Home

»

Tv News

Bigg Boss 10 Telugu: ఓటింగ్ లో ముఖేష్.. డేంజర్ లో నీతూ, రామ్ ప్రసాద్!

Nov 4, 2026 8:55AM

బిగ్ బాస్ తెలుగు 10 తొమ్మిదో వారం ఓటింగ్ లో ఊహించని ట్విస్ట్ లు కనిపిస్తున్నాయి. మొత్తం 10 మంది నామినేషన్ లో ఉండగా ముఖేష్ గౌడ్ అందరికీ షాక్ ఇస్తూ టాప్ పొజిషన్ లో దూసుకుపోతున్నాడు. తాజా ఓటింగ్ ట్రెండ్ ప్రకారం ముఖేష్ కు 37.01% ఓట్లతో 21,558 ఓట్లు వచ్చాయి. దేబ్జానీపై వ్యక్తిగత విమర్శలు చేశాడని నెగెటివిటీ వచ్చినా, అతని ఫ్యాన్ బేస్ మాత్రం స్ట్రాంగ్ గా పనిచేస్తోంది. రెండో స్థానంలో వంశీ 9.54% తో 5,557 ఓట్లతో ఉన్నాడు.

మూడో స్థానంలో దేబ్జానీ 7.44% (4,334 ఓట్లు), నాలుగో స్థానంలో వర్షిణి 7.15% (4,165 ఓట్లు) తో ఉన్నారు. ఇద్దరి మధ్య పెద్ద తేడా లేదు. సుధీర్ 7% తో 4,077 ఓట్లు, శివ్ కుమార్ 6.96% తో 4,054 ఓట్లు, అమన్ 6.61% తో 3,849 ఓట్లు, నరేష్ 6.45% తో 3,756 ఓట్లతో మధ్యలో ఉన్నారు. ఈ నలుగురి మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఒక్కో ఓటు కీలకం కానుంది.

ఇక డేంజర్ జోన్ లో రామ్ ప్రసాద్ 5.95% తో 3,464 ఓట్లు, నీతూ 5.9% తో 3,436 ఓట్లతో చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే రామ్ ప్రసాద్, నీతూ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే నీతూ ఔట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఓటింగ్ ముగియడానికి ఇంకా 2 రోజులు, 15 గంటలు ఉండటంతో ఫలితం ఎప్పుడైనా మారవచ్చు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com