.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 నుంచి రోహిత్ ఎలిమినేషన్ నన్ను నిజంగా షాక్ కు గురిచేసింది. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదంటూ మాజీ విన్నర్ కౌశల్ మండా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. బిగ్ బాస్ హిస్టరీలో కంటెస్టెంట్స్ తమ ఓట్లతో మరో కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయడమనేది చాలా అరుదుగా జరిగే విషయమని అన్నాడు. ఒకవేళ ఇలాంటి రూల్ తన సీజన్ 2 లో ఉండి ఉంటే, తనకు వ్యతిరేకంగా చాలామంది ఉండటంతో తనే మొదట బయటకు వెళ్లిపోయేవాడినని కౌశల్ చెప్పుకొచ్చాడు.
రోహిత్ కు కౌశల్ స్ట్రాంగ్ అడ్వైజ్ కూడా ఇచ్చాడు. నువ్వు ఎప్పుడూ గ్రీన్ లేదా ఎల్లో జోన్ లోనే ఉండాలని, రెడ్ జోన్ లోకి అస్సలు వెళ్లకూడదని హితవు పలికాడు. ఇతర కంటెస్టెంట్స్ నిన్ను బయటకు పంపించే అవకాశం ఎప్పుడూ ఇవ్వకూడదు.. నీ ఎఫర్ట్స్ అన్నీ ఆడియన్స్ ద్వారా నీ పొజిషన్ ను సెక్యూర్ చేసుకోవడం మీదే పెట్టాలని సూచించాడు. ఇది రోహిత్ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమని అన్నాడు. రోహిత్ సెండాఫ్ సమయంలో త్రిగుణ్ ప్రవర్తన తనకు అస్సలు నచ్చలేదని కౌశల్ ఓపెన్ గా విమర్శించాడు. ఆ మూమెంట్ ను త్రిగుణ్ రిజెక్ట్ చేసిన విధానం చాలా నిరాశపరిచిందని, కనీస స్పోర్ట్స్ మ్యాన్ షిప్ కూడా లేదని మండిపడ్డాడు. రోహిత్ కు సెండాఫ్ ఇచ్చే సమయంలో త్రిగుణ్ అలా ప్రవర్తించడం సరికాదని తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
రోహిత్ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అని కౌశల్ తేల్చి చెప్పాడు. ఒకవేళ కేవలం ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే జర్నీ కొనసాగి ఉంటే, రోహిత్ ఖచ్చితంగా టాప్-2 కి వెళ్లేవాడని, టైటిల్ గెలిచే పొటెన్షియల్ కూడా ఉందని తను బలంగా నమ్ముతున్నానని అన్నాడు. దురదృష్టవశాత్తు గేమ్ ఇలా ముగిసింది. అయినా బిగ్ బాస్ అనేది జీవితంలో ఒక చాప్టర్ మాత్రమే.. నీ జర్నీకి ముగింపు కాదంటూ రోహిత్ కు ఆల్ ది బెస్ట్ చెప్పి, తల ఎత్తుకుని ముందుకు సాగాలని కౌశల్ ధైర్యం చెప్పాడు.





.webp)
