ఏదో ఒక దినంలే.. అడ్జస్ట్ ఐపో!
on Oct 17, 2022

"ఆది హ్యాపీ బర్త్ డే" అనే కాన్సెప్ట్ తో ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఫుల్ ఎంటర్టైన్ చేసింది. సగం షో పంచ్ డైలాగ్స్ తో సరిపోయింది. ఇక రష్మీ ఎంట్రీ ఇచ్చి "ఆది గారు హ్యాపీ జనందినం" అని విష్ చేసేసరికి షాకైపోయాడు. "జనందినమా ఇంకా నా దినం అనలేదు..అది జనందినం కాదు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పాలి. తెలుగు పలకడం రాకపోతే ఇంగ్లీష్ లో హ్యాపీ బర్త్ డే" అనొచ్చుగా అనేసరికి "సర్లే..ఏదో ఒక దినం ఉంది కదా..అడ్జస్ట్ ఐపో" అంది రష్మీ.
" మీ బర్త్ డే అంత స్పెషలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు" అని రష్మీ అడిగేసరికి "లీప్ ఇయర్ తల్లి..నా పుట్టిన రోజు నాలుగేళ్లకు ఒకసారి వస్తుంది" అన్నాడు ఆది. ఇక ఈ వారం షోలో అందరూ వెరైటీగా సాంగ్స్ పాడారు. ఇక కండక్టర్ ఝాన్సీ, నెల్లూరు కవిత వచ్చి డాన్స్ అద్దిరిపోయేలా చేశారు. నాటీ నరేష్ తో, హైపర్ ఆదితో కూడా మాస్ స్టెప్స్ వేయించేశారు ఈ ఇద్దరూ. ఇక పటాస్ ప్రవీణ్ లైఫ్ స్టోరీని ఈ షోలో ఒక స్కిట్ గా వేసి అందరి చేత కన్నీళ్లు పెట్టించారు. ఇక ఇంద్రజ మాట్లాడుతూ "ప్రవీణ్ కి నేనెప్పుడూ ఒక తల్లిలా ఉంటాను" అని చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



