ఈ టిప్స్ తో పొట్టిగా ఉన్న వాళ్ళు పొడుగ్గా కనిపించవచ్చు!
ప్రస్తుత కాలంలో అమ్మాయిల డ్రెస్సింగ్ అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా డ్రెస్సు రంగు నుండి ప్రతిదీ మ్యాచింగ్ ఉండేలా చూసుకుంటారు అమ్మాయిలు. అయితే డ్రెస్సులు, జ్యువెలరీ, మేకప్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. చాలామంది అమ్మాయిలు కేవలం కాళ్ళకు వేసుకునే చెప్పుల విషయంలో చాలా కమిట్మెంట్ తో ఉంటారు. ఒక్కో రకమైన డ్రెస్సుకు ఒక్కో రకం పాదరక్షలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి కూడా. . వీటిని ధరించి అందరూ స్టైలిష్‌గా కనిపిస్తారు. కానీ, ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలకు చెప్పలేనంత అసౌకర్యం ఉంటుంది. అందులోనూ పొట్టిగా ఉన్న ఆడపిల్లలు తమ ఎత్తు ఎక్కువగా కనిపించేందుకు హై హీల్స్ వేసుకుంటారు. దీని వల్ల వారి శరీరంలో చాలా సమస్యలు మొదలవుతాయి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సందర్భానికి హీల్స్ ధరించకూడదని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ పొట్టిగా కనిపించడం ఎవరుకీ నచ్చదు. అందుకే పొట్టిగా ఉన్న అమ్మాయిలు పొడుగ్గా కనిపించడం కోసం కొన్ని చిట్కాలు.
నిజానికి ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు పొడవుగా కనిపించాలంటే హీల్స్ ధరించడం ఒక్కటే పరిష్కారం కాదు. దీని కోసం, దుస్తులను ఎంచుకునే విధానాన్ని కూడా మార్చవచ్చు. కొన్ని దుస్తులను ధరించడం వల్ల పొట్టి అమ్మాయిల ఎత్తు పెరుగినట్టు కనిపిస్తుంది. . అందుకే అమ్మాయిలు ఎప్పుడూ ఎత్తుకు తగ్గట్టుగానే దుస్తులను ఎంచుకోవాలి.
హై వెయిస్ట్ జీన్స్ ధరించాలి...
నేటి కాలంలో, హై వెయిస్ట్ జీన్స్ చాలా ట్రెండ్‌లో ఉంది. హీల్స్ ధరించకుండా పొడవుగా కనిపించాలనుకుంటే, హై వెయిస్ట్ జీన్స్‌ని ప్రయత్నించవచ్చు. క్రాప్ టాప్ దీనితో వేసుకుంటే బాగా కనిపిస్తుంది. కావాలంటే, దానితో పాటు ఓవర్ సైజ్ టీ-షర్టును కూడా వేసుకోవచ్చు.
పొడవాటి కుర్తీని ధరించొచ్చు...
ఎత్తు తక్కువగా ఉంటే, నేరుగా పొడవైన కుర్తా ధరించవచ్చు. దీనితో చుడీదార్ పైజామా లేదా స్కిన్ టైట్ జీన్స్ వేసుకుంటే బాగుంటుంది.
అనార్కలి సూట్..
మీరు ఎత్నిక్ వేర్ ధరించాలనుకుంటే, అనార్కలి సూట్‌ను ప్రయత్నించవచ్చు. పొట్టిగా ఉన్నవారు ఈ డ్రెస్ వేసుకుంటే ఉన్న హైట్ కంటే ఎక్కువగా కనిపిస్తారు..
వి నెక్ బట్టలు మెరుగ్గా ఉంటాయి....
పొట్టిగా ఉండే అమ్మాయిలకు వి నెక్ బట్టలు బాగుంటాయి. ఇలాంటి నెక్ ఉన్న డ్రెస్సులలో అమ్మాయిల ఎత్తు ఎత్తుగా కనిపిస్తుంది..
ముదురు రంగులకే ఓటెయ్యండి..
ఎత్తు తక్కువగా ఉంటే ముదురు రంగు దుస్తులు ధరించాలి. ఇలా చేయడం వల్ల ఎత్తు ఎక్కువగా కనిపించడమే కాకుండా సన్నగా కనబడతారు.
కాబట్టి పొట్టిగా ఉన్నామని ఫీలవ్వకుండా.. హై హీల్స్ వేసుకుంటేనే హైట్ కవర్ అవుతుందనే భ్రమలో ఉండకుండా.. పైన చెప్పిన చిట్కాలు పాటించేయండి.
◆నిశ్శబ్ద.