నా కళ్ళ ముందే మా అమ్మ కాలిపోయింది!
on Sep 16, 2022

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గురించి పర్లేదు అనే టాక్ వినిపిస్తోంది. ఐతే ఆడియన్స్ ని కట్టి పడేయడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ ని ఎంచుకున్నాడు. అదే కంటెస్టెంట్స్ లైఫ్ లో జరిగిన ఎమోషనల్ స్టోరీస్ చెప్పిస్తూ ఆడియెన్స్ ని కట్టి పడేసాడు. ఇక ఈ హౌస్ లో అందరూ తమ తమ కన్నీటి కథలు చెప్పుకొచ్చారు. అందరినీ నవ్వించే చంటి జీవితంలో కూడా ఒక విషాదం ఉంది. ఇప్పటి వరకు తెలియని బాధ ఈ బిగ్ బాస్ హౌస్ లో తెలిసింది.
"అందరికీ చెప్తున్నా.. నేనెప్పుడూ ఆడపిల్లలంటే దూరంగా ఉంటాను. వాళ్ళను ఎక్కువగా అభిమానించను.. నేను ఉదయం నిద్రలేచే సమయానికి నా కూతుళ్లు స్కూల్‌కి వెళ్లిపోతారు. వాళ్లు నిద్రపోయాక నేను ఇంటికి వస్తాను. వాళ్లకు కావాల్సినవి కొనిస్తాను, ఎక్కడికి కావాలన్నా తీసుకెళ్తాను. వాళ్ళతో కొంత సమయం గడుపుతాను కానీ ఎక్కువగా దగ్గరవ్వను.. ఎందుకంటే నేను ఎక్కువగా ప్రేమించే వాళ్ళెవరూ నా దగ్గర ఉండరు.. అది కన్ఫర్మ్. అందులో ఎలాంటి అనుమానం లేదు. అందుకే నేను ఎక్కువగా ఎవరితో ఎమోషనల్ బాండింగ్ పెట్టుకోదల్చుకోలేదు. అది నా సెంటిమెంట్ కూడా. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. ఊహ తెలిశాక అమ్మ నా కళ్ల ముందే ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయింది. వాళ్ళు లేకపోయేసరికి అన్నా, నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం” అని చెప్తూ ఎమోషన్ అయ్యాడు చంటి.
“నేను కాస్త సెటిలయ్యాక , పెళ్లి చేసుకున్నాను. తర్వాత నాకు కూతురు పుట్టింది.. చిన్న పాపను నా చేతిలో పెట్టారు. నాకు ఎత్తుకోవాలన్నా భయం. ఆ పాపను చూసేసరికి నాకు కన్నీళ్లు ఆగలేదు. కింద టీ కొట్టు ఉంటే అక్కడికి వెళ్లి గంటన్నర ఏడ్చాను. మా అమ్మే మళ్ళీ మా ఇంటికి వచ్చింది. ఒక్కరిగా కాదు ఇద్దరిగా.. తల్లిదండ్రులు అందరికీ నేను చెప్పేది ఒక్కటే.. అడుక్కు తినండి కానీ, పిల్లలను రోడ్డు మీద వదిలేయకండి. తల్లిదండ్రులు లేని పిల్లల బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఓపిక లేకపోతే కనకండి. ఈ షో ద్వారా నేను చెప్పాలనుకుంది అదే” అంటూ చంటి ఎమోషనల్‌గా మాట్లాడేసరికి అందరూ కూడా ఎమోషనల్ అయ్యారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



