెగ్గింగ్స్ పొట్టిగా లేకుండా నార్మల్ గా ఫ్లాట్ గా ఉన్న చెప్పులు వేసుకోవచ్చు.  

స్టిలెట్టోస్..

కేవలం వెస్ట్రన్ దుస్తులకే కాకుండా అన్నిరకాల దుస్తులతోనూ ఈ స్టిలెట్టోస్ చక్కగా ఉంటాయి. వీటిని ఎత్నిక్ తో ధరించవచ్చు. కావాలనుకుంటే చీరతో కూడా వీటిని వేసుకోవచ్చు.  ఇవి వేసుకున్నప్పుడు చాలా అట్రాక్షన్ గా ఉంటుంది.

వెడ్డెస్..

ఈ వెడ్డెస్ చెప్పులను ఏ సీజన్ లో అయినా సాదారణ దుస్తులతో అయినా కూడా వేసుకోవచ్చు. ప్యాంట్, సూట్,  ఇతర దుస్తులలో కూడా ఇవి చాలా అట్రాక్ట్ గా కనిపిస్తాయి. పైపెచ్చు ఇవి ఫ్యాషన్ కు మెరుగులు దిద్దుతాయి.

షూస్..

పొడవాటి షర్ట్, లాంగ్ టాప్, టీ షర్ట్ టాప్ వంటి విదేశీ టాప్స్ దరించి వీటికి కిందుగా లెగ్గింగ్స్ ధరిస్తే మాత్రం షూస్ ఎంపిక అధిరిపోతుంది. షూస్ బోలెడు రంగులలో ఉంటాయి. ఈ షూస్ లోకూడా స్నీకర్లు అని పిలువబడేవి అమ్మాయిలకు అందం. కేవలం ఇలా డ్రస్సులలోకే కాదు. వ్యాయామం, రన్నింగ్, జాగింగ్ వంటి సందర్భాలలో స్నీకర్లు చాలా సౌకర్యవంతంగా కూడా ఉంటాయి. వీటి వల్ల పాదాల నొప్పలు రావు.

లోఫర్లు..

లోఫర్లు ధరించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే అన్ని రకాల దుస్తులలోకి ధరించవచ్చు. లెగ్గింగ్స్ నుండి విదేశీ దుస్తుల వరకు అన్ని రకాల దుస్తులతో ఈ లోఫర్లు ధరించవచ్చు.

హై హీల్స్..

మహిళలు ఎన్ని రకాల చెప్పులు ధరించినా హై హీల్స్ దగ్గరకు తప్పకుండా తిరిగి వస్తారు. ఈ హై హీల్స్ వల్ల కాళ్ళ నొప్పులు వచ్చినా సరే ఎలాంటి సంకోచం లేకుండా వీటిని వేసుకోవడానకి ఇష్టపడతారు. స్కూల్, కాలేజీ వారి నుండి పెద్దల వరకు హీల్స్ కు ఓటు వేసేవారు ఎక్కువ. హై హీల్స్ ఓ జత మీతో ఉంటే ఈవెంట్ లో బాగా షో కొట్టచ్చు.

                                     *నిశ్శబ్ద.