ఆదిత్య రావడం దేవి గమనించిందా?
on Jan 18, 2022

గత ఎపిసోడ్ లో మాధవ వెళ్లగానే ఇంటికి వచ్చిన ఆదిత్యతో రాధ మీరు ఎవరు అసలు? దేవిపై మీకున్న హక్కు ఏంటీ? అని నిలదీయడంతో పాటు దేవితో కూడా `మీరు నా కోసం రావద్దు సారు` అని చెప్పించి షాకిస్తుంది. దాంతో ఆదిత్య గుండెలు పగిలేలా ఏడుస్తాడు. మంగళవారం ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారబోతోంది. ఈ రోజు 44వ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో.. ఏం జరగబోతోందన్నది ఒకసారి చూద్దాం.
Also Read: బెడిసికొట్టిన లాస్య ప్లాన్! ప్రేమ్-శ్రుతి శోభనం!!
ఆదిత్య బాధపడటం గమనించిన రాధ కూడా లోలోన కుమిలిపోతుంది. తన అంతరాత్మే తనకు కనిపించి ఆదిత్యని ఎందుకు ఇలా బాధపెడుతున్నావ్` అని నిలదీస్తే .. `నిజం తెలిస్తే నా చెల్లల బతుకు ఆగమయితాది` అని ఏడుస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే.. మరునాడు ఉదయాన్నే భోగి మంటలు వేసిన దేవుడమ్మ కుటుంబం ఆదిత్యతో కలిసి సంబరాలు చేసుకుంటారు. అప్పుడు కూడా ఆదిత్య దేవి గురించే బాధపడుతూ వుంటాడు. అక్కడ భోగి మంటలు అయ్యాక ఆదిత్య చాటుగా మాధవ ఇంటికి వచ్చి .. దూరం నుంచి దేవిని చూసుకుని మురిసిపోతాడు. కానీ దేవికి ఆదిత్య వచ్చిన విషయం తెలిసిపోతుంది. ఇక్కడే ఎక్కడో వున్నాడని వెతుకుతూ వుంటుంది.
కట్ చేస్తే... ఇక కాసేపటికి మాధవ పిల్లలకి కొత్త బట్టలు తెచ్చి.. పిల్లలకి వేయమని రాధకు ఇస్తాడు. చిన్మయ్ వేసుకుంటుంది కానీ దేవి మాత్రం తాను వేసుకోనని ఖరాకండీగా చెప్పేస్తుంది. దాంతో రామ్మూర్తి `పండగ పూట కొత్త బట్టలు వేసుకోకుండా చేశావ్ కదరా.. ఇప్పుడు నీకు సంతోషమా? అని తిడతాడు. కానీ మాధవ మాత్రం `అందరి మంచి కోసమే నేను అలా చేశానని చెబుతాడు. కట్ చేస్తే ఆదిత్య ఇంట్లో కూర్చుని దేవి గురించి ఆలోచిస్తుంటాడు. అది గమనించిన సత్య ఏం చేసింది? ఆ తరువాత ఏం జరిగింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



