Illu illalu pillalu : గొలుసు తీసుకున్న అమూల్య.. రామరాజు ఆన్ ఫైర్!
on Nov 18, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -318 లో......అమూల్య కాలేజీకి వెళ్తుంటే విశ్వ వస్తాడు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమూల్య.. నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి అయినా సిద్ధం అని విశ్వ అంటాడు. మన కుటుంబాలు కలవాలని మాత్రమే ఇదంతా చేస్తున్నాను.. నా ప్రేమకి గుర్తుగా ఈ గొలుసు తీసుకోమని విశ్వ ఇస్తాడు. అమూల్య దాన్ని తీసుకొని విసిరేస్తుంది. నువ్వు విసిరేయోచ్చు కానీ నీక్కూడా నాపై ప్రేమ ఉందని చెప్పి విశ్వ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
విశ్వ వెళ్లినట్టే వెళ్ళి అక్కడే దాక్కొని చాటు నుండి అమూల్యని చూస్తాడు. అమూల్య ఆ గొలుసుని తీసుకుంటుంది. మరొకవైపు రామరాజు ఒకతని దగ్గరికి డబ్బు ఇవ్వడానికి వెళ్తాడు. అతను ఎవరో కాదు ధీరజ్ కార్ ఎక్కి బ్యాగ్ మర్చిపోయిన అతను. రామరాజు అతన్ని బాబాయ్ అంటూ ప్రేమగా మాట్లాడతాడు. నీ పిల్లలు ఎలా ఉన్నారని అతను అడుగుతాడు. అందరు బానే ఉన్నారు.. ఒక చిన్నోడే బాధ్యతగా ఉండడం లేదని రామరాజు చెప్తాడు. అవునా ఇందాక ఒకతని కార్ లో వచ్చాను.. ఆ అబ్బాయి తన భార్య కోసం చాలా కష్టపడుతున్నాడని అతని గురించి గొప్పగా చెప్తాడు. అతను ఎవరో కాదు ధీరజ్.. అదే సమయంలో ధీరజ్ అతని దగ్గరికి వచ్చి బ్యాగ్ ఇస్తాడు. రామరాజు ని చూసి షాక్ అవుతాడు. ఇంతవరకు చెప్పింది ఈ అబ్బాయి గురించేనని అతను ధీరజ్ ని చూపిస్తూ అంటాడు. ఇందులో ఇంత డబ్బు ఉంది నిజాయితీగా తీసుకొని వచ్చాడు. వీళ్ళ నాన్న పెద్ద హిట్లర్ అంట.. బొమ్మరిల్లు ఫాదర్ అంట.. ఆయన ఈ ఏజ్ లో కూడా తనకి నచ్చినట్టు ఉండమంటాడంట అని అతను చెప్తాడు. ఈ అబ్బాయి తన భార్యని పోలీస్ చెయ్యడానికి చాలా కష్టపడుతున్నాడని అతను చెప్పగానే రామరాజు షాక్ అవుతాడు. అబ్బా ఇరికించాడుగా అని ధీరజ్ అనుకుంటాడు.
ఆ తర్వాత రామరాజు ఇంటికి వచ్చి.. మీ నిర్ణయం మీరే తీసుకుంటారా అని ధీరజ్ పై కోప్పడతాడు. అందులో తప్పేముందని నర్మద, వేదవతి సపోర్ట్ చేస్తారు. అప్పడే శ్రీవల్లి ఎంట్రీ ఇచ్చి ప్రేమ జాబ్ చేస్తే ఇదివరకే మావయ్య గారి షర్ట్ ని వాళ్ళ పుట్టింటోళ్లు చింపారు కదా.. మరి ఇప్పుడు చేస్తే మరొకసారి గొడవ అవుతుందని శ్రీవల్లి అంటుంది. తరువాయి భాగంలో ప్రేమ పోలీస్ అవ్వడానికి వీలు లేదని రామరాజు అనగానే క్షమించండి నాన్న నేను నిర్ణయం తీసుకున్నానని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



