Home

»

Tv News

Podharillu : పోలీస్ స్టేషన్‌కి ఆ నలుగురు.. మహా విడిపిస్తుందా!

Mar 12, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -68 లో..... మాధవని పురుషోత్తం కొట్టడాని తెలుసుకుంటారు చక్రి, కేశవ. ఇక పురుషోత్తం ఇంటికి కేశవ, చక్రి ఇద్దరు కలిసి మాధవని తీసుకొని గొడవకి వెళ్తారు. ఏంట్రా మేం లేని టైమ్ లో మా అన్న పైకి గొడవకి వచ్చారు. కొంచెం కూడా సిగ్గు లేదారా అని పురుషోత్తంపై చక్రి విరుచుకుపడుతాడు. వచ్చింది మీ కూతురు.. మా అన్నయ్య ఏమైనా గోడదూకి మీ ఇంట్లోకి వచ్చాడా అని కేశవ అంటాడు. ఇప్పుడు వాడిని నువ్వు కొట్టు అన్నయ్య అని మాధవతో చక్రి కేశవ అంటారు. వద్దురా గొడవ ఎందుకు అని మాధవ అంటాడు. ఇంకొకసారి మా జోలికి వస్తే చంపేస్తానని చక్రి, కేశవ ఇద్దరు వాళ్లకి వార్నింగ్ ఇస్తారు.

ఆ తర్వాత కేశవ, చక్రి, మాధవ ఇంటికి వెళ్తారు. ఎందుకు రా ఇవన్నీ గొడవలు అని మాధవ అంటుంటే.. నీ తప్పు ఏముంది పెద్ది.‌. అనవసరంగా నిన్ను కొట్టారని మహా అంటుంది. అప్పుడే తాయారు, పురుషోత్తం ఇద్దరు కలిసి పోలీసులని తీసుకొని వస్తారు. ఈ నలుగురినే మీరు అరెస్ట్ చెయ్యాలి.. ఆ మాధవ గాడు నా కూతురితో మిస్ బెహేవ్ చేసాడని పురుషోత్తం అంటాడు. అయ్యో అలా అంటారేంటి.. మీ కూతురే కదా వచ్చిందని మహా అంటుంది. ముందు ఈ నలుగురిని అరెస్ట్ చెయ్యండి.. వీళ్ళతో మాకు ప్రాణహాని ఉందని తాయారు అంటుంది. కన్నా గాడు ఇప్పుడే వచ్చాడు కదా.. వాడికి గొడవ అయినా విషయమే తెలియదు కదా అని మహా అంటుంది. అయినా వినకుండా నలుగురుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. కేశవని చూసి ఆ అబ్బాయిని ఎక్కడో చూసానని శైలు వాళ్ళ నాన్న అనుకుంటాడు ఏమైందని అక్కడున్న వాళ్ళని అడుగుతాడు. అతను మెకానిక్.. పక్క సందులో షాప్ ఉంటుంది. వాళ్ళ అత్త వాళ్లపై ఎటాక్ చేశారట అని అతను శైలు వాళ్ళ నాన్నతో చెప్తాడు.

ఆ తర్వాత తాయారు ఇంటికి గొడవకి వెళ్తే తన వెనకాలే మహా వెళ్తుంది. నా కొడుకులు నా ఇంటికి రాకుంటే మీ సంగతి చెప్తానని వార్నింగ్ ఇస్తాడు వాళ్ళ నాన్న.  కిటికీలోనుండి గాయత్రిని చూసి మహా దగ్గరికి వెళ్తుంది. నన్ను లోపల ఉంచి తాళం వేసారు అంటుంది. నీ దగ్గర ఫోన్ ఉంది కదా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫోన్ చేస్తాను జరిగింది చెప్పమని మహా చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత మహా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com