
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-214 లో.. గంగ, రుద్ర, శకుంతల, వీరు, ప్రమీల, సూర్య, వంశీ అందరు కలిసి ఒక రెసార్ట్ కి వెళ్తారు. అక్కడ వాళ్ళంతా హోలీ సెలెబ్రేషన్స్ చేసుకుంటారు. గంగ, రుద్ర హోలీ ఆడుకుంటూ ఉండగా మొదటగా వీరు కత్తితో వెళ్తాడు. అప్పుడే అక్కడికి ప్రీతి రావడంతో వీరు ఆగిపోతాడు. ఆ తర్వాత ఇషిక పంపిన రౌడీలు వస్తారు. రుద్ర, వీరులని లాక్ చేస్తారు రౌడీలు.
ఇక ఆ రుద్రని రౌడీలు కొట్టబోతుంటే అప్పుడే గంగ తన బాక్సింగ్ ని బయటకి తీస్తుంది. ఒక్కో రౌడీని తన పంచులతో కిందపడేస్తుంది. ఇక ఇషిక పంపిన వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు. దాని తర్వాత అందరు గంగని పొగుడుతారు. సూపర్ గంగ.. నీలోని బాక్సింగ్ స్కిల్స్ ని ఈ రకంగా మాకు చూపించావ్.. సూపర్ అంటూ పెద్దసారు అంటాడు. చెల్లి.. నువ్వు సూపర్.. నన్ను కొట్టిన పంచ్ కంటే గట్టిగానే తగిలించావ్ వాళ్ళకి అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నీలాంటి వాళ్ళు ఉంటే మాకు ధైర్యంగా ఉంటుందని ఒక్కొక్కరు చెప్తారు. బావ మత్తులో ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకుంటే వాళ్ళని తుక్కురేగ్గొట్టేవాడు అని గంగ వాళ్ళ అన్నయ్య అంటాడు. నేను మత్తులో లేను అని రుద్ర అంటాడు. దాంతో అందరు షాక్ అవుతారు.
గంగలోని బాక్సింగ్ స్కిల్స్ ని మీ అందరికి చూపించడం కోసమే నేను ఇలా మత్తులో ఉన్నట్టుగా యాక్ట్ చేశానని రుద్ర అనగానే నువ్వు సూపర్ బావ.. నీలో బాక్సర్ ఏ కాదు మంచి యాక్టర్ కూడా ఉన్నాడని గంగ వాళ్ళ అన్నయ్య అంటాడు. పదండి అందరం ఇంటికి వెళదామని శకుంతల అనగానే అందరు వెళ్తారు. ఏంటి ఇషిక అంత కంగారుగా ఉన్నావని గంగ అనగానే ఇంత గొడవ జరిగితే కంగారు ఉండదా అని ఇషిక అంటుంది. వీరు బావకి కూడా భయం వేసినట్టుందని రుద్ర అనగానే అవునని వీరు అంటాడు. ఇక వీరు, ఇషిక వెళ్ళిపోయాక గంగ, రుద్ర మాట్లాడుకుంటారు. నాకు ఎందుకో ఇది వీరు పనిలా అనిపిస్తుందని గంగ అనగానే కచ్చితంగా వీరు పనే ఇది.. ఇకనుండి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని గంగతో రుద్ర అంటాడు. ఇక ఇంటికి వెళ్ళాక అందరు ఆ గొడవ గురించి డిస్కస్ చేస్తుంటారు. వాళ్ళు కావాలనే గొడవకి వచ్చినట్టున్నారని పెద్దసారు అనగానే వాళ్ళెవరో ఆకతాయలు మామయ్య..వదిలేయండి అని వీరు అంటాడు. లేదు పెద్దోరు.. వాళ్ళు కావాలనే గొడవ చేశారు.. ఎందుకంటే వాళ్ళ దగ్గర కత్తులు చూసానని గంగ అంటుంది. అయితే ఇది కచ్చితంగా కుట్రనే అని పెద్దసారు అంటాడు. దాంతో ఇషిక, వీరు టెన్షన్ పడతారు. మరి రుద్ర వీరు, ఇషికలని ఇరికిస్తాడా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







