తులసికి ఏం జరగబోతోంది?
on Jan 18, 2022

నటి కస్తూరి నటిస్తున్న సీరియల్ `ఇంటింటి గృహలక్ష్మి`. ఇందులో కస్తూరి తులసిగా నటిస్తోంది. గత కొన్ని వారాలుగా మహిళా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ ఈ మంగళవారం సరికొత్త మలుపు తిరగబోతోంది. గత కొంత కాలంగా సమస్యల సుడిగుండంలో విహరిస్తూ ఉక్కరిబిక్కిరి అవుతున్న తులసి ఆ రోజు ఎపిసోడ్‌లో డాక్టర్ ని ఎందుకు కలవాల్సి వచ్చింది?.. ఆ తరువాత ఏం జరిగింది? ఈ రోజు ఎపిసోడ్ లో చూద్దాం.
తులసి ఇంట్లో గొడవలు సృష్టించడానికి లాస్య తీసుకొచ్చిన పని మనిషిని తను వచ్చిన విషయం పసిగట్టిన ఫ్యామిలీ మెంబర్స్ ఇంటి నుంచి పంపించేస్తారు. ఆ తరువాత తులసి వల్లే నందూ తనని దూరం పెడుతున్నాడని, ఎలాగైనా తనని ఇంటి నుంచి పంపించివేసి తనకు బలంగా వున్న కుటుంబాన్ని దూరం చేయాలని లాస్య ప్లాన్ చేస్తూ వుంటుంది. ఇదిలా వుంటే డబ్బు సంపాదించాలనే వక్ర బుద్ధితో అభి షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టి కోట్లు సంపాదించాలని డిసైడ్ అవుతాడు.
Also read: దీప్తి-షన్ను రిలేషన్‌షిప్‌పై గుడ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్ ఫాదర్!
కట్ చేస్తే... తులసి డాక్టర్ ని కలవాలని హాస్పిటల్ కి వెళుతుంది. క్యాన్సర్ అన్ని రోగాల లాంటిది కాదు. మనం దూరం పెట్టాలని చూసినా అది దగ్గరవుతూనే వుంటుంది. ఈ విషయాలు మీతో చెప్పాల్సినవి కాదు. ప్రేమ్ ని పిలిచించండి చెప్తానని అనడంతో చావు అంచుల వరకూ వెళ్లిన దాన్ని నాకు చావు అంటే భయం లేదు డాక్టర్ గారు చెప్పండి అని తులిసి అనడంతో .. ప్రస్తుతానికి అయితే పర్లేదు. ఒక ఏడాది తరువాత ఎలా ఉంటుందో ఏమౌతుందో చెప్పలేం. అపరేషన్ సక్సెస్ అని చెప్పాం అంత వరకూ ఓకే బట్ క్యాన్సర్ అనేది ప్రమాదకర శత్రువు.. అంటుంది డాక్టర్. ఇంతకీ డాక్టర్ తులసికి ఏం చెప్పింది? ఆ తరువాత తులసి పరిస్థితి ఏంటీ? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



