Brahmamudi : రిపోర్ట్స్ చూసి దుగ్గిరాల కుటుంబం షాక్.. కావ్య ఎమోషనల్!
on Jan 24, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -937 లో....రిపోర్ట్స్ లో ఏం వస్తాయోనని ఇంట్లో అంత టెన్షన్ పడుతుంటే కావ్య పాపతో ముచ్చట్లు పెడుతుంది. ఏంటి కావ్య మేం అంత ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రం కూల్ గా ఉన్నావని ఇందిరాదేవి అంటుంది. నాకెందుకు టెన్షన్.. రిపోర్ట్స్ లో ఏం వస్తుందో నాకు తెలుసు కదా అని కావ్య అంటుంది. ఈ టెన్షన్ నా వాళ్ల కాదు.. ఒరేయ్ డాక్టర్ ఫోన్ చేసి అడగమని ఇందిరాదేవి అనగానే డాక్టర్ కి రాజ్ ఫోన్ చేస్తాడు. కాసేపటికి డాక్టర్ రిపోర్ట్స్ పంపిస్తాడు. అవి చూసి రాజ్ షాక్ అవుతాడు. కళ్యాణ్ ఫోన్ తీసుకొని చూస్తాడు. తను కూడా షాక్ అవుతాడు.
రిపోర్ట్స్ లో ఏం వచ్చిందని సుభాష్ అడుగగా పాప మా బిడ్డ అన్నట్లుగానే వచ్చిందని రాజ్ అంటాడు. దాంతో ఇంట్లో అందరు షాక్ అవుతారు. నో అంటూ కావ్య గట్టిగా అరుస్తుంది. ఇప్పటికైనా బిడ్డని దగ్గరికి తీసుకొని నీలోని మమకారం బయటకు తియ్ అని అపర్ణ అంటుంది. మీరు ఎన్ని రిపోర్ట్స్ తీసుకొని వచ్చినా నేను ఇలాగే ఉంటాను.. తను నా బిడ్డ కానే కాదని కావ్య చెప్తుంది. మరొకవైపు మినిస్టర్ ఇంటికి రుద్రాణి వెళ్తుంది. కంగ్రాట్స్ అండి రిపోర్ట్స్ మార్చారు. ఇక కావ్యకి బిడ్డ గురించి తెలిసే ఛాన్స్ లేదు. రాను రాను తన దగ్గర ఉన్న బిడ్డ ఆరోగ్యం బాలేక దూరం అవుతుంది. దాంతో ఆ కావ్య పిచ్చిది అవుతుంది. నా పగ చల్లారుతుందని రుద్రాణి అనగానే మినిస్టర్ డల్ అవుతాడు. మీరేం బాధపడకుండి.. మీ భార్య మీరు పాపతో హ్యాపీగా ఉంటారని రుద్రాణి అనగానే ఇదంతా మీ వల్లే.. మీకు ఏం చేసినా తక్కువే అని మినిస్టర్ అంటాడు. నాకు హెల్ప్ కావలన్నప్పుడు తప్పక అడుగుతానని రుద్రాణి చెప్పి వెళ్తుంది. రుద్రాణిని తులసి చూస్తుంది.
ఏవండి ఆవిడ మన ఇంటికి తరచు వస్తుంది.. ఎందుకని తన భర్తని అడుగుతుంది. మనం ఈ రోజు హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం ఆవిడే అని మినిస్టర్ అనగానే అంతగా ఏం చేసిందని తులసి అనగానే తర్వాత చెప్తానని మినిస్టర్ కవర్ చేస్తాడు. మరొకవైపు కావ్య దగ్గరికి రాజ్ వచ్చి.. మనపై పగతో బిడ్డని ఎందుకు మారుస్తారు. బిడ్డని దూరం చేస్తారు కానీ నువ్వు అవేం ఆలోచించకుండా బిడ్డని ఒప్పుకోమని రాజ్ రిక్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత బిడ్డని పట్టుకొని కావ్య దేవుడికి మొక్కుతూ బాధపడుతుంది. నా బిడ్డని కనిపెట్టే దారి చూపించు దేవుడా అని కావ్య ఏడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



