Home »Library » Annamacharya Sankeerthanalu - 4
?>
అన్నమాచార్య కీర్తనలు - 4
Annamacharya Sankeerthanalu - 4
Documented by: sri Ramachandra Murty Sistla (Sri Sistla)
4) ఆభేరి
పలుకు తేనియల తల్లి పవళించెను కలికి తనముల విభుని కలిసినదిగాన
నిగనిగని మోముపై నేరులు గెలకుల చెదర పగలైన దాక చెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారిన దాక జగదేకపాటి మనసు జట్టిగోనేగాన
కొంగు జారిన మెరుగుగుబ్బలొలయగ తరుణి బంగారు మేడపై పవళించెను
చెంగలువ కనుగోసల సింగారములు దొలక అంగజగురునితోడ అలసినది గాన
మురిపెంపు నటనలతో ముత్యాల మలగుపై పరవశంబున తరుణి పవళించెను తిరువేంకటాచలాధిపుని కౌగిట గలసి అరవిరైనును చెమట నంటినదిగాన
annamacharya keerthanalu, annamacharya keerthanalu in telugu, annamacharya keerthanalu audio, annamacharya keerthanalu mp3