తెలంగాణ ప్రభుత్వానికి ఆ పశుపక్ష్యాదుల ఏడుపులు వినిపించడం లేదా ....ప్రశ్నించిన రష్మీ
on Apr 2, 2025
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ ఎంతలా వైరల్ అవుతోందో మనందరం చూస్తూనే ఉన్నాం. అక్కడ చనిపోతున్న పశువులు, పక్షుల హాహాకారాలు కూడా వింటూనే ఉన్నాం. దీనిపై ప్రకృతి ప్రేమికులు కూడా స్పందిస్తున్నారు. అలాగే రీసెంట్ గా యాంకర్ రష్మీ కూడా స్పందిస్తూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. "నేను డెవలప్మెంట్ కి విరుద్ధంగా ఈ వీడియోని పోస్ట్ చేయడం లేదు. హెచ్సియులో జరుగుతున్న పోరాటం గురించి అందరికీ తెలుసు. ఆల్ ఐస్ ఇన్ హెచ్సియు అని సోషల్ మీడియాలో చాలామంది పోస్ట్ చేస్తున్నారు.
నేనిప్పుడు కంఫర్టబుల్ గా నా అపార్ట్మెంట్ లో కూర్చుని ఈ వీడియో చేస్తున్నాను. ఐతే నాకు తెలుసు..ఈ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఎన్ని చెట్లను నరికేసి ఉంటారో అని ఎన్ని జంతువులకు హాని చేశారో అని. ఇక్కడ కూర్చుని నేను ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడం ఈజీనే. ఐతే నాకు ఈ యూనివర్సిటీ వివాదం ఏంటో లీగల్ గా ఇష్యూస్ ఏంటో నాకు అవగాహన లేదు. ఒక సామాన్య పౌరురాలిగా నేను రాత్రి డెవలప్మెంట్ వీడియో చూసాను అందులో ఎన్నో పక్షులు, మూగజీవాల ఏడుపులు చూసాను. అక్కడ నెమళ్ళు, లేళ్ళు, పక్షులే కాకుండా ఆ అడవిని అంటి పెట్టుకుని ఎన్నో జీవజాతులు నివసిస్తున్నాయి. అసలు ఎండాకాలం ఇలాంటి సమయంలో మనం కూడా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాటి ఇంటి నుంచి వాటినే తరిమేయడం ఎంతవరకు న్యాయం. ఒకసారి మీరే ఆలోచించండి. వాటికి పునరావాసం కల్పించే శక్తిసామర్ద్యాలు ఉన్నది మీ ఒక్కరికే సర్. మీరు ఆ పశుపక్ష్యాదులను దృష్టిలో పెట్టుకుని ఒక పాజిటివ్ అప్ప్రోచ్ తో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అంటూ బాధాతప్త హృదయంతో చెప్పింది రష్మీ.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
