Home »Library » Sri Venkateswara Vratha Kalpam - 2
?>

శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పము - 2

Sri Venkateswara Vratha Kalpam - 2

తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి

 

వ్రత విధానం

కలియుగంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడం అతి తేలికైన మార్గం. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి. సాక్షాత్తూ శ్రీమన్నారాయణునిచే అనుగ్రహించబడిన ఈ వ్రతం ఆచరించడం అతి సులభం.

 

ఈ వ్రతాన్ని ఎప్పుడైనా ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసాల్లో లేదా పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి\ తిథుల్లో లేదా శ్రవణం స్వాతి నక్షత్ర దినాల్లో గానీ ఆచరిస్తే మరింత ఫలప్రదం.

 

ఉదయం గానీ సాయంత్రం గానీ ఈ వ్రతం ఆచరించవచ్చు. ఈ వ్రతంలో ఐదు అధ్యాయాలు ఉన్నాయి. మొదటిది శ్రీ వేంకటేశ్వరస్వామివారు అనుగ్రహించగా, తక్కిన వాటికి విశ్వామిత్ర, వశిష్ట, భరద్వాజ, అత్రి మహామునులు ప్రవర్తకులు. ఇంట్లోగానీ, ఆలయంలోగానీ, నదీతీరంలో గానీ వ్రతం ఆచరించవచ్చు.

 

వీలున్నంతవరకూ బంధుమిత్రులందరినీ పిలుచుకుని ఆచరించాలి. ముందుగా ఈ వ్రతాన్ని చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత మంటపంలో వేంకటేశ్వరస్వామివారి పటాన్ని ఉంచాలి. శ్రీదేవి, భూదేవిల ఉత్సవ విగ్రహాలతో కూడిన కల్యాణ వేంకటేశ్వర స్వామివారి పటాన్ని కూడా ఉంచిన ఇంకా శ్రేష్ఠం. రూపాయి బిళ్ళను కూడా ఉంచి తర్వాత కలశం పెట్టాలి.

 

నవగ్రహ దేవతలను అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకోవాలి. లేక వారందరికీ మనసులోనే నమస్కరించాలి.

 

ముందుగా పసుపు వినాయకుని పూజించి వ్రతం నిర్విఘ్నంగా కొనసాగాలని ప్రార్ధించాలి. కథను ప్రారంభించాలి.

 

ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తిశ్రద్ధలతో జరుపుతారో, వారి దగ్గరికి తానే స్వయంగా ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తానని స్వామివారు సెలవిచ్చారు.

 

సాక్షాత్తూ శ్రీస్వామివారే సెలవిచ్చిన మరొక విశేషం ఏమిటంటే ఒకవేళ మనలో ఎవరికైనా ఆపద కలిగి, ఇంత వివరంగా ఈ వ్రతం ఆచరించదానికి తగిన సమయం లేక లేదా ఇతర కారణాలచేత కుదరకపొతే ఒంటరిగా కూర్చుని కూడా ఈ వ్రతం ఆచరించవచ్చును.

 

శ్రీ స్వామివారి పటం ముందు కూర్చుని ముందుగా విఘ్నేశ్వరుని మనసులో ప్రార్ధించి, తర్వాత అష్ట దిక్పాలకులు, నవగ్రహ దేవతలకు, మనసులోనే నమస్కరించాలి. తులసీదళాలు, కొబ్బరికాయ అందుబాటులో ఉన్న ఫలాలు, పూలు పళ్ళెంలో ఉంచుకోవాలి. స్వామివారికి నమస్కరించి వ్రత కథలన్నీ మనసులోనే చదువుకుని చివరన కొబ్బరికాయ, ఫలాలు స్వామివారికి నివేదించాలి. అవి ప్రసాదంగా స్వీకరించినట్లయితే కష్టాలు వెంటనే తొలగిపోతాయి.

 

ప్రతి కథ సమాప్తమైనప్పుడు ఒక కొబ్బరికాయను నివేదించాలి. మహా ప్రసాదాన్ని గోధుమరవ్వ, పంచదార కలిపి చేయాలి. అందులో అరటిపండ్లు తప్పక వేయాలి. ప్రతి కథ అయిన తర్వాత గోవిందా.. గోవిందా.. గోవిందా.. అంటూ మూడుసార్లు ప్రార్ధించాలి.

 

స్వామివారికి తులసీ దళాలు చాలా ప్రియం. కనుక పూజలో తులసీదలాను నివేదించిన మంచి ఫలితం ఉంటుంది. వ్రతం పూర్తయిన తర్వాత ఆ తులసీదళాలను అందరూ ప్రసాదంగా తీసుకున్నచో అన్ని రోగాలూ నశించి అష్ట ఐశ్వర్యాలూ కలుగుతాయి. వ్రత సమాప్తి కాగానే కొబ్బరికాయ ను కొట్టి కొబ్బరిముక్కలు మహా ప్రసాదంలో కలిపి శ్రీవారికి నివేదించి మీరు స్వీకరించి, వచ్చినవారికి ఇచ్చినచో ఎంతో పుణ్యం.

 

కనుక ఈ వ్రతం తప్పక యథావిధిగా కలశ స్థాపనతో వివరంగా జరుపుకోవాలి. వీలు కాకపోతే మాత్రం రెండో రకంగా ఆచరించవచ్చును.

 

ఒక్కటి మనందరం గుర్తుంచుకోవాలి. మన కష్టాలన్నీ స్వామివారికి తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలీదు. కనుక ఆ దయామయుని ప్రార్ధించి సంకల్పించి వ్రతం ఆచరిస్తే తప్పక మనోసిద్ధి నెరవేరుతుంది. అన్ని కష్టాలూ తొలగిపోయి సర్వ సౌఖ్యాలూ లభిస్తాయి.

 

సమస్త సన్మంగళాని భవంతు

శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు

 

sri venkateswara vratha kalpam part-2, venkateswara vratam author Timmaraju viswapati ramakrishnamurthysri venkateswara vratham, sri venkateswara vratha vidhanam, sri venkateswara vratham in telugu, powerful book sri venkateswara vrata kalpam