Home

»

Tv News

Podharillu : శైలుకి వార్నింగ్ ఇచ్చిన కేశవ.. ఇంటి నుండి మహా వెళ్తుందా!

Mar 05, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -63 లో..... కేశవ తన ఫోన్ తీసుకొని డబ్బు ఇస్తేనే ఇస్తానంటున్నాడని శైలు తన ఫ్రెండ్ కి చెప్తుంది. ఇలా కాదు వాడిని రౌడీలతో బెదిరించాలని శైలు తన ఫ్రెండ్ కి చెప్తుంది. అప్పుడే తన ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వస్తాడు. అతని హెల్ప్ తీసుకోవాలనుకొని అతనికి విషయం చెప్తుంది. వాడి సంగతి నేను చూసుకుంటానని అతను అంటాడు. ఆ తర్వాత మహా ఇంటికి వస్తుంది. చక్రి, మాధవ అక్కడే ఉంటారు. మీకొక విషయం చెప్పాలి.. నేను ఒక రూమ్ రెంట్ కి చూసుకున్నాను. అడ్వాన్స్ కూడా ఇచ్చానని మహా చెప్పగానే చక్రి షాక్ అవుతాడు. ఎక్కడ అది అని చక్రి అడుగగా.. పక్కన అని మహా చెప్తుంది. ఆ తర్వాత చక్రి పక్క గల్లీలో మహా చూసుకున్న రూమ్ దగ్గరికి వెళ్తాడు.

ఓనర్ ని పిలిచి ఒకమ్మాయికి రూమ్ ఇచ్చారా అని అడుగుతాడు. అవును మీరెవరని అతను అడుగుతాడు. తన భర్తని ఇంట్లో చిన్న గొడవ అయిందని చక్రి చెప్పి ఫోటో చూపిస్తాడు. ఇలాగే ఒకసారి వెళ్తే ఆ రూమ్ ఓనర్ కి వాతలు పెట్టానని చక్రి అనగానే అతను భయపడి నేను ఎవరికి ఇవ్వను అంటాడు. ఈ విషయం తనతో చెప్పొద్దని చక్రి చెప్తాడు. దాంతో అతను భయపడి సరే అంటాడు. మరొకవైపు శైలు ప్లాన్ ప్రకారం కేశవకి ఫోన్ చేసి డబ్బు ఇస్తాను రమ్మని చెప్తుంది. దాంతో కేశవ వెళ్తాడు. కేశవ అడ్రెస్ కి వచ్చి ఉంటాడు. అప్పుడే శైలు ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ వచ్చి చేతిలో ఫోన్ లాక్కొని వెళ్తాడు. తనని కేశవ వెంబడిస్తాడు. అతను ఒక దగ్గర ఆగగా శైలు వాళ్ళు వస్తారు. ఎలా ఉంది నా ప్లాన్ అని శైలు అనగానే అతన్ని కేశవ కొడతాడు. దాంతో అతను అక్కడ నుండి వెళ్తాడు. శైలు దగ్గర నుండి కేశవ ఫోన్ లాక్కొని.. నీ వేషాలు నా దగ్గర సాగవని అంటాడు.

ఆ తర్వాత చక్రి ఇంటికి వచ్చి బాధపడతాడు. అప్పుడే వీడియోగ్రాఫర్ పెన్ డ్రైవ్ తెస్తాడు. ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి అంటాడు. మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. ఫోటోస్ ఎందుకని మాధవ అంటాడు. చక్రి పెన్ డ్రైవ్ తీసుకుంటాడు. మా ఇద్దరిది ఒక ఫోటో ఉంటే బాగుండు అనుకొని నారాయణని రెచ్చగొడుతాడు. ఒక్కసారి అన్న మా గురించి ఏదైనా చేసావా మా పెళ్లిది కనీసం ఒక ఫోటో అయిన ఫ్రేమ్ కట్టించావా అని చక్రి కోపంగా పెన్ డ్రైవ్ పడేస్తాడు. పెన్ డ్రైవ్ నారాయణ తీసుకుంటాడు. మరుసటి రోజు కన్నా వెళ్ళిపోయాక మహా వెళ్ళాలనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com