
నేహా చౌదరి(Neha Chowdary) గురించి చెప్పాలంటే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనే పేరు తెచ్చుకుంది. స్పోర్ట్స్ యాంకర్, యోగ, జిమ్ ట్రైనర్ కూడా. బిగ్ బాస్ 6 లో ఎంట్రీ ఇచ్చింది. టాస్కులు ఆడింది. ఇక ఫినాలే టైంకి ఎన్నో ఏళ్ళ నుంచి ప్రేమించిన తన స్నేహితుడిని పెళ్లి చేసుకుంది. పెళ్ళికి ముందు బిగ్ బాస్ కి పెళ్లి కూతురు గెటప్ లో వచ్చి అందరినీ ఇన్వైట్ చేసి మరీ వెళ్ళింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఇద్దరి మధ్య పొసగలేదు. దాంతో ఎవరికీ వారు వేరయ్యారు.
సోషల్ మీడియాలో ఒక్కసారిగా తన భర్తకు సంబందించిన సమాచారాన్ని తీసేసరికి అందరికీ అనుమానం వచ్చింది. కానీ నేహా మాత్రం పెద్దగా స్పందించలేదు. కొన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండి మళ్ళీ ఫ్రెష్ గా సోషల్ మీడియాలో తన డీటెయిల్స్ తన వీడియోస్ ని షేర్ చేస్తూ చిల్ అవుతోంది. ఇక విశ్వతో కలిసి బిబి జోడిలో పార్టిసిపేట్ చేస్తోంది. వ్యాపకంగా తన జీవనానుభవాలతో 'ప్రేమ లేదని ప్రేమించరాదని' అనే ఒక పుస్తకాన్ని రాసినట్టు కూడా చెప్పింది. ఇక ఇప్పుడు ఆ పుస్తకం బయటకు వచ్చేసింది. (Prema Ledani Premincharadani Book)
"నిజం చెప్పాలంటే ఈ పుస్తకం రాస్తున్నప్పటి నుంచి ఇది బయటికొస్తుందా లేదా అని భయం, డౌట్స్ చాలా ఉండేవి. కానీ ఈ రోజు నా ముందున్న ఈ పుస్తకాల గుట్ట చూస్తుంటే కల నిజమైందనిపిస్తుంది. ప్రి ఆర్డర్ చేసిన మీ అందరికీ సైన్ చేసి పంపించబోతున్న ఈ క్షణం నా జీవితంలో ట్రూలీ మ్యాజికల్ మూమెంట్ . ఈ ప్రేమ ఈ నమ్మకం మీ వల్లే అందరికీ నా హృదయపూర్వకంగా థాంక్యూ సో సో మచ్ " అంటూ చెప్పింది నేహా చౌదరి.
ఈ సైన్ చేస్తున్న వీడియోని అలాగే ఈ బుక్స్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. బుల్లితెరపై కనిపించేవాళ్లంతా కూడా విషెస్ చెప్తున్నారు. నాగ మణికంఠ మెసేజ్ ఇచ్చాడు. "ఈ పుస్తకం చాలా ఎమోషనల్ గా ఉంది. ఆల్రెడీ రెండో సారి చదువుతున్నా. చాలా డెప్త్ ఉంది అలాగే హార్ట్ టచింగ్ గా ఉంది. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా. " అన్నాడు.







