డాన్స్ ఐకాన్ నుంచి ప్రియాంక జైన్ ఎలిమినేట్.. దీపికా డాన్స్ మాములుగా లేదు
on Apr 13, 2025
డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఈ వారం షో చాలా అద్భుతమైన డాన్స్ లతో అలరించింది. మెంటార్స్ విత్ కంటెస్టెంట్స్ కాబట్టి ఇద్దరి పెర్ఫార్మెన్సులు ఆడియన్స్ చూసే అవకాశం వచ్చింది. ఇందులో అందరూ మెంటార్ దీపికా పెర్ఫార్మెన్స్ చూద్దామనుకున్నారు. చూసేసారు.. ఐతే అందులో డాన్స్ లేదు కానీ ఆమె చేసే రెగ్యులర్ స్టెప్పులతోనే డాన్స్ కంపోజ్ చేసి స్టేజి మీద ఎక్కించారు. ఐతే ఆ డాన్స్ ఆమె ఎక్స్ప్రెషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇక శేఖర్ మాష్టర్ ఐతే ఫిదా ఐపోయాడు. చాలా తెలివిగా కొరియోగ్రాఫ్ చేసారు అంటూ కితాబిచ్చాడు.
ఇక ఫైనల్ గా ఎలిమినేషన్స్ రౌండ్ వచ్చేసరికి అందులో ప్రేరణ, ముమైత్ ఖాన్, ప్రియాంక జైన్ ఎలిమినేషన్స్ లో ఉన్నారు. ఈ ముగ్గురిలో ప్రియాంక జైన్ - కంచి టీమ్ ఎలిమినేట్ ఐపోయింది. ప్రియాంక కంటెస్టెంట్ కి ఓట్లు కూడా ఎక్కువగా రాకపోవడంతో వాళ్ళు షో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ స్టేజి తమకు దొరకడమే పెద్ద అవకాశం. నా ఫామిలీ కూడా ఇంతమంది డాన్సర్స్ తో ఇంకా ఎక్స్టెండ్ అయ్యింది. ఎంతో హ్యాపీనెస్ ని వెంట తీసుకెళ్తున్న అని చెప్పింది ప్రియాంక. ఈ స్టేజి మీద నుంచి ఎన్నో మెమొరీస్ ని తీసుకెళ్తున్నా అని చెప్పింది. అలాగే కంచి మంచి డాన్సర్ కానీ తాను ఎలిమినేట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదంటూ మెంటార్ యష్ అన్నాడు. అలాగే మిస్ యు కాంచి అంటూ దీపికా కొంచెం ఎక్సయిట్ అయ్యింది. అలా వీళ్ళు ఈ వారం షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.
ఐతే ఈ ఎపిసోడ్ లో ముమైత్ ఖాన్ అండ్ ప్రియాంక జైన్ రిటర్న్ గిఫ్ట్ లు ఇచ్చుకున్నారు. ప్రియాంక జైన్ - కంచి ఎల్లో శారీస్ లో "అబ్బని తియ్యని దెబ్బ" అనే సాంగ్ చేశారు. అలాగే ముమైత్ ఖాన్ - అన్షికా వచ్చి "ఇప్పటికింకా నా వయసు" సాంగ్ చేశారు. ఐతే ప్రియాంక సాంగ్ సెలక్షన్ సరిగా చేసుకోలేదని ముమైత్, ముమైత్ డాన్స్ అంత బాలేదని ప్రియాంక వోట్ వేసుకోలేదు. అలా ఈ వారం ఎలిమినేషన్ లో ప్రియాంక అవుట్ అయ్యింది. ముమైత్ ఐతే ఫారియాతో, యష్ తో, శేఖర్ మాష్టర్ తో డాన్స్ చేసి ఎంటర్టైన్ చేసింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
