Home

»

Tv News

Podarillu : చక్రి అబద్ధాలు చెప్పాడని తెలుసుకున్న మహా.. ఇంట్లోంచి వెళ్ళిపోతుందా!

Mar 03, 2026

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podarillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -61 లో....మాధవ తను ఆర్కెటిక్ కాదని మహాకి చెప్పగానే తను షాక్ అవుతుంది. వెంటనే కోపంతో చక్రి దగ్గరికి వచ్చి అడుగుతుంది. ఇంకా తనకి నిజం తెలియలేదని అబద్ధం చెప్పాలని ట్రై చేస్తాడు.‌నాకు నిజం తెలిసింది మీ అన్నయ్య ఆర్కెటిక్ కాదని మహ చెప్తుంది. ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్పావని మహా కోప్పడుతుంది. జాబ్ ఉంది ఇంటర్వ్యూ అన్నావని మహా అనగానే మా అన్నయ్య ఇంటర్వ్యూ అరెంజ్ చేసాడనేది అబద్ధం కానీ ఇంటర్వ్యూ మాత్రం నిజం అని చక్రి అనగానే అయితే ఇంటర్వ్యూ ఏమైందని మహా అంటుంది. మీకు నా మీద నమ్మకం లేదు కదా ఆగండి మా ఫ్రెండ్ కి ఫోన్ చేస్తానని ఫోన్ ని స్పీకర్ లో పెడతాడు.


ఎంట్రా ఫేక్ ఇంటర్వ్యూ అని తెలిసిపోయిందా వాళ్ళ ఫ్రెండ్ చక్రితో అనగానే అది కూడా అబద్ధమని మహాకి అర్థమవుతుంది. దాంతో కోపంగా ఆటో ఎక్కి వెళ్తుంది. ఆ తర్వాత మాధవ, కేశవ ఇద్దరు మహా గురించి టెన్షన్ పడతారు. ఎంతసేపు అయినా మహ ఇంటికి రాదు. అప్పుడే చక్రి వస్తాడు. మహా రాలేదని తెలియగానే తనని వెతకడానికి వెళ్తాడు చక్రి. మరొకవైపు మహా గుడికి వెళ్తుంది. అక్కడికి తాయారు వస్తుంది. మహా కోపంగా ఉండడం.... చక్రి ఫోన్ చేస్తే ఫోన్ కట్ చెయ్యడం గమనించిన తాయారు.. ఏమైంది అమ్మ.. గొడవ అయిందా అని ఆరా తీస్తుంది. ఆ  కుటుంబం గురించి నీకు తెలియదని నారాయణ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతుంది. ఆ నారాయణ పెళ్ళాన్ని చంపాడని తాయారు అనగానే మహా షాక్ అవుతుంది.

ఏంటి మీరు అనేది మీ అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడుతున్నారని మహా అంటుంది. తాయారు అక్కడ నుండి వెళ్ళిపోయాక మహాని వెతుకుంటూ చక్రి వస్తాడు. ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు. ఎంత టెన్షన్ పడుతున్నామోనని చక్రి అంటాడు. అప్పుడే కన్నా వస్తాడు. అన్నయ్య వదిన కన్పించగానే చెప్పాలి కదా టెన్షన్ పడుతున్నామని కన్నా అంటాడు. వదిన అన్నయ్యతో వస్తారా నాతో వస్తారా అని కన్నా అనగానే పదరా అంటూ కన్నాతో ఇంటికి వెళ్తుంది మహా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com