Home

»

Tv News

Brahmamudi : ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇందు డిగ్రీ పూర్తి చేస్తుందా.. అపర్ణని రాజు కలుస్తాడా!

Mar 05, 2026

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -971 లో..... కావ్య కూతురు ఇందు ప్రొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తుంది. కాఫీ చేసి చదువుకుంటున్న భ్రమరాంబ కూతురు స్వాతికి ఇస్తుంది. ఏంటి అక్క ఈ రోజు నీకు ఎగ్జామ్ ఉంది మర్చిపోయావా అని స్వాతి అడుగుతుంది. లేదు నాకు గుర్తు ఉంది రాత్రి చదువుకుంటూ రికార్డు చేసుకున్న వాటినే ఈ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని వింటున్నానని ఇందు చెప్తుంది. నువ్వు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డిగ్రీ పూర్తి చేసావని వాళ్లకి తెలిస్తే అని స్వాతి అంటుంది. ఎలా తెలుస్తుంది నువ్వు చెప్తావా ఏంటి నువ్వు నా సీక్రెట్ కీపర్ వి అని ఇందు అంటుంది. అప్పుడే ఇందుని భ్రమరాంబ పిలుస్తుంది. అక్క ఈ ప్రాబ్లమ్ అర్ధం అవడం లేదు కాస్త చెప్పవా అని స్వాతి అనగానే ఆమ్మో మీ అమ్మ పిలుస్తుందని భయంగా ఇందు వెళ్తుంది.

భ్రమరాంబకి కావలసినా జ్యూస్ లు అన్ని సిద్ధం చేసుకొని ఇందు వెళ్తుంది. అన్ని జ్యూస్ లు ఎందుకని తన భర్త శేషు అడుగుతాడు. ఆరోగ్యం గురించి అని భ్రమరాంబ చెప్తుంది. ఏంటే ఇంత లేట్ అని ఇందుపై భ్రమరాంబ కోప్పడుతుంది. ఇంట్లో అన్ని పనులు చేసేసరికి లేట్ అయిందని ఇందు చెప్తుంది. టిఫిన్ రెడీ చేసావా అని భ్రమరాంబ అడుగుతుంది. లేదని ఇందు చెప్పగానే మరి ఇక్కడ ఏం చేస్తున్నావ్.. వెళ్ళు అని భ్రమరాంబ కోప్పడుతుంది. ఆ తర్వాత సుభాష్ కి తాగడానికి జ్యూస్ తీసుకొని వెళ్తుంది ఇందు. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది అమ్మ.. నేను నీకు ఏం సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నానని సుభాష్ అంటుంటే సుబ్బు మళ్ళీ మొదలు పెట్టావా అని ఇందు అంటుంది. ఈ రోజు ఎగ్జామ్ ఉంది మర్చిపోయావా అని అపర్ణ అనగానే లేదు నానమ్మ అని ఇందు అంటుంది. మీరు నా గురించి ఏం బాధపడకండి పోయిన ఈ దుగ్గిరాల పేరుని, సంతోషాన్ని తిరిగి తీసుకొని వస్తానని ఇందు అంటుంది. నిన్ను చూస్తుంటే మీ అమ్మని చూసినట్టు ఉందే అని అపర్ణ అంటుంది.

ఇందు అక్కడ నుండి వెళ్ళిపోయాక.. మన మనవడిని కాపాడుకోలేకపోయాము.. వాడు ఉంటే ఇందుకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళమని అపర్ణతో సుభాష్ అంటాడు. మరొకవైపు రాజు ప్రొద్దున నిద్రలో కల కంటుంటే వాళ్ళ నాన్న వచ్చి కాలితో తంతాడు. దాంతో మంచం నుండి కిందపడతాడు. ఏంటి నాన్న ప్రొద్దునే అని రాజు కోప్పడతాడు. నువ్వు పని చేస్తున్నావని ఊళ్ళో బలాదూర్ తిరగడమే కదా.. మంచినీళ్ల ట్యాంక్ వచ్చింది.. వెళ్లి వాటర్ తీసుకొని రమ్మని చెప్తాడు. దాంతో చేసేదేమీ లేక రాజు బిందె పట్టుకొని వెళ్తాడు. అక్కడ చాలా మంది ఉండడంతో వాళ్ళని డైవర్ట్ చేసి నీళ్లు పడుతాడు రాజ్. దంతో వాళ్ళందరు రాజు పైకి గొడవకి దిగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com