Home »Library » Annamacharya Sankeerthanalu - 5
?>
అన్నమాచార్య కీర్తనలు - 5
Annamacharya Sankeerthanalu - 5
Documented by: sri Ramachandra Murty Sistla (Sri Sistla)
5) మణిరంగు
జయజయ రామ సమర విజయరామ భవహర నిజభక్తి పారీణరామ
జలధి బంధించిన సౌమిత్రిరామ సెలవిల్లు విరచిన సీతారామ
అల సుగ్రీవనేలిన అయోధ్యరామ కలిగి యజ్ఞము గాచే కౌసల్య రామ
అరి రావణాంతక ఆదిత్య కులరామ గురుమౌనులను గాచే కోదండరామ
ధరనహల్య పాలిట దశరథరామ హరురాణి నుతుల లోకాభిరామ
అతి ప్రతాపముల మాయా మృగాంతక రామ నూట కుశలవ ప్రియ సుగుణరామ
వితత మహిమల శ్రీ వేంకటాద్రి రామ మతిలోన బాయని మనువంశ రామ
Annamacharya Sankeerthanalu, annamacharya sankeerthana lyrics, annamacharya sankeerthanas, Tallapaka annamacharya sankeerthanas