
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 డే 58 ఎవిక్షన్ పవర్ ను హౌస్ మేట్స్ కు ఇవ్వడంపై ప్రముఖ కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ ఘాటుగా స్పందించాడు. తన ఇన్ స్టాలో "final part" అంటూ రియాక్షన్ వీడియోను షేర్ చేశాడు. టీవీలో బిగ్ బాస్ ఎపిసోడ్ నడుస్తుండగా ముందు కూర్చొని తెలుగులో ఎమోషనల్ గా మాట్లాడాడు. బిగ్ బాస్ టీమ్ ఇచ్చిన ఎవిక్షన్ పవర్ ట్విస్ట్ ను తప్పుబడుతూ చేతులతో ఎక్స్ ప్రెషన్స్ తో వివరించాడు.
వీడియోలో నటరాజ్ మాస్టర్ తన అభిప్రాయం చెప్పాడు.ఆడియన్స్ ఓట్లతో కాకుండా కంటెస్టెంట్స్ చేతిలో ఎలిమినేషన్ పెట్టడం అన్యాయం అని అన్నాడు. ముఖ్యంగా రోహిత్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను టార్గెట్ చేసి బయటకు పంపించారని ఆరోపించాడు. వీడియో కింద భాగంలో రోహిత్ తో పాటు మరో ఇద్దరు కంటెస్టెంట్స్ ఫోటోను పెట్టి, హౌస్ లో గ్రూపిజం నడుస్తోందని హింట్ ఇచ్చాడు.
రోహిత్ ఎలిమినేషన్ వెనుక త్రిగుణ్, అమన్ లాంటి వాళ్ల పాత్ర ఉందని, కావాలనే గ్రూప్ గా ఓట్లు వేసి బయటకు పంపించారని నటరాజ్ మాస్టర్ ఫైర్ అయ్యాడు. ఆడియన్స్ తో సంబంధం లేకుండా ఇంట్లో వాళ్ల ఇష్టానుసారం ఎలిమినేషన్ చేస్తే షోకు అర్థం ఏముంటుందని ప్రశ్నించాడు. ఫైనల్ పార్ట్ అంటూ పెట్టిన ఈ వీడియోలో చివర్లో సీట్లోంచి లేచి వెళ్లిపోతూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.ప్రస్తుతం నటరాజ్ మాస్టర్ పెట్టిన ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోహిత్ ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు, ఇది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న గ్రూప్ రాజకీయాల వల్లే రోహిత్ బలయ్యాడని నెటిజన్లు కూడా నటరాజ్ మాటలను సమర్థిస్తున్నారు.





.webp)
