Home

»

Tv News

Bigg Boss 10 Telugu: ఆమె కప్పు కొట్టడానికి రాలేదు..వర్షిణి, ముఖేష్ లపై ఫైర్ అయిన సుధీర్!

Nov 4, 2026 8:57AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో 9వ వారం నామినేషన్స్ తో హౌస్ లో పెద్ద రచ్చ జరిగింది.సుధీర్ తన సొంత గ్రూప్ పైనే తిరగబడ్డాడు.నామినేషన్ ప్రక్రియలో ముఖేష్ హద్దులు దాటి దేబ్జానీపై వ్యక్తిగత విమర్శలు చేశాడు. దేబ్జానీ అలయెన్స్ లో తిరుగుతున్నాడంటూ శివ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో శివ కూడా ఫైర్ అయ్యాడు. ఇది గమనించిన సుధీర్ తన ఫ్రెండ్ తప్పు చేస్తే తప్పు అని చెప్పాలనే ఉద్దేశంతో ముఖేష్ గ్రూప్ నుంచి బయటకు వచ్చేశాడు. నరేష్ తో సుధీర్.. నేను ఎన్నిసార్లు చెప్పాను మాటలు వదలకు బ్రో అని, ప్రొవోక్ అవ్వకు కంట్రోల్ అని వెనుక నుంచి చెప్తూనే ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

 

అంతేకాదు వర్షిణి తీరుపై కూడా సుధీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఆమె కప్పు కొట్టడానికి రాలేదు, ఉన్నన్ని రోజులు అలా ఉందాం అన్నట్టుగా వచ్చిందంటూ వర్షిణిని ఉద్దేశించి కామెంట్ చేశాడు. ముఖేష్ తనను నమ్మిన ఫ్యాన్స్ కోసం ఏదో ఒకటి చేయాలని కష్టపడుతుంటే, వర్షిణి మాత్రం కప్పు కోసం సీరియస్ గా లేదని సుధీర్ ఆరోపించాడు. ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో చూడాలని నరేష్ తో చెప్పాడు. ఈ మాటలు విన్న వర్షిణి.. సుధీర్ ఏంటి అలా అన్నాడంటూ షాక్ అయింది. దీనికి ముఖేష్.. అందరి ముందే చెప్పాడు కదా ఇండివిడ్యువల్ గా ఆడతానని, భయంగా ఉందంటే ఏం చేస్తామంటూ సుధీర్ పై కౌంటర్ వేశాడు.

 

ఇదిలా ఉంటే ముఖేష్, వర్షిణిల మధ్య కూడా చిన్న గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోంది. సుధీర్ గురించి వర్షిణి ముఖేష్ తో.. వాడు వాడు సేఫ్ జోన్ చూసుకుంటున్నాడు, శివ్ వచ్చి నన్ను అడుగుతున్నాడంటూ చెప్పింది. అసలు ఏం మాట్లాడుతున్నామో వర్షిణికి కొంచెమైనా అవగాహన ఉందా అని సుధీర్ ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. గతంలో ముఖేష్ తన రెసరెక్షన్ పవర్ తో సుధీర్ ను కాపాడాడు. ఇప్పుడు అదే సుధీర్ తమ గ్రూప్ నుంచి విడిపోవడం ముఖేష్ కు పెద్ద దెబ్బగా మారింది.మొత్తానికి 9వ వారం నామినేషన్స్ లో ముఖేష్, వర్షిణి ప్రధాన టార్గెట్ అయ్యారు. వంశీ, శివ్, త్రిగుణ్, నరేష్, రామ్ ప్రసాద్ అందరూ వారినే నామినేట్ చేశారు. సుధీర్ లాంటి క్లోజ్ ఫ్రెండ్ కూడా దూరం కావడంతో ముఖేష్ గ్రూప్ పూర్తిగా వీక్ అయినట్లు కనిపిస్తోంది. మరి ఈ వారం కప్పు కోసం రాని వర్షిణి, హద్దులు దాటిన ముఖేష్ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో, సుధీర్ నిర్ణయం అతనికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది వీకెండ్ లో నాగార్జున ఎలా డీల్ చేస్తాడో చూడాలి మరి.

 

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com