మీ పిల్లలు భయపడుతున్నారా?
1. ముందుగా వారి భయాన్ని అర్ధం చేసుకోండి:
వారు జీవించే లోకాన్ని చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. వారి ఉహాశక్తి అభివృద్ధి చెందే దశలో ఉండడంవల్ల నిజ జీవితంలో చూసిన లేదా విన్న కొన్ని సంఘటనలు, భయంకరమైన రూపాలుగా మనసులో చిత్రింపబడుతాయి. ఆ విధంగా చీకటి అంటే భయం ఏర్పడడం, చీకటి గదిలో వివిధ రకాల ఆకారాలను ఉహించుకోవడం జరుగుతాయి. వేరు వేరు వయస్సులలో వివిధ విషయాలకు, వివిధ తీవ్రతలలో పిల్లలు భయపడతారు. కాబట్టి, భయాన్ని అధిగంచడానికి ప్రత్యేకంగా ఒక దారంటూ లేదు. పిల్లల ఒత్తిడిని తట్టుకునే శక్తి, పిల్లల ఎదుగుదలని దృష్టిలో పెట్టుకుని వారి భయాన్ని తొలగించే ప్రయత్నాన్ని ప్రారంభించాలి.
2. మీ పిల్లలతో మాట్లాడండి:
మీ పిల్లలతో మాట్లాడడం ద్వారా వారి ని మీరు సౌకర్యంగా ఉంచగలరు. వారి భయాలని మీతో పంచుకునే స్వేచ్చనివ్వండి. మీ పిల్లలు ఏ విషయంలో ఎందుకు భయపడుతున్నారో అడగండి. ఆ సమయంలో వారి భావనలు తెలుసుకోండి. వారి భయాలను పంచుకునే సమయంలో మీరు శ్రద్దగా గమనించండి. చిన్నతనంలో మీరు కూడా కొన్ని సంఘటనలకు భయపడే వారని తెలియచేయండి. ఇలా చెయ్యడం వల్ల, మీరు వారి గురించి శ్రద్ధ తీసుకుంటున్నారని మీ పిల్లలకి అర్ధం అవుతుంది.
3. సరైన సందేశాన్ని అందించండి:
"చిన్న పిల్లలా ప్రవర్తించవద్దు", "భయపడవద్దు", "మీ స్నేహితులు చూడు భయపడకుండా ఉంటారు" లాంటి వి చెప్పడం ద్వారా మీ పిల్లలకి తప్పుడు సందేశాన్ని పంపించవద్దు. దీని ద్వారా భయపడడం తప్పని అర్ధం చేసుకుని వారు మీతో వారి భయాలని పంచుకోవడానికి సంకోచించవచ్చు. భయపడడం సర్వ సాధారణమని భయానికున్న కారణాలు మీతో పంచుకుని తగిన సహాయం అడగవచ్చని వారికి తెలియచేయండి.
4. వారి భయాన్ని తేలికగా తీసుకోకండి:
ఇంటి పక్కన ఉండే వాళ్ళు, సంరక్షకులు, లేదా మీ చుట్టాల్ల గురించి మీ పిల్లలు భయపడుతుంటే వారి భయాన్ని తేలికగా తీసుకోకండి. దాని బదులు, వారు ప్రత్యేకించి భయపడుతున్న వ్యక్తుల గురించి తెలుసుకోండి. ఎందుకు భయపడుతున్నారో అడగండి. ఒక వేళ ఆ వ్యక్తి వల్ల మీ పిల్లలకి ఎటువంటి హానీ లేకపోయినా, మీ పిల్లల భయాలని పరిగణలో కి తీసుకుని ఆ దిశగా చర్యలు తీసుకోండి.
5.మీ పిల్లల భయాలని ఎగతాళి చేయకండి:
మీ పిల్లల భయాలని ఎగతాళి చెయ్యడం వారికి అసౌకర్యం కలిగించడమే కాకుండా, వారి ఆత్రుత శాతం పెరిగి ఆత్మగౌరవ లోపం కలిగే అవకాశాలు కలవు. మీరందించే ప్రేమ, శ్రద్ధల నుండి మీ పిల్లల భయాలని తొలగించవచ్చు అంతే కాని, వారి భయాలని నిర్లక్ష్యం చెయ్యడం ద్వారా వారిలో ని ప్రతీకూల ఆలోచనలు పెరుగుతాయి.
6. మీ పిల్లలను బలవంతపెట్టకండి:
బలవంత పెట్టడం ద్వారా భయం మరింత పెరుగుతుంది. మీరే ఒక సారి ఆలోచించండి, మీకు బంగీ జంప్ అంటే భయం ఉన్నప్పుడు బంగీ జంప్ చేయమనడం లేదా మీరు భయపడే ఎదైనా భయానక కీటకాన్ని మిమ్మల్ని పట్టుకోమనడం మీకెలా అనిపిస్తుందో. మీ పిల్లలకి భయాలని అధిగమించుకునేందుకు కొంత సమయాన్ని కేటాయించండి. ప్రేమ, శ్రద్ధలు అందించడం ద్వారా వారికి సహకరించండి.
7.ధైర్యాన్ని కనపరచండి:
మీ చర్యలనే మీ పిల్లలు అనుసరిస్తూ ఉంటారు. ఏదైనా సందర్భంలో మీరు అతిగా స్పందిస్తే, అలాంటి సందర్భాలలో మీ పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. ఏదైనా, లేదా ఎవరైనా మీకు సురక్షితంగా ఉంటే, మీ పిల్లలు వారికి కూడా సురక్షితమని నమ్ముతారు. ప్రతీ సారి మీ పిల్లల రక్షణ కోసం కొన్ని సందర్భాలలో భయపడేతత్వాన్ని మీ ద్వారా అలవాటు చేయకండి. మీ పిల్లలకి ఏదైనా సందర్భం లేదా విషయానికి సంబంధించిన వి ఏవి చెయ్యొచ్చు, ఏవి చెయ్యకూడదు అనేవి స్పష్టంగా తెలియచేయడం ద్వారా వారికీ సహాయపడింది.
8.భయానక పాత్రల నుండి మీ పిల్లలని దూరంగా ఉంచండి:
పిల్లలు వాస్తవానికి, కాల్పనికతకి ఉన్న తేడా ని పసిగట్టలేరు. టీవీ లో కాల్పనికత పాత్రలని చూసి భయపడిపోతారు. భయానక టీవీ షోస్ ని మీ పిల్లలు చూడకుండా జాగ్రత్త తీసుకోండి. అలాగే, మీ పిల్లలకి వాస్తవికత మరియు కాల్పనికత ల మధ్య ఉన్న తేడా ని తెలియచేయడానికి ప్రయత్నించండి. టీవీ లో చూపెట్టే కార్టూన్స్ మరియు మూవీస్ ని ఎలా చిత్రీకరిస్తారో సులభంగా వారికి తెలియచేయండి.
9.ఇల్లంతా మీ పిల్లలతో కలిసి తిరగండి:
దీని ద్వారా కొన్ని గదులు, ప్రదేశాలు వంటి వి ఏవైతే మీ పిల్లల భయానికి కారణమో ఆ ప్రదేశాలు వారికి అలవాటు అవుతాయి. ఇంట్లో ఉన్న అన్ని తలుపులూ తీసి, మంచం కింద మరియు వెలుగు చేరని చోట లైట్ వెలిగించి అక్కడేమి లేదని వారికి తెలియచేయండి. ఒక వేళ మీ పిల్లలు ఏవైనా భయంకర శబ్దాలు లేదా నీడ లోని ఆకారాలని చూసి భయపడుతూ ఉంటే ఆ సమస్యని మీ పిల్లలతో చర్చించండి. వేటి ద్వారా ఈ శబ్దాలు రావచ్చో చర్చించండి.