నాకు 44 ...రేపోమాపో పోతాను..ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకు గాలి, నీరు అవసరం
on Apr 2, 2025
అడవి అంటే చిన్నప్పుడు చెప్పుకున్న చందమామ కథలే గుర్తొస్తాయి.. అడవిలో ఉండే పక్షులు, పశువులు, జింకలు, లేళ్ళు, నెమళ్ళు, చిలకలు వాటి గురించి విన్నప్పుడు మనం కూడా అలా స్వేచ్ఛగా ఉంటె బాగుంటుంది కదా అని అనుకోని పిల్లలు, పెద్దలు ఎవరూ ఉండరు. కానీ ఇప్పుడు అలాంటి ఒక అడవి ఆపదలో పడింది. నెమళ్ళ హాహాకారాలు చేస్తున్న వీడియో చూస్తున్న గుండెలు పగిలిపోయేంత బాధాగా ప్రతీ ఒక్కరూ కన్నీళ్లు పెడుతున్నారు. అదే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నా విషయం మీద సినీ సెలబ్రిటీస్ అంతా గళం విప్పుతున్నారు. రష్మీ దీని గురించి మాట్లాడగా ఇప్పుడు రేణు దేశాయ్ చెప్పిన మాటలు వింటే ఉఫ్...ఎవరికైనా మనసు చలించక మానదు. "ఒక తల్లిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఎలాగో నా వయసు 44 ..రేపో మాపో పోతాను. కానీ నా పిల్లలు ఉన్నారు. వాళ్ళ లాంటి పిల్లలు ఎందరో ఉన్నారు.
వాళ్ళ భవిష్యత్తు చాలా ఉంది. ఆక్సిజన్, నీళ్లు చాలా అవసరం అవుతాయి. డెవలప్మెంట్ అవసరం లేదు అని చెప్పడం లేదు..చాల అవసరం. మనకు మన బిల్డింగ్స్ కావాలి, ఐటి పార్కులు కావాలి..వీలయితే ఈ ఒక్క 400 ఎకరాలు వదిలేయమని మీ రాష్ట్ర పౌరురాలిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మన దగ్గర చాలా బంజరు భూమి ఉంది డెవలప్ చేసుకోవడానికి. మీకు చెప్పేంత దాన్ని కాదు. మీరంతా ఎక్స్పర్ట్స్ ఇందులో. ఒక తల్లిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ముసలిదాన్ని ఐపోయాను. ఒక్కసారి మీరు మళ్ళీ దీని గురించి ఆలోచించండి. మనల్ని కాపాడుతున్న ఆ భూమి ఆ ఎకో సిస్టం ఎంతో అవసరం మనకు. మీరు మళ్ళీ మళ్ళీ ఒకసారి ఆలోచించండి. మంత్రులకు, నేతలకు మరొకసారి రిక్వెస్ట్ చేసి వేడుకుంటున్నాను...అది ఫాసిల్ ఐతే గనక ఆ భూమిని వదిలేయండి దయచేసి. మేమెప్పుడూ మీకు రుణపడి ఉంటాము." అంటూ రేణు దేశాయ్ ఎంతో హృదయవిదారకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి వేడుకుంటూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రిలీజ్ చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
