సుదీప తన గురించి చెప్తుంటే ఏడ్చేసిన కంటెస్టెంట్స్!
on Sep 16, 2022
.webp)
పదకొండో రోజు బిగ్ బాస్ హౌస్ లో 'నిన్న జరిగిన సిసింద్రీ టాస్క్ లో అందరూ బాగా ఎమోషనల్ అయ్యారు. అందుకని ఒక్కొక్కరుగా వచ్చి మీ జీవితంలో బేబి ఉన్నారా ? ఉంటే వారితో ఎలా ఉండేది మీ అనుబంధం వివరించండి' అని బిగ్ బాస్ చెప్పాడు.
సుదీప మాట్లాడుతూ, "నా కాళ్ళ మీద నేను బ్రతకాలని బయటకు వచ్చేసాను. 2015 లో ప్రెగ్నెన్సి కన్ఫమ్ అయ్యింది. బేబీ హార్ట్ బీట్ వచ్చింది. అయితే నాకు థైరాయిడ్ ఉంది. అది చూసుకోలేదు. థైరాయిడ్ హై అయింది. I lost my baby. తర్వాత చాలా ఏడ్చాను. ఎంత ఏడ్చినా మన బేబీ రాదు అని మా ఆయన చాలా ధైర్యం చెప్పాడు. మా చెల్లికి కూతురు పుట్టే వరకూ నేను మామూలు అవ్వలేదు. మా చెల్లి కూతురిని తెచ్చుకొని ఆడుకునేదాన్ని. అప్పుడు మా ఆయన అనేవాడు 'తను వాళ్ళ కూతురు మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి'. అందరి పిల్లలు నా దగ్గరకు వస్తారు. కానీ నా పిల్లలే రావట్లేదు అని నా భర్త అన్నాడు. తను అలా అనగానే నాకు కన్నీళ్ళు ఆగలేదు" అని సుదీప చెప్పుకొచ్చింది. ఇది వింటూ అందరూ కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. ఇనయా సుల్తానా, కీర్తీభట్ చాలా ఏడ్చారు.
పదకొండో రోజు గీతూ, అభినయశ్రీ, మెరీనా-రోహిత్, షానీ, ఫైమా, ఆదిరెడ్డి, రాజ్, రేవంత్ నామినేషన్లో ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



