సౌండ్ స్లీప్ కోసం కొన్ని టిప్స్

రోజంతా చదువు, ఆటలతో అలసిపోయిన పిల్లలకు సౌండ్ స్లీప్ అవసరం. టైంకు పడుకోవడం, తిరిగి ఉదయాన్నే లేవడం అలవాటు చేయాలి. సాలిడ్ స్లీప్ తో హాయిగా పడుకోవాలి. అప్పుడే అది హెల్దీ స్లీప్ అనిపించుకుంటుంది.

సౌండ్ స్లీప్ కోసం కొన్ని టిప్స్, టెక్నిక్స్ ఉన్నాయి. రోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. టైంలీ స్లీప్ వల్ల ఆ సమయానికి అలారం కొట్టినట్టు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఒక్కోరోజు ఒక్కో సమయానికి పడుకుంటే నిద్ర అంత త్వరగా రాకపోవచ్చు. మర్నాడు పొద్దున లేవడం కష్టమౌతుంది.

పెద్దలకు ఉన్నంతగా ఆలోచనలు, ఆందోళనలు చిన్నారులకు ఉండవు కనుక వాళ్లకి తేలిగ్గానే నిద్ర పడుతుంది. అయితే అది కలత నిద్ర కాకూడదు. పిల్లలు సాలిడ్ గా పడుకోవాలి. సౌండ్ స్లీప్ అవసరం.

సౌండ్ స్లీప్ రోజంతా పడిన అలసటను తగ్గిస్తుంది, సేద తీరుస్తుంది. సంతోషాన్ని అందిస్తుంది. సౌండ్ స్లీప్ నుండి మేల్కొన్న తర్వాత ఎంతో హాయిగా, ఆనందంగా ఉంటుంది. శారీరక, మానసిక ఎదుగుదలకూ సాలిడ్ నిద్ర అవసరం. గాఢంగా నిద్రపోయి లేచిన పిల్లలకు బడలిక తెలీదు. సగంసగం నిద్ర పొతే మట్టుకు అనీజీగా, అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా ఉంటుంది.

పెద్దలు ఎప్పటికప్పుడు పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. సౌండ్ స్లీప్ ఉందో లేదో చూడాలి. ఒకవేళ లేదని గమనిస్తే సౌండ్ స్లీప్ ఎందుకు కరువైందో తెలుసుకోవాలి. ఆదమరచి నిద్రపోయేలా చేయాలి.

సౌండ్ స్లీప్ కరువైన పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సౌండ్ స్లీప్ కు ఇంకొన్ని టిప్స్, టెక్నిక్స్ ఏమిటంటే, పడుకునే ముందు తప్పకుండా స్నానం చేసేలా చూడాలి. గ్లాసుడు గోరు వెచ్చని పాలు ఇవ్వాలి. దేని గురించి అయినా బాధపడుతున్నారెమో కనుక్కోవాలి. ఒకవేళ అలాంటిది ఉంటే దాన్నుండి బయటపడేలా చేయాలి. ఏవైనా పీడకలలు వస్తుంటే, అందుకు కారణం ఏమిటో తెలుసుకుని ఆ భయాలను తగ్గించేందుకు కౌన్సిలింగ్ ఇవ్వాలి.