‘నాకు మా అమ్మంటే చాలా ఇష్టం’.. ఆది ఎమోషనల్ యాంగిల్!
on Oct 17, 2022

బుల్లితెర మీద హైపర్ ఆది అందరినీ నవ్విస్తుంటాడు, ఆట పట్టిస్తుంటాడు. కౌంటర్లు, పంచులు, సెటైర్లతో అందరినీ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాడు. ఐతే ఇక్కడ ఒకటి గమనిస్తే అందరూ తమ తమ పర్సనల్ లైఫ్ ఈ స్టేజి మీద షేర్ చేసుకుంటారు కానీ ఆది ఎప్పుడూ తన పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోడు. గతంలో తన ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పాడు. కానీ ఇప్పుడు తన ఫామిలీ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు. బాగా ఎమోషనల్ కూడా అయ్యాడు. స్టేజి మీదే ఏడ్చేశాడు. ఆది తన బాధను అందరి ముందు వినిపించి అందరినీ ఏడిపించేశాడు. దీపావళి పండగ వస్తున్న నేపథ్యంలో మల్లెమాల ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. "ఇది కదా పండుగంటే" అనే ఈవెంట్లో సంగీత, యాంకర్ రవి, రష్మీ, జబర్దస్త్ టీం అంతా వచ్చారు. రష్మీ మాట్లాడుతూ హైపర్ ఆది కోసం ఒక సర్ప్రైజ్ ఉంది అంటూ ఒక వీడియో ప్లే చేసి చూపించింది.
అందులో ఆది వాళ్ల అమ్మ మాట్లాడుతూ "అక్కడికి రావాలని ఉంది నాకు .. కానీ నేను రాలేను.. ఎక్కువ సేపు నిల్చోలేను.. మోకాళ్ల నొప్పులు" అంటూ ఆది వాళ్ల అమ్మ చెప్పేసరికి దానికి ఆది "నాకు మా అమ్మంటే చాలా ఇష్టం" అని చెప్తూ కన్నీరు పెట్టేసుకున్నాడు. ఇక ఈ షోలో అమరదీప్, తేజు ఇద్దరూ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి లవ్ ప్రొపోజ్ చేసుకున్నారు. "బాగా ప్రొపోజ్ చేసావ్ అమర్..ఇంటికి వెళ్లి నేను కూడా మా ఆయన్ని అడగాలి ఇలాగే ప్రొపోజ్ చేయమని" అంది సంగీత. తర్వాత యశస్వి సింగింగ్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఆది, పోసాని కృష్ణమురళి ఇద్దరూ కలిసి "టెంపర్" మూవీలో పోలీస్ సీన్ ని స్పూఫ్ గా చేసి పంచ్ డైలాగ్స్ తో ఎంటర్టైన్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



