శ్రీ వేంకటేశ్వర వ్రతకల్పం - 4
Sri Venkateswara Vratha Kalpam - 4
తదంగ కలశారాధనం కరిష్యే
(ఉదకమును వదలాలి. సంకల్పము, ఆచమనాలకు ఉపయోగించే పాత్రను కలశారాధనకు వాడకూడదు. స్వామికి కుడివైపున కలశం ఉంచి దానికి గంధం, కుంకుమ, అక్షతలు ఉంచి కలశంలో సుమాలు ఉంచి కింది శ్లోకాన్ని స్మరించాలి)
కలశారాధనం
కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాశ్రితాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదో ధ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
కలశే గాంధ పుష్పాక్షతాన్ నిక్షిప్త్య హస్తేణాచ్చాద్య
ఆపో వా సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణవా ఆపః పశన
ఆపొన్న మాపోమృత మాప స్సమ్రాడాపొ విరాడాప
స్వరాడాపశ్చందా జ్యోతీ ష్యాపో యజూంష్యాప స్సత్యమాప
స్సర్వా దేవతా అపోభూర్భువస్సువ రాప ఓం
(కలశాన్ని ఉదకంతో నింపి అందులో తులసీ దళాన్ని వేయాలి)
గంగే చ యమునేచైవ గోదావారీ సరస్వతీ నర్మదే బంధు కావేరీ జలే స్మిన్ సన్నిధింకురు
కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీచ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతా పంచాగంగా ప్రకీర్తితాః
కలశోదకేన దేవమాత్మానం పూజాద్రవ్యాణి చ సంప్రోక్ష్య
(కలశ మండలి నీటిని పూలతో స్వామి పైన, పూజాద్రవ్యాలపైనా, తమ తలపైనా జల్లుకోవాలి)
శ్రీ గణపతి ప్రార్ధన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్ధం గణపతి పూజాం కరిష్యే
అథ గణపతి పూజా
గణానాం త్వాం గణపతిం హవామహే కవిం కవీనా ముపమశ్రవంతవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్య న్నూతిభిససీదసాధనం
శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి
ఆవాహయామి రత్న సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం
సమర్పయామి హస్తాయో రర్ఘ్యం సమర్పయామి
ముఖే ఆచమనీయం సమర్పయామి
ఆపోహిష్టా మయోభువస్తాన ఊర్జీదధాతన, మహేరణాయ చక్షసే
యోవశ్శివత మోర సస్తస్య భాజయతేహనః ఉశతీరి నమాతరః
తస్మారం గామామవో యస్యక్షయాయ జిన్వధ అపోజనయధాచనః
శ్రీ మహాగణాధిపతయే నమః స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
అభివస్త్రాసు వాసనాన్యర్షాభిదేనూస్సు దుఘాః పూజమానః
అభిచంద్రా భర్తవే నో హిరణ్యాభ్యశ్వాన్ రథి నోదేవ సోమ
శ్రీ మహాగణాధిపతయేనమః వస్త్రయుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య త్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తూ తేజః
శ్రీ మహాగణాధిపతయేనమః యజ్ఞోపవీతం సమర్పయామి
గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీం సర్వభూతానాం తా మిహోపహ్వోయే శ్రియం
శ్రీ మహాగణాధిపతయేనమః దివ్యశ్రీ చందనం సమర్పయామి
ఆయనే తే పరాయనే దుర్వా రోహంతు పుష్పిణీః
హ్రడాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాఇమే
శ్రీ మహాగణాధిపతయేనమః దూర్వాది నానా విధ పుష్పాణి పూజయామి
sri venkateswara vratha kalpam parts, venkateswara vratam author Timmaraju viswapati ramakrishnamurthysri venkateswara vratham, sri venkateswara vratha vidhanam, sri venkateswara vratham in telugu, powerful book sri venkateswara vrata kalpam