లావుగా ఉన్నా సరే.. సన్నగా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే..!

సన్నగా కనిపిస్తే ఆ కిక్కే వేరు. నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు, నచ్చినంత తినచ్చు, ఎవ్వరూ ఎలాంటి కామెంట్స్ చెయ్యరు. కానీ లావుగా ఉంటే మాత్రం బోలెడు సమస్యలు. ముఖ్యంగా నచ్చిన దుస్తులు వేసుకోలేరు. పైపెచ్చు అందరూ ఎగతాళి చేసి మాట్లాడుతుంటారు. చాలా చోట్ల బాడీ షేమింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది మహిళలకు ఇంట్లోనే ఈ సమస్య ఎదురవుతుంది. అయితే లావుగా ఉన్నా సరే.. సన్నగా కనిపించాలంటే తెలివిగా ఆలోచించాలి. లావుగా ఉన్నా సన్నగా కనిపించే దుస్తులు వేసుకోవాలి. ఇంతకీ అలాంటి దుస్తులు ఎలా ఎంచుకోవాలి?  ఫలానా దుస్తులు వేసుకుంటే సన్నగా కనబడతామని ఎలా తెలుస్తుంది? మహిళలు ఈ అమేజింగ్ చిట్కాలు తెలుసుకోవాల్సిందే..

ఎంపిక..

లావుగా ఉన్నవారు డ్రస్సులు ఎంపిక చేసుకునేటప్పుడు చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వాలి. డ్రస్సులు ఎప్పుడూ పిచ్చి పిచ్చి గీతలతోనూ, డిజైన్ల తోనూ ఉండకూడదు. అలాగే చిన్న పువ్వులు, లతలు కూడా ఉండకూడదు. డ్రస్సుల మీద నిలువు గీతలు ఉన్నవి ఫర్పెక్ట్ గా నప్పుతాయి. ఇలాంటివి వేసుకుంటే సన్నగా కనిపిస్తారు.

వదులుగా అస్సలొద్దు..

లావుగా ఉన్నవాళ్లు టైట్ గా ఉన్న దుస్తులు వేసుకుంటే శరీరానికి అతుక్కుపోయి వికారంగా కనిపిస్తుందని అనుకుంటారు. ముఖ్యంగా పొట్ట, పిరుదులు, తొడ భాగాలు, వక్షోజాలు ఎబ్బెట్టుగా కనిపిస్తుంటే చాలా అసౌకర్యం ఫీలవుతారు. అయితే లూజ్ గా ఉన్న దుస్తులు వేసుకోవడం వేరు, కంఫర్ట్ ను చూసుకోవడం వేరు. లూజుగా ఉన్నవి కంఫర్ట్ అనే అపోహ నుండి బయటపడాలి. లావుగా ఉన్నా సరే శరీరానికి మరీ అంటీ అంటనట్టు ఉన్న దుస్తులు వేసుకుంటే చూడ్డానికి సన్నగా కనిపిస్తారు.

ప్యాంట్ సెలక్షన్..

లావుగా ఉన్నాం కదా అని చాలా  లూజుగా ఉన్న ప్యాంట్లు ఎంపిక చేసుకుంటారు చాలామంది. కానీ ఈ ప్యాంట్లు వేసుకుంటే ఇంకా లావుగా కనిపిస్తారు. కాబట్టి ఎప్పుడూ ఫిట్టింగ్ జీన్స్ ప్యాంట్లు సెలెక్ట్ చేసుకోవాలి.

షేప్..

డ్రస్సులలో బోలెడు షేప్ లు కూడా ఉన్నాయి. వీటిలో లావుగా ఉన్నవారికి A లైన్ డ్రస్సులు బాగా నప్పుతాయి. వీటిని వేసుకుంటే లావుగా ఉన్నా సరే స్లిమ్ గా కనిపిస్తారు. ఇవి వేసుకున్నప్పుడు పొడవుగా కనిపించడం వల్ల లావు బయటకు కనిపించదు.

దుస్తుల మందం..

దుస్తులు ఎప్పుడూ మందం ఉండకూడదు. మందంగా ఉన్న దుస్తులు వేసుకుంటే సన్నగా ఉన్నవారు కూడా లావుగా కనిపిస్తారు. అందుకని లావుగా ఉన్నవారు మందం దుస్తులు అస్సలు టచ్ చేయకపోవడమే మంచిది. దుస్తులు ఎంత ఖరీదువైనా, ఎంత అందమైన డిజైన్లు అయినా, ఎంత నచ్చినా మందంగా ఉన్న దుస్తులను దూరంగా ఉంచాలి.

                                    *నిశ్శబ్ద.