Podharillu : హాస్పిటల్ లో ఉన్న వాళ్ళ నాన్నని చూడటానికి వెళ్ళిన మహా!
on Jan 24, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -35 లో.....మహా వాష్ రూమ్ కి వెళ్తుందని మాధవ వాష్ రూమ్ ని నీట్ గా పెట్టి ఎవరు వెళ్లకుండా కాపలా ఉంటాడు. అప్పుడే కన్నా వచ్చి నేను వెళ్తానని అంటాడు. వద్దని మాధవ అంటాడు. అంతలోనే చక్రి వచ్చి బాత్రూంలోకి దూరిపోతాడు. ఆ తర్వాత కాసేపటికి మహా స్నానానికి వెళ్తుంటే చక్రి ఆపి లోపల కన్నా ఉన్నాడని చెప్తాడు. ఉంటే ఏంటి ఇంకొక వాష్ రూమ్ లేదా అని మహా అంటుంది. లేదని చక్రి అనగానే సరే వెయిట్ చేస్తానని మహా అంటుంది.
మహా బయట వెయిట్ చేస్తుందని కన్నాకి తెలిసి ఒంటికి సబ్బు ఉన్నా సరే అలాగే బయటకి వస్తాడు. మహా వెళ్లి స్నానం చేసి బయటకి వస్తుంది. వాషింగ్ మెషిన్ ఎక్కడ అని చక్రిని అడుగుతుంది. లేదని చెప్తాడు. నేను పిండేస్తానని చక్రి అనగానే వద్దు నేను పిండేస్తానని మహా అంటుంది. తనకి వాటర్ తీసుకొని వచ్చి ఇస్తాడు. ఈ పని అయ్యాక హాస్టల్ చూడాలని మహా అంటుంది. నాకు మా వాళ్ళతో మాట్లాడాలని ఉంది. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని చక్రి దగ్గర ఫోన్ తీసుకొని మహా వాళ్ళ వదిన హారికకి ఫోన్ చేస్తుంది. ఎందుకు ఇలాంటి పని చేసావ్.. ఎంతపెద్ద తప్పు చేసావో.. నీకు అర్థం అవుతుందా అని హారిక అంటుంది. అదంతా నీకు తర్వాత చెప్తాను వదిన అని మహా అంటుంది. నాన్న వాళ్లు ఎలా ఉన్నారని మహా అనగానే నువ్వు అలా చేసావని మావయ్య ప్రాణం తీసుకోబోయారు.. ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్నారని చెప్పగానే మహా ఏడుస్తుంది.
మాధవ వాళ్ళు వచ్చి.. ఏమైందని అడుగుతారు. మా నాన్న ప్రాణం తీసుకోవాలనుకున్నారంట.. హాస్పిటల్ లో ఉన్నారట అని మహా ఏడుస్తుంది. మరొకవైపు నారాయణ టీ షాప్ దగ్గర ఆగి.. నా ఇంటికి గొప్పింటి కోడలు వచ్చిందని గొప్పగా చెప్తుంటాడు. ఆ తర్వాత నేను వెంటనే మా నాన్నని చూడాలని మహా అనగానే ఒరేయ్ చక్రి తనని తీసుకొని వెళ్ళు అని మాధవ అంటాడు. మహాని చక్రి తీసుకొని బయల్దేరతాడు. దాంతో మహాని చూసిన అందరు నిన్ననే వచ్చింది.. ఈ రోజు వెళ్ళిపోతుందనుకుంటారు. ఒకతను టీ షాప్ దగ్గరికి వెళ్లి.. నిన్న వచ్చింది నీ కోడలు.. మీ గురించి తెలిసి వెళ్ళిపోతుందంటూ నవ్వుతుంటే నారాయణ అవమానంగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



