ఆడవాళ్లు ట్రెండ్ ను ఫాలో అవడం అందరికి తెలిసిందే. కొత్త కొత్త లేటెస్ట్ ఫ్యాషన్ మార్కెట్ లోకి ఏది వచ్చిన కూడా దానిని ఫాలో అవడం చేస్తుంటారు. కానీ ట్రెండ్ ను ఫాలో అవడం కన్నా మీరే కొత్త ట్రెండ్ ను మీకోసం తయారు చేసుకోవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన దుస్తులకు చక్కని లుక్ వస్తుంది.
శరీరంలో ఛాతీ భాగం కాస్త బొద్దుగా ఉన్నవారు చేతుల విషయంలో జాగ్రత్తపడాలి. బుట్ట చేతులు, వదులుగా ఉండే చేతులు, కుచ్చులుండేలా.... అసలు కుట్టించుకోకూడదు. ఒంటికి అతుక్కుని ఉండే మోడల్ ఎంచుకోవాలి. కింది భాగంలో వదులుగా ఉండేలా దుస్తులు కుట్టించుకుంటే పై భాగం నుంచి దృష్టి మళ్ళుతుంది.
నడుం కిందిభాగం లావుగా ఉండేవారు దుస్తుల చేతులతో తమాషాలు చేయవచ్చు. రకరకాల కుచ్చులు, బుట్ట చేతులు, వదులుగా ఉండే పొడవు చేతులు, రఫెల్స్... ఇలా ఎన్నో రకాలు ప్రయత్నించవచ్చు. అప్పుడు పైన కింద బ్యాలెన్స్ అయ్యి ఆకృతి అందంగా కనిపిస్తుంది.
మీ చేతులు సన్నగా ఉన్నాయా? ఒంటికి అటుక్కున్నట్లు, వేలడుతున్నట్లుండే ఫ్యాబ్రిక్ కాకుండా కాస్త నిలబడి ఉండే వస్త్రం ఎంచుకోవాలి. పొడవు చేతులు, మూడొంతుల పొడవున్న చేతులు ఇలాంటివారికి బాగుంటాయి.
చేతులు లావుగా ఉన్నాయా? మీరు తప్పనిసరిగా మూడొంతుల పొడవుండే వదులు చేతులు కుట్టించుకోవాలి. పొట్టి చేతులు మీకు బాగోవు.
చక్కటి కుచ్చులతో ఒక మంచి షర్టు మీ వార్డ్ రోబ్ లో లేదా? ఒక మీటరు మంచి లేసు తీసుకుని మీ దగ్గరున్న తెల్ల షర్టుకి కుట్టించుకోండి.
మీ దగ్గర ఒక మంచి పొడవు చేతుల తెల్ల షర్టు ఉంది. దాన్ని స్కర్టు మీద ధరించినపుడు అలాగే వేసుకోండి. అదే ప్యాంటు మీద ధరించినపుడు అలాగే వేసుకోండి. అదే ప్యాంటు మీద ధరించినపుడు అంచుల్ని రెండు మడతలు పైకి మడిచారనుకోండి. స్టైల్ గా ఉంటుంది.