.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -153 లో.....మురళి అపర కోటీశ్వరుడై జాను వేలంపాట వేస్తున్న స్థలం దగ్గరకు వచ్చి సింహాద్రికి పోటీ ఇస్తాడు.జాను, మురళి నందు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కకి తన దగ్గర ఉన్నది వజ్రం అని తెలీదు.. రాయి అనుకుంటుందని మురళి గురించి జాను అంటుంది. ఇక తను సంజయ్ స్థలం అమ్మకానికి చూస్తున్నా, అందుకే వేలంపాట పెడుతున్నా, అది పూర్తయిన తర్వాత నాకు డబ్బు వస్తుంది.. కొంత నీకు ఇస్తా షాప్ పెట్టుకోమని జాను అంటుంది. ఇంతలో సంజయ్ వచ్చి స్థలం అమ్మితే కాదు.. లాభం వస్తేనే డబ్బు ఇస్తానని అంటాడు.
మాట మార్చేస్తున్నారేంటి, అయినా ఇక్కడ జాను వేలంపాట వేసి ఎక్కువ వచ్చేలా చేస్తా అంటుంది. నందు కోసం ఆకర్ష్ ఎదురుచూస్తాడు. నందు వాళ్ల ఇంటికి దగ్గర్లో ఉన్న ఆకర్ష్ ఈ పక్కనే నందు వాళ్ల ఇళ్లు కదా, తనని ఆఫీస్‌కి తీసుకెళ్తా అని అనుకొని నందుకి కాల్ చేస్తాడు. నందు కంగారుపడి మెడలో తాళి తీసేసి రోడ్డు మీదకి వెళ్తుంది. బామ్మ బట్టలు ఆరేస్తూ నందుని, ఆకర్ష్ చేయి ఇచ్చి మాట్లాడటం చూసి షాక్ అవుతుంది.
జాను వేలంపాట దగ్గరకు బయల్దేరి సంజయ్ ని డ్రాప్ చేయమని అంటుంది. నేను చేయను ఆటోలో వెళ్లు అని సంజయ్ అంటే నా రేంజ్ ఏంటో తెలుసా అని బిల్డప్ ఇస్తుంది. వేలంపాటకి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. సింహాద్రి, నిత్య కూడా వేలంపాటకి వచ్చి తక్కువ రేట్‌కి దక్కించుకోవాలని అనుకుంటారు. సింహాద్రి వాళ్లు వేలంపాట మొదలు పెట్టమని అంటే ఇంకా రావాల్సిన వాళ్లు ఉన్నారని చెప్తారు. ఎవరా అని చూస్తే ఎంక్కే అంటూ మురళి సూటు బూటు వేసి పెద్ద కారులో ఎంట్రీ ఇస్తాడు.సింహాద్రి, నిత్య నోరెళ్లబెడతారు. మురళి నువ్వేంట్రా ఇక్కడ ఇలా అని అంటే ఈ మురళి ఇప్పుడు కోటీశ్వరుడు, జాక్ పాట్ తగిలింది.. బంగారంలో మునిగి తేలుతున్నానని అంటాడు. నందు నీతో ఉందా అని అంటే అంకుల్ నా రేంజ్ మారిపోతే ఆ పేద శంకర్ నారాయణ కూతురు నాకెందుకు.. రెండు కోట్లు కొట్టేయడంతో వెళ్లిపోయిందని అంటాడు. అన్ని డబ్బులు ఎలా వచ్చాయని నిత్య అడిగితే అది సీక్రెట్ చెప్పను.. వేలం అయిన తర్వాత నిత్య నీకు రెండు కోట్లు ఇస్తానని మురళి అంటాడు. నాకే పోటీ వస్తావా అని సింహాద్రి అంటే ఇప్పుడు నేను బంగారం అంకుల్.. వేలంపాటలో మీకు గుండెపోటు తెప్పించగలనని సింహాద్రిని రెచ్చగొడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
