ప్రకృతికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన మానస్
on Apr 14, 2025
డాన్స్ ఐకాన్ సీజన్ 2 నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక మరో సారి వైల్డ్ కార్డు ఎంట్రీగా మానస్ కొత్త కంటెస్టెంట్ తో వచ్చాడు. లాస్ట్ వీక్ ప్రియాంక జైన్ వెళ్లిపోయిన ప్లేస్ లోకి మళ్ళీ తీసుకొచ్చాడు ఓంకార్. ఇక అందరి పెర్ఫార్మెన్సెస్ చూసాక ఇదే ఫైనల్ ఎలిమినేషన్స్ అంటూ చెప్పాడు. ఇక మళ్ళీ ప్రక్రుతి మొదటికే వచ్చింది. మానస్ ని చూడగానే తాచులా బుస్సున పైకి లేచింది. ఈరోజు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్లనే నామినేట్ చేస్తున్నా అంది. వెంటనే సీరియస్ గా చూసాడు మానస్. "నాకు తెలిసి నేను ఇంకోసారి ఈ షో నుంచి బయటకు గెంటేయొచ్చు" అంటూ కొంచెం ఓవర్ కంటెంట్ ఇచ్చేసింది. దాంతో మానస్ కి కోపం తారాస్థాయికి పెరిగిపోయింది. "నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నన్ను ఎవరూ బయటకు తోసేయలేదు. నువ్వు వాడుతున్న పదాలు చాలా తప్పు " అన్నాడు. "అంటే దీనికంటే గౌరవం లేని యూజ్ చేస్తే అది తప్పు లేదు కానీ ఇది తప్పొచ్చిందా..పుష్ చేయొచ్చు అని నేను అనేసరికి అమ్మో చాలా తప్పైపోయింది " అంటూ ప్రకృతి కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. "ఐతే నువ్వు ఇంతకుముందువన్నీ కూడా మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావన్న మాట ..అంటే అసలు నేను ఎందుకు వచ్చానో చెప్పండి.
మళ్ళీ బయటకు పంపించడానికి పిలిచారా. అసలు ఆమె వాడిన పదం అసలు కరెక్టేనా...అసలు ఎం మాట్లాడుతుంది...ఎవరినైనా ఎలా గెంటేస్తుంది అసలు." అంటూ ఫైర్ అయ్యాడు. ఓంకార్ కూడా ఏమీ మాట్లాడకుండా వాళ్లనే చూస్తూ ఉన్నాడు. ఇక నెటిజన్స్ ఐతే ప్రకృతిని తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేరణా కంటే దారుణంగా ఉందేంటి ప్రకృతి అని అంటున్నారు. మెంటార్స్ ఎన్ని తిట్టుకున్నా కూడా కంటెస్టెంట్స్ మాత్రం చాలా బాగా డాన్స్ చేసి ఆడియన్స్ ని మెప్పించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
