జ్యోత్స్న మాస్టర్ ప్లాన్.. దాస్ ఏం చేయనున్నాడు!
on Jan 25, 2026
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -576 లో... కాంచన రావడంతో ఇల్లంతా సందడిగా మారుతుంది. అప్పుడే దాస్ గేట్ లోపలకి వస్తాడు. జ్యోత్స్న రౌడీలని పిలిపించి తీసుకొని వెళ్ళమని చెప్తుంది. నా కొడుకు వచ్చాడు నేను చూసానని పారిజాతం అంటుంది. ఒక కార్తీక్ తప్ప ఎవరు నమ్మరు. దాంతో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేద్దామని కార్తీక్ అంటే పారిజాతం సరేనంటుంది. అది విని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇక కార్తీక్ చెక్ చేస్తుంటే ఎర్రర్ అని వస్తుంది. ఆ సీసీటీవీ పని చెయ్యడం లేదని దశరథ్ చెప్పగానే జ్యోత్స్న రిలాక్స్ అవుతుంది.ఆ తర్వాత.. ఇదంతా ఎందుకు ఆ దాస్ వచ్చి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ వస్తాడులే అని శివన్నారాయణ అంటాడు.
నేను చెప్పేది అదే అని చెప్పి జ్యోత్స్న అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తన వెనకాలే పారిజాతం వెళ్తుంది. ఎందుకే నా మాటని కొట్టిపారేస్తున్నావని జ్యోత్స్నపై పారిజాతం కోప్పడుతుంది. నేను ఎక్కడ నా విషయం బయట పడుతుందోనని టెన్షన్ పడుతుంటే నువ్వేంటి అని జ్యోత్స్న అంటుంది. సరిగ్గా అద్దాలు పెట్టుకో దాస్ రాలేదు.. ఏం రాలేదని పారిజాతాన్ని జ్యోత్స్న దబాయిస్తుంది. ఆ తర్వాత అందరు కలిసి భోజనం చేస్తుంటే దీప నువ్వు కూడా తిను అని దశరథ్ అంటాడు. మీరు కడుపు నిండా తినండి. మీకు కడుపు నిండా భోజనం పెడితే నాకు తిన్నంత తృప్తిగా ఉంటుందని దీప అంటుంది. నా కూతురు పెళ్లి కాకుండానే చనిపోతానేమోనని భయంగా ఉందని సుమిత్ర అనగానే అమ్మ నిన్ను నీ కన్న కూతురు కాపాడుకుంటుంది. నువ్వేం బాధపడకు నీ చేతుల మీదుగా నా పెళ్లి జరుగుతుంది. నా పిల్లలతో ఆడుకుంటావని సుమిత్రతో జ్యోత్స్న అంటుంది. దాంతో కార్తీక్, దీప షాక్ అవుతారు. అసలు జ్యోత్స్న ఎందుకు అలా మాట్లాడిందని కార్తీక్, దీప అనుకుంటారు.
ఆ తర్వాత ఏంటే నెరవేరని వాగ్దానం చేసావని జ్యోత్స్నని పారిజాతం అడుగుతుంది. నా ప్లాన్ వేరే ఉంది. ఇప్పుడు నేను సైడ్ అవ్వాలని జ్యోత్స్న అంటుంది. నా అకౌంట్ లో డబ్బు సేఫ్టీగా ఉంచుకున్నానని ..ఇప్పుడు సైడ్ అయ్యి కొన్ని రోజుల తర్వాత రావాలి.. నేను వారసురాలిని కాదన్న నిజం చెప్పడానికి ఇప్పుడు దాస్ లేడు ఎవరు చెప్పరు. మా అమ్మ చనిపోతుంది. ఎప్పుడు రావాలో నాకు తెలుసు. అప్పుడు వచ్చి చక్రం తిప్పుతానని తనలో తను అనుకుంటుంది. ఏం ప్లాన్ చేసావే అని పారిజాతం అడుగగా.. చెప్పనని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత జ్యోత్స్న రౌడీకి ఫోన్ చేసి ఫోన్ స్పీకర్ లో పెట్టమని అంటుంది. నాన్న నువ్వు ఇక ఏం చెయ్యలేవని దాస్ తో జ్యోత్స్న అంటుంది. నాతోనే నిజం ఆగిపోతుందనుకొని నిజం ఎప్పటికైనా బయట పడుతుందని జ్యోత్స్నకి దాస్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



