sridevi drama company: రంగస్థలం మహేష్ సినిమాల్లోకి రాకపోయి ఉంటే గేదెలు కాసుకునేవాడు
on Nov 17, 2025
.
శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama company)నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ ని సింగల్ పేరెంట్ స్పెషల్ గా డిజైన్ చేశారు. ఇక ఇందులో నటీనటులు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొచ్చి పాదాభిషేకం చేశారు. ఇక రంగస్థలం మహేష్(Ragasthalam Mahesh)వాళ్ళ అమ్మను తీసుకొచ్చి చిరు సత్కారం చేసి తల్లి గురించి చెప్పాడు. "ప్రపంచంలో మనం ఎవరి మీద కోప్పడ్డా వాళ్లంతా మనకు శత్రువులైపోతారు ఒక్క అమ్మ తప్ప. మనం కూడా ఎందుకు అమ్మ మీద కోప్పడతాం అంటే అమ్మ పెద్ద రియాక్ట్ అవ్వదు కాబట్టి అమాయకురాలు కాబట్టి." అని చెప్పాడు. "మీ కొడుకు గురించి రెండు మాటల్లో చెప్పండి..లేకపోతె తిట్టాలనుకుంటే తిట్టేయండి" అంటూ రష్మీ(Rashmi)అడిగింది. "నా కొడుకును ఎప్పుడూ తిట్టానండి. నా కొడుకు కస్టపడి పైకొచ్చాడండి. ఎప్పుడూ ఏమననండి." అని చెప్పింది.
తర్వాత పంచ్ ప్రసాద్(Punch Prasad)వచ్చి "సాధారణంగా నేను బాధపడను. మా అమ్మ విషయంలో నాకెందుకో తెలీకుండా ఫీలైపోతూ ఉంటాను. మా అమ్మ" అంటూ ఏమీ చెప్పలేక ఏడ్చేశాడు. ఇక ఈ షో ప్రోమో స్టార్టింగ్ లో మహేష్ వాళ్ళతో పంచ్ డైలాగ్స్ వేయించాడు రాంప్రసాద్. "అమ్మ ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీ..ఆమె రష్మీ. బ్యూటిఫుల్ యాంకర్" అని ఇంట్రడక్షన్ చెప్పాడు. రష్మీ ఆమెకు హలో అని చెప్పింది. వెంటనే రాంప్రసాద్ "రష్మీ గారు తెలుసా ఎలా తెలుసు మీకు" అని అడిగాడు. "ఇద్దరం కలిసి చదువుకున్నాం" అని ఫన్నీ ఆన్సర్ చెప్పేసరికి రష్మీ ముఖం మాడిపోయింది. "ఒకవేళ మహేష్ సినిమాలోకి రాకపోతే ఎం చేసేవాడు" అని రాంప్రసాద్ అడిగాడు. "గేదెలు కాసుకునేవాడు" అని చెప్పేసరికి మహేష్ కూడా నవ్వాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



