Home »Library » Annamacharya Sankeerthanalu - 2
?>

అన్నమాచార్య కీర్తనలు - 2

Annamacharya Sankeerthanalu - 2

Documented by: sri Ramachandra Murty Sistla (Sri Sistla)

 

 

2) శుద్ధ ధన్యాసి

భావములోన బాహ్యమునందును గోవిందగోవింద యని కొలువవో మనసా

హరియవతారములే అఖిల దేవతలు హరిలోనివే బ్రహ్మాండములు

హరినామములే అన్ని మంత్రములు హరి హరి హరి హరి హరి యనవో మనసా

విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు

విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా

అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు

అచ్యుతుడు శ్రీ వేంకటాద్రి మీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా

 

annamacharya keerthanalu, annamacharya keerthanalu in telugu, annamacharya keerthanalu audio, annamacharya keerthanalu mp3