.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-105 లో హాస్పిటల్ లో అంజలి స్పృహలోకి వచ్చి పోలీసులు వచ్చి అసలు ఏం జరిగిందో కనుక్కుంటారు. అంజలి ఏదో చెప్తుంది. ఆ తర్వాత పోలీసులు ఇంటికి వస్తారు. వాళ్ల వెనకాలే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి తిరిగి వస్తుంది అంజలి. ఇప్పుడు ఎలా ఉందని గీత అడుగుతుంది.. ఇప్పుడు పర్లేదు అమ్మగారు అని అంజలి చెప్తుంది.
అంజలి దగ్గర ఇప్పుడే స్టేట్మెంట్ తీసుకున్నాం..అసలు ఏం జరిగిందో మొత్తం చెప్పిందని ఇన్స్పెక్టర్ అనగానే రాకీ, రోహిత్ భయపడతారు. ఇంట్లో ఫ్లవర్ వాజ్ కింద పడి పగిలిపోయిందంట.. అది అంజలి కాలు జారి దానిపై పడటంతో అది కడుపులో గుచ్చుకుంది అంతే కానీ ఇంట్లోకి ఎవరూ రాలేదు.. ఎవరూ నన్ను పొడవలేదని అంజలి చెప్తుంది. అందుకే ఈ కేసును క్లోజ్ చేస్తున్నామని చెప్పడానికి వచ్చామని ఇన్స్పెక్టర్ చెప్తాడు. దీంతో రాకీ, రోహిత్ హ్యాపీగా ఫీల్ అవుతారు. పోలీసులు వెళ్లిపోతారు.
రత్నం వచ్చి ఇప్పుడు ఎలా ఉంది అంజలి అని అడుగుతుంది. ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదని అడుగుతుంది. నీకు ఆరోగ్యం బాలేదు కదా అందుకే చెప్పలేదని గీత చెప్తుంది. ఆ తర్వాత మనీష్ గదిలోకి అంజలిని తీసుకొని వెళ్తాడు. ఒరేయ్ అంజలికి దిష్టి తియ్ అని రత్నం అనగానే మనీష్ దిష్టి తీస్తాడు. అదంతా భవిత చూసి జెలస్ గా ఫీల్ అవుతుంది. ఏంటి దిష్టి తీస్తున్నారా అని అడుగుతుంది. ఒక పనిమనిషికి దిష్టి తియ్యడం ఏంటని అనుకుంటుంది.
ఆ తర్వాత మనీష్ వెళ్తుంటే పిలిచి తనకి దిష్టి తీయిస్తుంది భవిత. ఆ తర్వాత అంజలి మన గురించి ఎందుకు నిజం చెప్పలేదని రోహిత్, రాకీ ఆలోచిస్తారు. అప్పుడే అంజలి వచ్చి రోహిత్ ని బయటకు వెళ్లమని చెప్తుంది. తరువాయి భాగంలో రాకీ చెంప చెల్లుమనిపిస్తుంది అంజలి. ఒక గంట టైమ్ ఇస్తున్నా, ఇంట్లో నుంచి వెళ్లిపో, లేదంటే పోలీసులకి, ఇంట్లో వాళ్లకి నీ గురించి చెప్పేస్తానని అంజలి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
